Jump to content

శ్రీనివాస్ మానే

వికీపీడియా నుండి
శ్రీనివాస్ మానే
శ్రీనివాస్ మానే


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 నవంబర్ 2
ముందు సి.ఎం. ఉదాసి
నియోజకవర్గం హంగల్

పదవీ కాలం
2010 జనవరి 6 – 2021 నవంబర్ 2
ముందు అబ్దుల్ హకీమ్ ఎం. హిందసాగరి
తరువాత సలీం అహ్మద్
నియోజకవర్గం ధార్వాడ్ స్థానిక సంస్థలు

వ్యక్తిగత వివరాలు

జననం (1974-08-06) 1974 ఆగస్టు 6 (వయసు: 52)
నిప్పాణి , కర్ణాటక
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు విష్ణురావు మానే, నిర్మలా
జీవిత భాగస్వామి ఉషా మానే
సంతానం సూరజ్, విశాల్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం

శ్రీనివాస్ మానే కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనమండలికి రెండుసార్లు ఎమ్మెల్సీగా, శాసనసభకు హంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

శ్రీనివాస్ మానే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2010 నుండి 2021 వరకు కర్ణాటక శాసన మండలిలో ధార్వాడ్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పని చేసి చేశాడు. ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సి.ఎం. ఉదాసి చేతిలో 6,514 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1]

శ్రీనివాస్ మానే 2021లో హంగల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శివరాజ్ సజ్జనార్‌పై 7,373 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4] ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శివరాజ్ సజ్జనార్‌పై 21,945 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Bypoll: At Hangal, it is a proxy battle between Basavaraj Bommai, Siddaramaiah". The Times of India. 26 October 2021. Archived from the original on 26 April 2025. Retrieved 26 April 2025.
  2. ↑ "Hanagal Bypoll: Setback for K'taka CM Bommai in Home Turf, Cong Win Boosts Party's Morale". News18 (in ఇంగ్లీష్). 2 November 2021. Retrieved 2 November 2021.
  3. ↑ "Karnataka bypolls results: BJP wins Sindgi, Congress wins in Hangal" (in Indian English). The Hindu. 2 November 2021. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  4. ↑ "Karnataka: Popularity of candidates, not parties, drove Hangal and Sindgi bypoll results". The Times of India. 3 November 2021. Archived from the original on 26 April 2025. Retrieved 26 April 2025.
  5. ↑ "Karnataka Assembly Elections 2023: Hangal". Election Commission of India. 13 May 2023. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.