శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి
జననం 1888
విజయవాడ
మరణం 1951
జాతీయత భారతీయుడు
జాతి తెలుగు
వృత్తి తెలుగు, సంస్కృత పండితుడు, నాటక సినీ రచయిత.
బంధువులు సుబ్బలక్ష్మీ (భార్య)

శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి (1888 - 1951) తెలుగు, సంస్కృత పండితుడు, నాటక సినీ రచయిత.[1]

నాటకరంగ ప్రస్థానం[మార్చు]

1915లో రచన ప్రస్థానం ప్రారంభించిన సచ్చిదానందశాస్త్రి బెజవాడ మైలవరం నాటక కంపెనీకోసం సావిత్రి నాటకంను రాశాడు. ఈ నాటకంను వివిధ ప్రాంతాలలో విరివిగా ప్రదర్శించడంతో, మైలవరం నాటక కంపెనీ మంచి గుర్తింపు వచ్చింది.

అటు తరువాత సచ్చిదానందశాస్త్రి, మోతే నారాయణరావు ఏలూరులో స్థాపించిన మోతేవారి కంపెనీకి వెళ్లాడు. అక్కడ సావిత్రి నాటకాని మరో విధంగా రాసి, మొదటి నాటకంకంటే ఉత్తమంగా ప్రదర్శింపజేశాడు. ఇది (సావిత్రి రెండవ రచన) సినిమాగా కూడా వచ్చింది. సావిత్రి గంథ్రమండలి పేర ఒక ప్రచురణ సంస్థను ప్రారంభించి తన నాటకాలను ప్రచురించుకున్నాడు.

రచించిన నాటకాలు[మార్చు]

  1. సావిత్రి (1915)[2]
  2. లలిత (1939)
  3. బృంద (1941)
  4. దివోదాసు (1950)

సినీరంగ ప్రస్థానం[మార్చు]

  1. పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా) - సంభాషణలు[3]
  2. సతీ సావిత్రి (1957 సినిమా) - కథ

మూలాలు[మార్చు]

  1. శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 322.
  2. ఇండియా నెట్ జోన్. "Telugu Theatre, Indian Theatre". www.indianetzone.com. Retrieved 13 August 2017. 
  3. ది జమీన్ రైతు. "పాదుకా పట్టాభిషేకం" (PDF). www.zaminryot.com. Retrieved 13 August 2017.