Jump to content

శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్

వికీపీడియా నుండి
శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్
నినాదంసత్యన్నాస్తి పరో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః
రకంఓపెన్ ప్రవేశాలు
స్థాపితం1972
వ్యవస్థాపకుడుసత్య సాయి బాబా
ప్రధానాధ్యాపకుడువై. శివరామకృష్ణ
స్థానంఅనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ప్రాంగణంపుట్టపర్తి

శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తిలో ఉన్న పాఠశాల. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాచే తన తల్లి శ్రీమతి ఈశ్వరమ్మ జ్ఞాపకార్థం 1972 జూలై 20న ప్రారంభించబడింది.[1]

ఈ నాన్ రెసిడెన్షియల్ పాఠశాల బాలురు, బాలికల కోసం ఒక ఇంగ్లీష్ మీడియం పాఠశాల, ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, న్యూఢిల్లీ కి అనుబంధంగా ఉంది. పాఠశాలలో అనుసరించే సిలబస్‌లు, పాఠ్యపుస్తకాలు న్యూఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సూచించి సిఫార్సు చేసినవి.

ఈ పాఠశాల ప్రశాంతి నిలయంలోని 'శ్రీ సత్యసాయి విద్యా గిరి' సముదాయం లోపల ఉంది. ఇది సీనియర్ బాలుర హాస్టల్, జూనియర్ బాలుర హాస్టల్ మధ్య, శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియం వెనుక ఉంది.

ఈ పాఠశాల విద్యను ఉచితంగా అందిస్తుంది. విద్యార్థులు బుధ, శనివారాల్లో భజనలకు హాజరు కావడానికి పుట్టపర్తిలోని ఆశ్రమం లోపల ఉన్న సాయి కుల్వంత్ హాలుకు వెళతారు.

మూలాలు

[మార్చు]
  1. ↑ "Timeline For Sathya Sai Baba – Time Line".