Jump to content

శ్రీరంజిని కొడమపల్లి

వికీపీడియా నుండి

శ్రీరంజిని కొడమపల్లి భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన కర్ణాటక సంగీతం కళాకారిణి. ఆమె శాస్త్రీయ కచేరీలలో ప్రదర్శనలు ఇస్తుంది, చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయని.[1] ఆమె ఎర్నాకులం మహారాజాస్ కళాశాలలో సంగీత విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నది.

ప్రారంభ జీవితం

[మార్చు]

కొడమపల్లి అప్పుకుట్టన్ పిళ్ళై, అంబికా దేవి దంపతుల కుమార్తె శ్రీరంజిని. వారు ఇద్దరూ సంగీతకారులు. ఆమె తాత, దివంగత కొడమపల్లి గోపాల పిళ్ళై, కర్ణాటకలోని తంజావూరు సంప్రదాయానికి చెందిన సంగీతకారుడు. ఆమె సోదరుడు కొడంపల్లి గోపకుమార్ కేరళకు చెందిన వయోలిన్ వాద్యకారుడు.

ఆమె సంగీతంలో 1వ ర్యాంకుతో బీఏ, ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేసింది. 2014 లో ఆమె బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి బి. జయశ్రీ మార్గదర్శకత్వంలో సంగీతంలో పిహెచ్డీ చదివింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2014లో, ఆమె తన భర్త ప్రదీప్ ఎస్ నాయర్‌తో కలిసి త్రివేండ్రంలో స్థిరపడింది.

కెరీర్

[మార్చు]

కర్ణాటక సంగీతం గాయనిగా తన పనితో పాటు, ఆమె దర్శకుడు షాజీ ఎన్ కరుణ్ రూపొందించిన స్వప్నమ్ చిత్రంలోని మాధవ మాసమో పాటతో సినీ సంగీత రంగంలోకి ప్రవేశించింది. దీనికి సంగీత దర్శకుడు శ్రీవల్సన్ జె మీనన్.

సత్యం ఆడియోస్ విడుదల చేసిన కొడమపల్లి ఆడియో ఆల్బమ్ నిద్ర - మ్యూజిక్ ఫర్ గుడ్ స్లీప్ విస్తృత ప్రశంసలు అందుకుంది. ఆమె పాశ్చాత్య సంగీతకారులతో అనేక ఫ్యూజన్ కచేరీలను, హిందుస్తానీ సంగీతకారులతో జుగల్బందీలను కూడా ప్రదర్శించింది.[2]

ఆమె ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లలో "ఎ" గ్రేడ్ కళాకారిణి.

ఆమె 2009లో యువ కళాకారిణికి కేరళ రాష్ట్ర ప్రభుత్వ చెంబాయి అవార్డును గెలుచుకుంది. 2017లో అత్యంత ప్రతిభావంతులైన యువ సంగీతకారిణిగా శ్రీరంజిని మావేలికార ప్రభావరామ పురస్కారాన్ని కూడా అందుకున్నది.

మూలాలు

[మార్చు]
  1. "Sreeranjini Kodampally performs with Stephen Devassy". The Times of India. 30 January 2019.
  2. "Sreeranjini Kodampally performs with Stephen Devassy". The Times of India. 30 January 2019.