Jump to content

శ్రీకాంత్ ఓదెల

వికీపీడియా నుండి
శ్రీకాంత్ ఓదెల
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
  • నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు2016–ప్రస్తుతం

శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.

ఫిల్మ్‌ఫేర్ పురస్కారంతో శ్రీకాంత్ ఓదెల

సినీ జీవితం

[మార్చు]

శ్రీకాంత్ ఓదెల సినిమాల పట్ల ఆసక్తితో 2016లో టూ ఫాదర్ విత్ లవ్ షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించి, అవార్డ్స్ అందుకొని నాలుగేళ్ళ నిరీక్షణ ఆతర్వాత దర్శకుడు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో చేరి నాన్నకు ప్రేమతో (2016), రంగస్థలం (2018) సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.[1] ఆయన ఆ తరువాత 2023లో 'దసరా' సినిమాతో దర్శకుడిగా అరంగ్రేటం చేసి తొలి సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా ₹117.50 కోట్లకు పైగా వసూల చేసిన దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోగా, నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.[2][3]

శ్రీకాంత్ ఓదెల 2024లో తిరిగి నానితో తన రెండవ సినిమా ది ప్యారడైజ్ పేరుతో ప్రకటించాడు. 20224 డిసెంబర్‌లో చిరంజీవితో దర్శకుడిగా తన మూడవ చిత్రాన్ని ప్రకటించగా దీనిని నాని సమర్పిస్తూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.

ఆయన సమ్మక్క సారక్క క్రియేషన్స్‌ బ్యానర్‌ను స్థాపించి అల్ అమీనా జరియా రుక్సానా గులాబీ సినిమాను నిర్మిస్తున్నాడు.[4]

వివాహం

[మార్చు]

శ్రీకాంత్ ఓదెల తన స్వస్థలమైన గోదావరిఖనిలో 2023 మే 31న వివాహం చేసుకున్నాడు.[5][6]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం పేరు గమనికలు మూ
2023 దసరా దర్శకుడిగా తొలి చిత్రం [7][8]
2026 ది ప్యారడైజ్ † చిత్రీకరణ [9][10][11]
టిబిఎ మెగా 157 † ప్రకటించబడింది [12]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
అవార్డు విభాగం సినిమా ఫలితం మూ
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ తొలి దర్శకుడు దసరా గెలిచింది [13][14]
12వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ దర్శకుడు - తెలుగు గెలిచింది [15]
ఉత్తమ తొలి దర్శకుడు - తెలుగు నామినేట్ అయ్యారు [16][17]

మూలాలు

[మార్చు]
  1. "తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు.. ఇంతకీ ఎవరీ శ్రీకాంత్ ఓదెల ?." TV9 Telugu. 31 March 2023. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
  2. "Dasara Hit or Flop: A Box Office Analysis of Nani's Latest Telugu Movie!". 9 May 2023. Archived from the original on 20 July 2023. Retrieved 20 July 2023.
  3. "Dasara box office: Nani's blockbuster grosses Rs 100 crore worldwide, becomes actor's biggest ever hit as leading man". The Indian Express. 6 April 2023. Archived from the original on 1 June 2023. Retrieved 26 July 2024.
  4. "అందమైన ప్రేమ కథ". Sakshi. 17 March 2025. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
  5. "'Dasara' director Srikanth Odela gets married; see the newlyweds pic". The Times of India. 1 June 2023. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
  6. "Dasara director Srikanth Odela ties the knot, Nani showers love and blessings". India Today. June 2023. Archived from the original on 2 June 2023. Retrieved 25 July 2024.
  7. Eenadu (30 April 2023). "స్నేహితులు దిద్దిన జీవితం నాది". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  8. Eenadu (7 May 2023). "ఆయనతో ప్రయాణమే... ఓ పాఠం". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  9. "Nani and Srikanth Odela set to deliver second blockbuster with 'Nani 33'". The Hindu. 31 March 2024. Archived from the original on 5 April 2024. Retrieved 25 July 2024.
  10. "Nani 33 Big Update: Nani joins hands with Dasara director Srikanth Odela for his upcoming action drama". Pinkvilla. 30 March 2024. Archived from the original on 16 April 2024. Retrieved 25 July 2024.
  11. "'దసరా' ట్రయో ఈజ్ బ్యాక్". Chitrajyothy. 31 March 2024. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
  12. "Sandeep Reddy Vanga, 'Dasara' director Srikanth Odela meet Chiranjeevi after receiving Padma Vibhushan". The Statesman]. 28 January 2024. Archived from the original on 28 January 2024. Retrieved 25 July 2024.
  13. Filmfare (4 August 2024). "Full list of Winners of the 69th SOBHA Filmfare Awards South (Telugu) 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
  14. The Times of India (4 August 2024). "69th Sobha Filmfare Awards South 2024: Check out the winners". Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
  15. "SIIMA Winners List 2024 (Telugu, Kannada): Nani, Rakshit Shetty Win Best Actor; Mrunal Best Actress". News18 (in ఇంగ్లీష్). 2024-09-15. Retrieved 2024-09-15.
  16. "Siima awards 2024 Nominations list". Hindustan Times. Archived from the original on 17 July 2024. Retrieved 25 July 2024.
  17. Bharat, E. T. V. (2024-07-17). "SIIMA 2024 Nominations Revealed: Nani's Dasara and Rajinikanth Starrer Jailer Lead with 11 Nominations Each". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2024-07-21.

బయటి లింకులు

[మార్చు]