Jump to content

శ్రీపాల్ సింగ్ యాదవ్

వికీపీడియా నుండి
శ్రీపాల్ సింగ్ యాదవ్

పదవీ కాలం
1989  1996
ముందు శాంతి దేవి
తరువాత డి.పి. యాదవ్
నియోజకవర్గం సంభాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1942-04-06) 1942 ఏప్రిల్ 6 (వయసు: 84)
అహ్రోలనవాబాద్, బుదౌన్ జిల్లా, యునైటెడ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా, (ప్రస్తుత ఉత్తర ప్రదేశ్, భారతదేశం)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్
జీవిత భాగస్వామి రాజ్ కుమారి (1964 మే 27న)
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
నివాసం చందౌసి, మొరాదాబాద్ జిల్లా, ఉత్తర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు

శ్రీపాల్ సింగ్ యాదవ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

శ్రీపాల్ సింగ్ యాదవ్ జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి శాంతి దేవిపై 42497 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ హిందీ సలహా కమిటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

శ్రీపాల్ సింగ్ యాదవ్ 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హర్ పాల్ సింగ్‌పై 1705 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Sambhal Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 27 June 2025. Archived from the original on 27 June 2025. Retrieved 27 June 2025.
  2. "मुलायम सिंह यादव की कर्मभूमि संभल में बेहद रोचक हुआ मुकाबला, इन दो पार्टियों में होगी कांटे की टक्कर". ETV Bharat News. 20 April 2024. Archived from the original on 27 June 2025. Retrieved 27 June 2025.