శ్రీలంక ఎయిర్ లైన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీలంక ఎయిర్ లైన్స్
IATA
UL
ICAO
ALK
కాల్ సైన్
SRILANKAN
స్థాపన1947 (1947) (as Air Ceylon)
మొదలు1979 సెప్టెంబరు (1979-09)
HubBandaranaike International Airport
Focus citiesSuvarnabhumi Airport (Bangkok)
Frequent flyer program#Frequent Flyer Programme
Member loungeSerendib Lounge
AllianceOneworld
Fleet sizeSriLankan Airlines fleet
DestinationsSriLankan Airlines destinations
కంపెనీ నినాదంYou're Our World
ముఖ్య స్థావరంKatunayake, Sri Lanka[1]
ప్రముఖులుAjith Dias (Chairman) Rakhita Jayawardena (CEO)[2]
లండన్ హీత్రో విమానాశ్రయం వద్ద ఎయిర్బస్ ఎ340-300 ల్యాండింగ్
ఒక ఎయిర్బస్ A330-200 క్వాల లంపుర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాక్సింగ్ణ్
తిరుచిరాపల్లి విమానాశ్రయం వద్ద ఎయిర్బస్ A320

శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ శ్రీలంకలో ప్రధాన విమానయాన సంస్థ. కొలంబోలోని కాటున్యకే విమానాశ్రయం, మట్టల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం దీని కేంద్రాలు. శ్రీలంకన్ తన విమానాలను నేరుగా ఆసియా, యూరోపియన్, మధ్య తూర్పు దేశాలకు నడిపిస్తోంది. ఇతర సంస్థల భాగస్వామ్యంతో అమెరికా, ఓసినియాకు విమానాలు నడుపుతోంది. 2014 నుంచి దీనికి వన్ వరల్డ్ కూటమిలో సభ్యత్వం వచ్చింది. 1978లో శ్రీలంకన్ కాస్తా ఎయిర్ లంకగా మారింది. 1998లో తిరిగి శ్రీలంకన్ గా పేరు మార్చుకుంది. 2015 జనవరి నాటికి ఇది రక్షణలో 7/7 ఎయిర్ లైన్ రేటింగ్ సాధించింది.[3]

చరిత్ర[మార్చు]

ఆరంభంలో ఎయిర్ లంక రెండు బోయింగ్ 707 విమానాలను సింగపూర్ ఎయిర్ లైన్స్ నుంచి అద్దెకు తీసుకుని సేవలను ప్రారంభించింది. 1982 ఏప్రిల్ 15లో సొంతంగా ఎయిర్ లంక L1011 విమానాన్ని ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ నుంచి కొనుగోలు చేసింది. 1985 జూన్ 8లో మొదటి బోయింగ్ 747-200B "కింగ్ విజయ"ను తీసుకుంది. ఎయిర్ లంకకు ఆ దేశ ప్రభుత్వమే యజమానిగా ఉన్నప్పటికీ, 1998లో కొంత భాగం ప్రయివేటికరించారు. దుబాయికి చెందిన ఎమిరేట్స్ గ్రూపు US$70 మిలియన్ల పెట్టుబడితో 40% పెట్టుబడి పెట్టి ఆ తర్వాత దీనిని 43.6%కు పెంచుకుంది. పూర్తి నిర్వహణ బాధ్యతలను ఎమిరేట్ గ్రూప్ సంస్థకే అప్పగించారు. అప్పటి నుంచి ఎయిర్ లంక పేరును శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ గా మార్చారు.[4]

గమ్యాలు[మార్చు]

మార్చి 2015 నాటికి శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ తన భాగస్వామ్స సంస్థలతో కలిసి 49 దేశాల్లోని 96 గమ్య స్థానాలకు విమానాలు నడిపిస్తోంది.[5]

విమానాలు[మార్చు]

ఎయిర్ లైన్ తన మొదటి ఎయిర్ బస్ విమానాన్ని 1992లో తీసుకుంది. ఎయిర్ బస్ A320-200 విమానం మాల్దీవులు, పాకిస్థాన్, దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలకు మొదట ప్రయాణించింది. A340 విమానాలు 1994లో తెప్పించుకుంది. అధిక సామర్ధ్యం గల A340 విమానాలను ఆసియాలో ఉపయోగించిన తొలి విమాన సంస్థగా ఇది గుర్తింపు పొందింది. చంద్రిక అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ఎయిర్ బస్ A330-200 విమానాన్ని తెప్పించారు. ఈ విమానాన్ని ఐరోపా, సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతాల కోసం వాడారు.[6]

సదుపాయాలు[మార్చు]

శ్రీలంకన్ తన ఎయిర్ బస్ A330-300 విమానాల్లో ఆన్ బోర్డ్ వై-ఫై సౌకర్యం కల్పిస్తోంది.[7] శ్రీలంకన్ బిజినెస్ తరగతి విమానాల్లో నిద్రపోవడానికి సౌకర్యవంతమైన చదునైన బెడ్ కం సీట్లతో పాటు ఆడియో, వీడియో సౌకర్యాలు ఉంటాయి.[8]

ప్రత్యేక రంగులు[మార్చు]

శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ విమానాలు ప్రత్యేక రంగుల్లో ఉంటాయి. విమాన శరీర భాగమంతా తెల్లరంగు వేసి దాని పై నీలిరంగుతో “శ్రీలంకన్” అని సంస్థ పేరును మద్రించారు. తోక భాగంలో సంస్థ లోగోను ముద్రించారు.

అవార్డులు-విజయాలు[మార్చు]

 • 2008, 2009 సంవత్సరాల్లో – శ్రీలంక ప్రెసిడెన్షియల్ ట్రావెల్ & పర్యాటకం అవార్డులు.
 • 2010లో ఎయిర్ లైన్ ఆఫ్ ది ఇయర్ 2010 (మూడో సంవత్సరం).
 • స్కై ట్రాక్స్ నుంచి వరుసగా నాలుగు సార్లు మధ్య ఆసియా ఉత్తర ఎయిర్ లైన్ ఆవార్డు.
 • ట్రావెల్ & పర్యాటకంలో ఉత్తమ ప్రింట్ మీడియా ప్రెజెంటేషన్ అవార్డు.
 • ఉత్తమ ప్రాంతీయ అపెక్స్ అవార్డు గెలిలీయో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అంతర్జాతీయ అవార్డు.
 • కె.ఎల్.ఐ.ఎ. అవార్డు.
 • పి.ఎ.టి.ఎ. గోల్డ్ అవార్డు-2007.
 • హెచ్.ఆర్.ఎం. రజత అవార్డు- 2012 సహా మరెన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకుంది.

ప్రమాదాలు-సంఘటనలు[మార్చు]

 • 1986 మే 3లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం తీవ్రవాదసంస్థ UL512 విమానంలో పెట్టిన బాంబు బండారనాయకే అంతర్జాతీయ మానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో పేలిపోయిన ఘటనలో 14 మంది చనిపోయారు.
 • 1992లో ఎయిర్ లంక బోయింగ్ 737-200 విమానం మద్రాస్ విమానాశ్రయంలో దిగుతుండగా ప్రమాదానికి గురైంది. అప్పడు ఎవరూ గాయపడక పోయినా విమానం దెబ్బతింది. దాన్ని మరమ్మతులు చేయించి అమ్మేశారు.[9][10]
 • జూలై, 24, 2001న కొలంబో-బండార నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో తమిళ్ టైగర్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 19 మంది చనిపోయారు. వీరిలో 14 మంది ఉగ్రవాదులు, ఇద్దరు సైనిక కమాండర్లు, ముగ్గురు వైమానికదళ సిబ్బంది ఉన్నారు. రెండు శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలతో పాటు పలు సైనిక విమానాలు ధ్వంసమయ్యాయి.[45][46]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Airline Membership". IATA. Archived from the original on 2012-10-12. Retrieved 2015-04-14.
 2. "OUR AIRLINE - Board of Directors". Archived from the original on 2015-04-23. Retrieved 2015-04-14.
 3. "SriLankan Airlines Rating". Archived from the original on 2015-05-06. Retrieved 2015-04-14.
 4. "World Airline Directory.". "Airlift International" 57.
 5. "AC-UL code share". Digitaljournal.com. 20 October 2011.
 6. "SriLankan Airlines". Cleartrip. Archived from the original on 2014-07-06.
 7. "SriLankan Airlines flies its first fully-connected aircraft". 13 Nov 2014. Archived from the original on 18 ఫిబ్రవరి 2015. Retrieved 8 January 2015.
 8. "SriLankan AirTaxi". SriLankan Airlines. Archived from the original on 23 మార్చి 2012. Retrieved 23 March 2012.
 9. [1] Archived 2016-03-04 at the Wayback Machine CIVIL AVIATION AIRCRAFT ACCIDENT SUMMARY FOR THE YEAR 1992 (DGCA, India)
 10. "Intelligence failures exposed by Tamil Tiger airport attack". Jane's Intelligence Review. 2001. Archived from the original on 25 ఫిబ్రవరి 2008. Retrieved 9 April 2008.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)