శ్రీప్రియ (నటి)
శ్రీప్రియ | |
---|---|
![]() | |
జననం | |
క్రియాశీల సంవత్సరాలు | 1974 నుండి ప్రస్తుతం వరకు |
జీవిత భాగస్వాములు | రాజకుమార్ సేతుపతి |
పిల్లలు | స్నేహ, నాగార్జున్ |
శ్రీప్రియ 1970, 80 దశకాలలో కథానాయిక పాత్రలలో నటించిన దక్షిణ భారతీయ సినిమానటి. ఈమె తమిళ, తెలుగు,కన్నడ, మలయాళ భాషా చిత్రాలలో సుమారు 300లు పైగా నటించింది. వాటిలో 200 సినిమాలు తమిళ భాషా చిత్రాలు. ఈమె కొన్ని తమిళ, తెలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించింది.
వృత్తి[మార్చు]
నటిగా[మార్చు]
ఈమె 1974లో తొలిసారి సినిమా కెమెరా ముందు నిలబడింది. ఈమె రజనీకాంత్,కమల్ హాసన్, శివాజీ గణేశన్ మొదలైన హీరోల సరసన నటించింది. ఈమె 1970వ దశకంలోను, 80వ దశకం తొలి దశలోను వరుసగా విజయవంతమైన సినిమాలలో నటించింది. 1977లో నటించిన అవళ అప్పడితన్ అనే సినిమాలో నటనకు గాను తమిళనాడు రాష్ట్ర అవార్డు లభించింది. 1980లో కళైమామణి పురస్కారం ఈమెను వరించింది. ఈమె జాతీయ చలనచిత్ర అవార్డు కమిటీలోను, తమిళనాడు రాష్ట్ర సినిమా అవార్డు కమిటీలోను సభ్యురాలిగా వ్యవహరించింది.
ఈమె రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా ఎక్కువ సినిమాలు నటించిన నటీమణి. రజనీకాంత్, ఈమె జోడీగా 28 సినిమాలలో నటించారు. శ్రీదేవి తరువాత కమల్ హాసన్ సరసన ఎక్కువగా అంటే 30 సినిమాలలో కథానాయికగా నటించింది. కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ నటించిన సినిమాలలో కూడా ఈమె ఎక్కువగా నటించింది.[1]
మొత్తం మీద ఈమె 1973 నుండి 300లకు పైగా నాలుగు దక్షిణ భారత భాషా చిత్రాలలో నటించింది. వాటిలో 200 చిత్రాలు తమిళ చిత్రాలే. [2]
దర్శకురాలిగా[మార్చు]
ఈమె తమిళంలో 2 సినిమాలకు, కన్నడలో 2 సినిమాలకు తెలుగులో దృశ్యం సినిమాకు దర్శకత్వం వహించింది. ఐదు తమిళ సీరియళ్లకు కూడా దర్శకురాలిగా పనిచేసింది. ఈమె మంచి చిత్రకారిణి కూడా. ఈమె కొన్ని టెలివిజన్ సీరియళ్లకు సంభాషణలు వ్రాసింది.
వ్యక్తిగత జీవితం[మార్చు]
శ్రీప్రియ చెన్నైలో జన్మించింది. ఈమె సంప్రదాయక సంగీత కుటుంబం నుండి వచ్చింది. నాట్యకళాచక్రవర్తి పద్మశ్రీ కె.ఎన్.దండాయుధపాణి పిళ్లై, నాదస్వరచక్రవర్తి రాజమాణిక్యం పిళ్లైలు ఈమె మేనమామలు. ఈమె చెన్నైలోని చర్చ్ పార్క్ కాన్వెంట్ స్కూలులో చదివింది. ఈమె శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించింది. ఈమె 1988లో సినీనటుడు రాజ్‌కుమార్ సేతుపతిని వివాహం చేసుకుంది. వీరికి స్నేహ అనే కూతురు, నాగార్జున్ అనే కుమారుడు జన్మించారు.
సినిమాల జాబితా[మార్చు]
శ్రీప్రియ నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
సంవత్సరం | సినిమా | ఇతర నటులు |
---|---|---|
1975 | చిట్టెమ్మ చిలకమ్మ | |
1976 | అంతులేని కథ | రజనీకాంత్, కమల్ హాసన్, నారాయణ రావు, జయప్రద |
1977 | చిలకమ్మ చెప్పింది | రజనీకాంత్ |
1978 | దొంగల దోపిడీ | కృష్ణ |
1978 | పొట్టేలు పున్నమ్మ | మురళీమోహన్, కవిత |
1978 | వయసు పిలిచింది | కమల్ హాసన్, రజనీకాంత్, జయచిత్ర |
1978 | ఎత్తుకు పై ఎత్తు | కమల్ హాసన్, రజనీకాంత్ |
1979 | ఎవడబ్బ సొమ్ము | కృష్ణ |
1979 | అల్లావుద్దీన్ అద్భుత దీపం | కమల్ హాసన్, రజనీకాంత్ |
1979 | ఎవరో చూస్తున్నారు | కమల్ హాసన్, రజనీకాంత్ |
1979 | నాగ మోహిని | కమల్ హాసన్ |
1979 | దొంగ దొర | కమల్ హాసన్ |
1980 | హరే కృష్ణ హలో రాధ | కృష్ణ, రతి అగ్నిహోత్రి |
1981 | స్వామియే శరణం అయ్యప్ప | |
1983 | స్నేహాభిషేకం | కమల్ హాసన్ |