Jump to content

శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం, కుప్పిలి

వికీపీడియా నుండి
శ్రీదేవి భూదేవి సహిత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు, కుప్పిలి, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా.

విజయనగర వాస్తవ్యులైన రాంభట్ల వెంకన్నగారు- సోమయాగం చేసి, సోమయాజులుగా ప్రసిద్ధులైనవారు - శ్రీరాజరాజేశ్వరీదేవి ఉపాసకులు. వారి కుమారులు – “కుప్పిలి డాక్టరు”గా ప్రసిద్ధులయిన డా. రాంభట్ల వేంకటరావుగారు (1900-1981). సేద్యం, వైద్యం, కవిత్వం, స్వరాజ్యసాధనాది విషయములలో లబ్దప్రతిష్ఠులు. వీరు శ్రీకాకుళంజిల్లా, కుప్పిలి గ్రామవాసి. వారి మార్గములో సనాతనధర్మమును పారంపర్యముగా అనుసరిస్తూ.. అనంతర తరము వారైన రాంభట్ల కుటుంబసభ్యులు అందరూ “డా. రాంభట్ల వేంకటరావు మెమోరియల్ ట్రస్ట్”ను 2007వ సంవత్సరములో స్థాపించి, ఆధ్యాత్మిక-సాహిత్య-ధార్మిక-సేవాకార్యక్రమాలను ఆంధ్రరాష్ట్రము, ఇతర ప్రాంతములలో నిర్వహించుచున్నారు.[1] డా. రాంభట్ల వేంకటరావుగారి స్వగ్రామం - శ్రీకాకుళంజిల్లా, ఎచ్చెర్ల మండలం, “కుప్పిలి” గ్రామం. అచ్చట ప్రాచీనశివాలయం [కుప్పేశ్వరుడు], కనీసం 200 సంవత్సరముల పూర్వం నుండి అలరారుతున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయములు ఉన్నవి. ఈ రామాలయప్రాంగణములో శ్రీలక్ష్మీదేవి ఉపాలయం కూడా విరాజిల్లుచున్నది. ఈ ఆలయములలో ఏటా పర్వదినములు, వసంతనవరాత్రులలో ఉత్సవములు, ప్రత్యేకపూజాది కార్యక్రమములు జరుగుచున్నవి.[2]

ప్రతిష్ఠ శిలాఫలకం

శ్రీకోదండరామస్వామివారి ఆలయప్రాంగణములో - శ్రీశ్రీశ్రీ శ్రీదేవి, భూదేవి సహిత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి నూతనదేవాలయము నిర్మించుటకు రాంభట్ల సూర్యకాంతకామేశ్వరి సంకల్పించి – శంకుస్థాపన కార్యక్రమమును స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామసంవత్సర ఫాల్గునశుద్ధదశమి తత్కాలఏకాదశి ఆదివారం పునర్వసు నక్షత్రయుక్త వృషభలగ్నమందు, తేది. 09-03-2025, ఉదయం గం. 10.54 ని. లకు యథావిధిగా నిర్వహించారు. మూడుమాసముల వ్యవధిలో - ఉభయ జగద్గురువుల అనుగ్రహంతో – శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి నూతన ఆలయ నిర్మాణమును కూడా పూర్తి చేయడమైనది.[3]

శ్రీకాకుళం(జి), ఎచ్చెర్ల(మ) కుప్పిలిగ్రామంలో శ్రీకోదండరామస్వామి ఆలయప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి దేవాలయ ధ్రువ, ఉత్సవ, శిఖరకలశ, గరుడాళ్వారుల ప్రతిష్ఠాపన కార్యక్రమమును - స్వస్తిశ్రీచాంద్రమాన శ్రీవిశ్వావసు నామసంవత్సర జ్యేష్ఠశుద్ధద్వాదశి స్థిరవారం చిత్తానక్షత్రయుత మిథునలగ్నమందు అనగా తేది 07-06-2025 ఉ. 7 గం. 46 ని. లకు (త్రయాహ్నికదీక్షతో తేది.4.6.25 జ్యేష్ఠశుద్ధనవమి నుండి తేది. 7.6.25 జ్యేష్ఠశుద్ధ-ద్వాదశి వరకు) పాంచరాత్రాగమ విధానంగా అత్యంతవైభవముగా జరుపుటకు దైవజ్ఞులచే నిశ్చయించడమైనది. [4]

ఈ నూతనాలయ నిర్మాణము, ప్రతిష్ఠాకార్యక్రమములను రాంభట్ల వేంకటరావు గారి కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు, గ్రామప్రజలు, ఇతరదాతలు అందించిన ధన, వస్తురూప విరాళములతో జరిపారు.

అభిషేకాలు - విశేషపూజలు వార్తలు

[మార్చు]
శ్రీకృష్ణాష్టమి ప్రత్యేక అలంకారం 2025

జగద్గురువుల అనుగ్రహం:

[మార్చు]

శృంగేరీ ఉభయజగద్గురువులు కూడా ఈ ఆలయనిర్మాణానికి సంతోషించి, ఆ ప్రాంతం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. శ్రీశ్రీ విధుశేఖరభారతీ సన్నిధానం వారు అనుగ్రహ ప్రసాదంగా ఆశీర్వాదశ్రీముఖుమును, శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారికి, శ్రీదేవి భూదేవి అమ్మవారలకు వస్త్రకానుకలను కూడా అనుగ్రహించారు.[5]

శ్రీశ్రీ ఉభయజగద్గురువుల ఆశీర్వాదశ్రీముఖం, శృంగేరి
శ్రీశ్రీ ఉభయజగద్గురువుల ఆశీర్వాదశ్రీముఖం, శృంగేరి

श्री श्री जगद्‌गुरु शङ्कराचार्य महासंस्कान दक्षिन्यायादारी

జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామివారి అరుగ్రహ సందేశము

అస్మదత్యంతప్రియ-శిష్య శతావధాని రాంభట్ల పార్వతీశ్వరశర్మగారికి నారాయణస్మరణపూర్వకా-శీస్సులు

మీరు, మీ కుటుంబసభ్యులందరూ "డా. రాంభట్ల వెంకటరావు మెమోరియల్ ట్రస్ట్" ద్వారా అనేక సత్కార్యములను నిర్వహించుచూ శ్రీకాకుళం జిల్లాలోని మీస్వగ్రామమైన కుప్పిలిలో దాదాపు రెండు శతాబ్దముల నుండి విరాజమానమగు శ్రీ కోదండరామాలయ ప్రాంగణములో మీ తల్లి గారైన రాంభట్ల సూర్యకాంత కామేశ్వరిగారి సంకల్పానుసారము సకలజగత్కల్యాణకారకుడగు శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ০৪ అల్పకాలములోనే సర్వాంగసుందరముగా భవ్యమైన నూతనదేవాలయమును నిర్మింపజేసి దానియందు శ్రీ విశ్వావసురేృష్ట శుక్లద్వాదశి. స్థిరవాసరమునాడు (7-6-2025) త్రయాట్నాకదీక్షతో సాంగముగా ప్రతిష్ఠాకుంభాభిషేక మహోత్సవమును అత్యంత వైభవోపేతముగా చేయించియుండుట మిక్కిలి ముదావహము. మీరు చేసిన ఈ సత్కార్యము వలస మీ కుటుంబమునకే కాక సమస్త గ్రామస్థులకూ సకల సజ్జనులకు కూడా సకల శ్రేయస్సులూ లభించునను విషయములో సందేహము లేదు. శ్రీ శారదా శశిశేఖరుల, దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు అనంతశ్రీ విభూషితులు మా గురువర్యులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థమహాస్వామి వారి పరమానుగ్రహముతో ఇట్టి సత్కార్యమునొనర్చిన మీకు, దీనియందు సహకరించిన సమస్తసజ్జనులకూ సకల శ్రేయస్సులూ లభించుగాక యనియూ ఆ ప్రాంతమంతయూ సువృష్టిసస్వాదిసమృద్ధమై సుభిక్షముగా నుండు గాక యనియూ ఆశీర్వదించుచున్నాము.

विधुशेखरभारती

విశ్వావసు ఆషాడ కృష్ణ దశమి-భానువాసర:

మూలాలు:

[మార్చు]
  1. "శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం, కుప్పిలి". Retrieved 2025-09-11.
  2. "శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం, కుప్పిలి". Retrieved 2025-09-11.
  3. "శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం, కుప్పిలి". Retrieved 2025-09-11.
  4. "శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం, కుప్పిలి". Retrieved 2025-09-11.
  5. "కల్యాణ వేంకటేశ్వర స్వామి కుప్పిలి".