శ్రీకాంత్ అడ్డాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకాంత్ అడ్డాల
శ్రీకాంత్ అడ్డాల (2014)
జననంసెప్టెంబరు 19
వృత్తిదర్శకుడు, పాటల రచయిత
క్రియాశీల సంవత్సరాలు2004-ప్రస్తుతం

శ్రీకాంత్ అడ్డాల తెలుగు సినిమా దర్శకుడు, పాటల రచయిత. అసోసియేట్ డైరెక్టర్‌గా చాలా సినిమాలకు పనిచేసిన శ్రీకాంత్ 2008లో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కలిసి నటించిన కొత్త బంగారు లోకం సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రం మంచి ఆదరణ పొందడమేకాకుండా, 2008 సంవత్సరంలో విజయవంతమైన చిత్రాలలలో ఒకటిగా నిలిచింది.

నేపథ్యము

[మార్చు]

శ్రీకాంత్ సెప్టెంబరు 19న పశ్చిమ గోదావరి జిల్లా, రేలంగి గ్రామంలో జన్మించాడు.

సినీ జీవితము

[మార్చు]

దర్శకుడు కాకమునుపు పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసాడు. ఆర్య 2, బొమ్మరిల్లు వాటిలో కొన్ని. ఇతని పనితీరు నచ్చిన నిర్మాత దిల్ రాజు ఇతనికి మొదటి అవకాశం ఇచ్చాడు. దిల్ రాజ్ సూచన మేరకు ఆరు నెలలపాటు కొత్త బంగారు లోకం సినిమా కథను తయారుచేశాడు.[2] ఈ చిత్రం వివిధ విభాగాలలో నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది. రెండు సంవత్సరాల తరువాత, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీస్టారర్ చిత్ర కథను రాసుకున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్, మహేష్ బాబు నటించిన ఈ చిత్రం 2013, జనవరి 11న విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన అందుకుంది.[3] 2014లో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా ముకుంద సినిమాను రూపొందించాడు. 2016, మే 16న ఇతని నాలుగవ చిత్రం బ్రహ్మోత్సవం విడుదలైంది. 2021లో ఇతని ఐదవచిత్రం నారప్ప విడుదలయింది.

చిత్రాలు

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమాపేరు నటవర్గం ఇతర వివరాలు
2008 కొత్త బంగారు లోకం వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్, ప్రకాష్ రాజ్, జయసుధ
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వెంకటేష్, మహేష్ బాబు, అంజలి, సమంత, ప్రకాష్ రాజ్
2014 ముకుంద వరుణ్ తేజ్, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, రావు రమేష్
2016 బ్రహ్మోత్సవం మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత సుభాష్
2021 నారప్ప వెంకటేష్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల [4]

పాటల రచయితగా

[మార్చు]
పాటపేరు సినిమాపేరు సంవత్సరం గాయకులు ఇతర వివరాలు
కళాశాలలో కొత్త బంగారు లోకం 2008 కృష్ణచైతన్య, ఆదిత్య, సిద్ధార్థ, క్రాంతి, శశికిరణ్, ఆదిత్య
ఆట పాటలాడు బ్రహ్మోత్సవం 2016 కార్తీక్

నటుడిగా

[మార్చు]
  • ఆర్య (2004)

మూలాలు

[మార్చు]
  1. "KBL". imdb. Retrieved 25 June 2020.
  2. "dil raju interview". idlebrain. Archived from the original on 15 December 2019. Retrieved 25 June 2020.
  3. "SVSC". idlebrain. Retrieved 25 June 2020.
  4. Andrajyothy (19 July 2021). "నాలో కొత్త యాంగిల్‌ బయటికొచ్చింది". chitrajyothy. Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.

బయటి లంకెలు

[మార్చు]