శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం
భౌగోళికాంశాలు :18°26′13″N 79°07′27″E / 18.43694°N 79.12417°E / 18.43694; 79.12417Coordinates: 18°26′13″N 79°07′27″E / 18.43694°N 79.12417°E / 18.43694; 79.12417
పేరు
ఇతర పేర్లు:శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం
ప్రదేశము
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:కరీంనగర్
ప్రదేశం:వేములవాడ
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వేములవాడ రాజన్న
దిశ, స్థానం:తూర్పుముఖము
విమానం:స్వయంభూ విమానము
కవులు:వేములవాడ భీమకవి
ప్రత్యక్షం:బీమేశ్వరుడు

దేశంలో శివాలయాలకు కొదువ లేదు. కాని ఎన్నో విశిష్టతలకు ఆలవాలమైన శ్రీ రాజరాజేశ్వర ఆలయం కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ వెలసిన దేవుడు వేములవాడ రాజన్నగా తెలుగు నాట ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయానికి పౌరాణికమైన ప్రాశస్తమే గాక చారిత్రిక ప్రాముఖ్యత కూడా ఉంది. "ఛారిత్రికత:" ;వేముల వాడ పూర్వ నామం లేంబుల వాటిక. కాలక్రమంలో లేంబుల వాడగా ఆ తర్వాత వేముల వాడగా రూపాంతరం చెందినది. ఈ ఆలయాన్ని చోళ రాజులలో ప్రముఖుడైన రాజ రాజ నరేంద్రుడు నిర్మించినట్లు చరిత్రకాదారులున్నాయి. క్రీ.శ. 750 నుండి 175 సంవత్సరాలపాటు చాళుఖ్యులు, ఇస్వాకులు పాలించి నట్లు ఇక్కడ లభించిన చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తున్నది .ఆ రోజుల్లో ఈ ప్రాంతం శైవ, వైష్ణవ, జైన మతాలకు కేంద్రంగా వుండేదని తెలుస్తున్నది. అలాగే సంస్క్రుతం, కన్నడ భాషలు కూడా ఆదరణ పొందినవని శాసనాల వలన తెలుస్తున్నది. ప్రసిద్ధుడైన భీమ కవి ఇక్కడి భీమేశ్వరుని వర ప్రసాధమని నమ్మకం. విక్రమార్క విజయం అనే కన్నడ మహా కావ్యాన్ని రాసిన ప్రముఖ కన్నడ కవి పంప కవి ఆ మహా కావ్యాన్ని ఇక్క డే వ్రాశాడని చెబుతారు. తదుపరి కాలంలో ఈ ప్రాతం కాకతీయుల ఆదీనంలో, డిల్లీ సుల్తానుల ఆధీనంలో వున్నట్లు చరిత్రను బట్టి తెలుస్తున్నది. వేముల వాడలో వున్న మరో ప్రసిద్ధ ఆలయం భీమేశ్వరాలయం. దీన్ని క్రీ.శ.850–895 మధ్య కాలంలో రాజ్యాన్ని పాలించిన రెండో యుద్ద మల్లు కుమారుడైన బుద్దిగ భూపతి నిర్మించినట్లు తెలుస్తున్నది. రాజన్న ఆలయం..... స్థానికంగా రాజ రాజేశ్వరుని వేములవాడ రాజన్న అని ప్రేమతో పిలుచు కుంటారు భక్తులు. ప్రధాన ఆలయంలో రాజ రాజేశ్వరునికి కుడి వైపున రాజరేస్వరి అమ్మవారు, ఎడమ వైపున లక్ష్మి సమేత గణపతి ఉన్నారు. ఆలయ ముఖ ద్వారం పై గజలక్ష్మి, సింహ ద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఆలయం చుట్టూ బాల రాజేశ్వర, విఠలేశ్వర, ఉమామహేశ్వర, త్రిపుర సుందరీ దేవి ఆలయాలున్నాయి. దగ్గర్లోనె నగరేశ్వర, వేణుగోపాలస్వామి, మొదలగు ఆలయాలున్నాయి. అలేగే జగన్మాత స్వరూపిణి అయిన బద్ది పోచమ్మ వారి ఆలయం కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో మహమ్మదీయుల ధర్గా కూడా వుండడం విశేషం. దేవాలయం ప్రక్కనే వున్న ధర్మకుండం (పుష్కరిణి) చాల పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ధక్షయజ్ఞ సమయంలో వీరభద్రుని చేతిలో చేతులు కోల్పోయిన సూర్యుభగవానుడు, ఈ పుష్కరిణిలో స్నానం చేయగా చేతులు వచ్చాయని పురాణ గాథ. .

  • ఆలయ ప్రత్యేకత: ఏ ఆలయంలోలేని ప్రత్యేక సాంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. పిల్లలు పుట్టని దంపతులు పిల్లలు కలగాలని స్వామి వారికి మొక్కుకొని, పిల్లలు కలిగాక ఆ బాలునితో, ఒక కోడె దూడను తెచ్చి, ఆలయం చుట్టు తిప్పి ముందున్న స్థంబానికి కట్టి వెళతారు. దీన్నే కోడే మొక్కు అంటారు. కోడే దూడను తెచ్చుకోలేని దూర ప్రాంతం వారి సౌకర్యార్థం ప్రస్తుతం ఇక్కడ ఆ సమయానికి కోడే దూడలను అద్దెలకు ఇస్తారు. మహా శివ రాత్రి వంటి పర్వ దినాలల్లో కోడే మొక్కు చెల్లించుకొనే వారి సంఖ్య వేలలో వుండడాన్ని బట్టి చూస్తే ఈ ఆఅలయ ప్రాశస్త్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. అదే విధంగా స్వామివారికి బెల్లం సమర్పించడం కూడా ఇక్కడున్న మరో ఆచారం. మరెక్కడాలేని మరో ఆచారం కూడా ఇక్కడ మరొకటి ఉంది. అదేమంటే రోగాల బారిన పడిన లేక ఇతర కష్టాల బారిన పడిన స్త్రీలు రాజరాజేశ్వరునికి మొక్కుకొని అవి తీరాక ఆది బిక్షువు అడుగు జాడల్లోనే జీవితాంతం బిక్షాటనె వృత్తిగా చేసుకొని, పార్వతిగా మహా శివునికే అంకితమై పోతారు. అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో వుంటారు.

సేవా కార్యక్రమాలు......ఈ ఆలయ వార్షికాదాయం సుమారు 12 కోట్ల రూపాయలుంటుంది. వైద్య, విద్య విషయాలకు ఆలయం తరుపున ఖర్చు చేస్తుంటారు. వేముల వాడ, ధర్మపురి లలో, సంస్క్రుత పాథశాలలు నిర్వహిస్తున్నారు. పాలటెక్నిక్, డిగ్రీ కళాశాఅలలు నిధులను అందిస్తున్నారు. వైద్యపరంగా వేములవాడలో, హోమియోపతి, అల్లొపతి వైద్య శాలలను నడుపుతున్నారు. అదేవిదంగా ఆలయాల జీర్ణోద్దరణకు లక్షలాది రూపాయలను సమ కూర్చు తున్నారు..

వేముల వాడకు ఎలా వెళ్లాలి"[మార్చు]

....... అన్ని ప్రధాన పట్టణాల నుండి కరింనగర్కు బస్సు సౌకర్యం ఉంది. కరీంనగర్ నుండి ప్రతి గంటకు వాములవాడకి బస్సు సౌకర్యం ఉంది. సుదూర ప్రాంతాలనుండి రైల్లో వచ్చే భక్తులు వరంగల్ స్టేషనులో దిగి బస్సులో కరీంనగర్ చేరుకొని అక్కడి నుండి వేములవాడ వెళ్ల వచ్చు.