Jump to content

శ్రీకాంత్ (2024 సినిమా)

వికీపీడియా నుండి

శ్రీకాంత్ 2024లో విడుదలైన భారతీయ హిందీ భాషా జీవిత చరిత్ర సినిమా, ఇది దృష్టి లోపం ఉన్న పారిశ్రామికవేత్త & బోలంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితంపై రూపొందించబడింది.[1] రాజ్‌కుమార్ రావు టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాకి తుషార్ హిరానందిని దర్శకత్వం వహించాడు. జ్యోతిక, అలయ ఎఫ్ & శరద్ కేల్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా నవంబర్ 2022 నుండి జనవరి 2023 మధ్య భారతదేశం & యునైటెడ్ స్టేట్స్‌లోని వివిధ ప్రదేశాలలో రెండు నెలల్లో చిత్రీకరించబడింది. ఈ సినిమా 2024 మే 10న అక్షయ తృతీయ సందర్భంగా థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది, వాణిజ్యపరంగా నిరాడంబరమైన విజయాన్ని సాధించింది.

నటీనటులు

[మార్చు]
  • శ్రీకాంత్ బొల్లాగా రాజ్‌కుమార్ రావు
    • యువ శ్రీకాంత్ బొల్లాగా శ్రీకాంత్ మన్నా & అర్నవ్ అబ్దగిరే
  • దేవికా మాల్వాడేగా జ్యోతిక , శ్రీ టీచర్ & మెంటర్
  • వీర స్వాతిగా అలయ ఎఫ్ , శ్రీ ప్రేమికుడు
  • రవి మంథాగా శరద్ కేల్కర్, శ్రీ పెట్టుబడిదారుడు & స్నేహితుడు
  • APJ అబ్దుల్ కలాం పాత్రలో జమీల్ ఖాన్
  • శ్రీని తండ్రి దామోదర్ బొల్లాగా శ్రీనివాస్ బీసెట్టి
  • శ్రీ తల్లి వెంకటమ్మ బొల్లాగా అనూష నూతుల
  • మేజిస్ట్రేట్ గా భరత్ జాదవ్
  • వేణుగోపాల్ రావుగా శ్రీధర్ మూర్తి
  • విద్యా రెడ్డిగా సుఖిత అయ్యర్
  • రవి భార్య కవిత మంతగా వినీతా వేణుగోపాల్
  • యువ మహేష్ గా ఓం కనోజియా
  • మహేష్ గా శశిధర్ కొచ్చెర్లకోట
  • నరేంద్ర బొల్లాగా ఆరవ్ ఖోట్, శ్రీ తమ్ముడు
    • యువ నరేంద్ర బొల్లాగా అక్షయ్ చౌదరి
  • MIT లో శ్రీ స్నేహితురాలు కెల్లీగా క్లారిస్సా సైమాన్
  • ఎంఐటీలో శ్రీ స్నేహితుడైన ఎడ్వర్డ్‌గా సిబోనిసో టాడియస్ మ్బాథా
  • విష్ణువుగా అర్ణవ్ బన్సాల్
  • కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ గా అరుణ్ మాలిక్
  • పాఠశాల ఉపాధ్యాయుడిగా సౌరవ్ జోషి
  • వివేక్ మిశ్రా (ప్రత్యేక పాత్ర)
  • హన్సల్ మెహతా (ప్రత్యేక పాత్ర)
  • శ్రీకాంత్ బొల్లా తన పాత్రలో (ప్రత్యేక పాత్ర)
  • రవి మంత తన పాత్రలో (ప్రత్యేక పాత్ర)
  • 12 ఏళ్ల థామస్ గా సనత్ దేశ్ పాండే
  • విద్యుత్ అధికారిగా రజనీష్ శర్మ
  • క్లాస్‌మేట్‌గా అమన్ కనోజియా
  • హల్దీరామ్ ఓనర్‌గా మయాంక్ పరాఖ్

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (30 January 2022). "ఏపీకి చెందిన ఈ అంధుడి బ‌యోపిక్ తీయాల‌ని బాలీవుడ్ ఎందుకు ఆరాటపడుతున్నది?". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.

బయటి లింకులు

[మార్చు]