శ్రీచక్ర మహా మేరు యంత్రాలయం, ఏనుగుల మహల్

వికీపీడియా నుండి
(శ్రీచక్ర మహా మేరు యంత్రాలయం, ఏనుగుల మహల్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శ్రీచక్ర మహా మేరు యంత్రాలయం తూర్పు గోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రం. దీనిని స్థానికులు ఏనుగుమహల్ గుడి అని కూడా పిలుస్తారు . ఇక్కడ "లలితా మహా త్రిపుర సుందరి " అమ్మ వారు యంత్ర స్వరూపిణిగా భక్తులకు అభయమిస్తున్నారు. ఈ క్షేత్రం తెలుగు రాష్ట్రాలలో ఏకైక మేరు శ్రీ చక్ర ఆలయం. 1983 లో ఆధ్యాత్మిక శాత్రవేత్త పద్మశ్రీ గ్రహీత శ్రీ ప్రణవానంద తన తపశ్శక్తి ని ధారబోసి శ్రీ చక్రం ప్రతిష్టించారు . శ్రీ చక్ర లఘు పూజా విధానం , నవారణ పూజా విధానం , శ్రీ చక్రం పై 400 పేజీల సమగ్ర గ్రంధాన్ని శ్రీ ప్రణవానంద స్వామిజి రచించారు.[1][2] ఈ దేవాలయం తూర్పు గోదావరి జిల్లా , కొత్తపేట మండలం , రావులపాలెం నుండి 8 కి.మీ దూరంలో , మందపల్లి గ్రామ సమీపాన ఆలయం కొలువు అయివుంది .

ఆలయ పూజా విధానం[మార్చు]

సాధారణంగా 16 ఉపచారాలు చేస్తారు కానీ ఇక్కడ 64 ఉపచారాలు చేయడం ప్రత్యేకత . దసరా ఉత్సవాలు ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతాయి . దసరా ఉత్సవాలు లో భాగంగా నిత్యం నవావరణ అర్చన , పంచామృత అభిషేకం , లలిత సహస్రనామ కుంకుమార్చన , నిత్యం భాగవత , సుందరకాండ పారాయణం జరుగుతాయి .

మూలాలు[మార్చు]

  1. ఈ టీవీ న్యూస్ ఇన్ యూట్యూబ్. "Meru Sri Chakra Yantralayam @ Yenugula Mahal". Retrieved 27 June 2021.
  2. "రాష్ట్రంలోని ఏకైక మేరు శ్రీచక్ర ఆలయం విశిష్టత తెలుసా?". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2021-06-27.