Jump to content

శ్రీలంక రూపాయి

వికీపీడియా నుండి
శ్రీలంక రూపాయి
  • ශ්‍රී ලංකා රුපියල් (Sinhala)
  • இலங்கை ரூபாய் (Tamil)
  • Error {{native name list}}: an IETF language tag in |tag3= is required (help)
  • Error {{native name list}}: an IETF language tag in |tag4= is required (help)
ISO 4217
CodeLKR (numeric: 144)
Subunit0.01
Unit
Symbol₨, රු, ௹
Denominations
Subunit
1100సెంట్
Banknotes20, 50, 100, 500, 1000, 2000, 5000 రూపాయలు
Coins1, 2, 5, 10, 20 రూపాయలు
Demographics
User(s) Sri Lanka
Issuance
Central bankబోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఆఫ్ కరెన్సీ ఆఫ్ సిలోన్ (1884-1950)
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సిలోన్ (1950-1985)
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక (1986-)
Printerడి లా రూ లంకా కరెన్సీ అండ్ సెక్యూరిటీ ప్రింట్ (ప్రైవేట్) లిమిటెడ్
Mintరాయల్ మింట్, యునైటెడ్ కింగ్‌డమ్
Valuation
InflationPositive decrease -2.60 % (2024)
 Sourceసెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక
 MethodCPI
1973 నుండి US$1 కి మారకపు రేటు

శ్రీలంక రూపాయి (Sinhala: රුපියල්, Tamil: ரூபாய்; గుర్తు: ఆంగ్లంలో , సింహళంలో රු, తమిళంలో ; ISO కోడ్: LKR), 1972 వరకు దీనిని సిలోన్ రూపాయిగా పిలిచేవారు. ఇది శ్రీలంక కరెన్సీ. దీనిని 100 సెంట్లు (Sinhala: සත, Tamil: சதம்) గా విభజించారు, అయితే సెంట్ల విలువ చాలా తక్కువ కావడం వల్ల అవి వాడుకలో అరుదుగా కనిపిస్తాయి. దీనిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక జారీ చేస్తుంది. సాధారణంగా దీనికి Re (ఏకవచనం), Rs (బహువచనం) అనే సంక్షిప్త రూపాన్ని ఉపయోగిస్తారు, "రూపాయి" పేరు గల ఇతర కరెన్సీల నుండి స్పష్టంగా వేరు చేయడానికి పూర్తి భేదాత్మక సంక్షిప్త రూపంగా SL Rs ని సూచించాలని ప్రపంచ బ్యాంక్ సూచిస్తోంది.[1]

చరిత్ర

[మార్చు]

1825లో £1 = 13+13 రిక్స్‌డాలర్ల రేటుతో సిలోనీస్ రిక్స్‌డాలర్ స్థానంలో స్టెర్లింగ్ సిలోన్ అధికారిక కరెన్సీగా మారింది. బ్రిటిష్ వెండి నాణేలను చట్టబద్ధమైన ద్రవ్యంగా చేశారు. అంతకు ముందున్న రిక్స్‌డాలర్ నోట్ల స్థానంలో 1827లో స్టెర్లింగ్ డినామినేషన్ గల ట్రెజరీ నోట్లు జారీ చేశారు. మార్పిడికి తీసుకురాని రిక్స్‌డాలర్ నోట్లను 1831 జూన్‌లో రద్దు చేశారు.

1836 సెప్టెంబరు 26న భారతీయ రూపాయిని సిలోన్ ప్రామాణిక నాణెంగా చేశారు, సిలోన్ తిరిగి భారత కరెన్సీ పరిధిలోకి వచ్చింది. స్టెర్లింగ్ డినామినేషన్ గల ట్రెజరీ నోట్లు 1836 తర్వాత రూపాయితో పాటు చలామణిలో కొనసాగాయి. చట్టబద్ధమైన కరెన్సీగా బ్రిటిష్ వెండి నాణేలు మిగిలిపోయాయి, లెక్కలను పౌండ్లు, షిల్లింగ్‌లు, పెన్స్‌లలో ఉంచేవారు. అయితే, చెల్లింపులు రూపాయలకు రెండు షిల్లింగ్స్ అనే "ఫిక్టీషియస్ పార్" (స్థిర అకౌంటింగ్ రేటు) (అంటే £1 = రూ. 10/-) తో రూపాయలు, అణాలలో జరిగేవి.

సిలోన్ బ్యాంక్ ద్వీపంలో (1844) బ్యాంక్‌నోట్లను జారీ చేసిన మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్, ట్రెజరీ నోట్లు 1856లో ఉపసంహరించబడ్డాయి.

1869 జూన్ 18న భారతీయ రూపాయి అధికారికంగా అపరిమిత చట్టబద్ధ ద్రవ్యంగా (అన్‌లిమిటెడ్ లీగల్ టెండర్‌గా) స్థాపించబడింది. 1871 ఆగస్టు 23న రూపాయిని దశాంశీకరించారు. ఆ విధంగా, 100 సెంట్లు గల రూపాయి, ఒక రూపాయికి రెండు షిల్లింగ్స్ మూడు పెన్స్ స్టెర్లింగ్ మార్పిడి రేటుతో స్టెర్లింగ్ స్థానంలో 1872 జనవరి 1 నుండి సిలోన్ యొక్క అకౌంటింగ్ మనీగా, ఏకైక చట్టబద్ధమైన ద్రవ్యంగా (సోల్ లీగల్ టెండర్‌గా) మారింది.

1884లో సిలోన్ ఎదుర్కొన్న బ్యాంకింగ్, ద్రవ్య సంక్షోభం (దీనిలో ఆ ద్వీపంలోని అతిపెద్ద ఎక్స్ఛేంజ్ బ్యాంక్ అయిన ఓరియంట్ బ్యాంక్ తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంది), ఆ ప్రభావం మిగిలిన రెండు ఎక్స్ఛేంజ్ బ్యాంకులైన చార్టర్డ్ మెర్కంటైల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌లపై కూడా పడేలా చేసింది. దీంతో సిలోన్ ప్రభుత్వం కలుగజేసుకుని 1876లో మారిషస్‌లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఆధారంగా 1884 పేపర్ కరెన్సీ ఆర్డినెన్స్ను రూపొందించింది. ఈ పేపర్ కరెన్సీ ఆర్డినెన్స్ ద్వారా ఒక కరెన్సీ బోర్డుని, బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఆఫ్ కరెన్సీ ఆఫ్ సిలోన్‌ను స్థాపించారు, ఇందులో కలోనియల్ సెక్రటరీ, ట్రెజరర్, ఆడిటర్ జనరల్ ఉండేవారు. ఈ ఆర్డినెన్స్ ఒక సిలోన్ రూపాయికి ఒక భారత రూపాయి వంతున, నామమాత్రపు స్థిర మూల్యాకనం (నామినల్ పార్) వద్ద ఎటువంటి కమీషన్ లేకుండా కరెన్సీ కమిషనర్ల కార్యాలయం ద్వారా సిలోన్ కరెన్సీ నోట్లను, భారతీయ వెండి రూపాయలను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి అనుసంధానం చేసింది.[2][3]

ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కారణంగా 2022 ఏప్రిల్ నాటికి శ్రీలంక రూపాయి ప్రపంచంలోనే "అత్యంత తక్కువ పనితీరు కనబరిచిన కరెన్సీగా" మారింది. 29 ఏప్రిల్ 2022 నాటికి కరెన్సీ మారకపు రేటు US$1 = రూ. 350/- కు పడిపోయింది.[4]

నాణేలు

[మార్చు]
1870లో రాయల్ మింట్‌లో ముద్రించిన 1 సెంట్ నాణెం

1872లో, 1870 సంవత్సరాన్ని ముద్రించిన రాగి 14 సెంట్, 12 సెంట్, 1 సెంట్, 5 సెంట్ల నాణేలను ప్రవేశపెట్టారు. 1892లో వెండి 10 సెంట్లు, 25 సెంట్లు, 50 సెంట్ల నాణేలను ప్రవేశపెట్టారు. 1904లో 14 సెంట్ నాణేల ఉత్పత్తి నిలిపివేయబడింది. రాగితో చేసిన పెద్ద 5 సెంట్ల నాణేల స్థానంలో 1909లో గుండ్రని మూలలతో చతురస్రాకారంలో ఉండే చాలా చిన్న కుప్రో-నికెల్ నాణేన్ని ప్రవేశపెట్టారు. 1919లో, వినియోగించే వెండి నాణ్యతను .800 నుండి .550 కి తగ్గించారు.

1940, 1944 మధ్య, నాణేల ఉత్పత్తిలో భారీ మార్పులు జరిగాయి. 1940లో 12 సెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. 1942లో బరువు, మందం తగ్గించి కంచుతో చేసిన 1 సెంట్ నాణేన్ని ప్రవేశపెట్టారు. అదే సంవత్సరంలో 5 సెంట్ల నాణేంలో కుప్రో-నికెల్ స్థానంలో నికెల్-బ్రాస్‌ను వాడారు, 1943లో 25 సెంట్లు, 50 సెంట్ల నాణేలలో వెండి స్థానంలో కూడా దీనినే ఉపయోగించారు. 1944లో, అంచులు చెక్కిన నికెల్-బ్రాస్ 2 సెంట్లు, 10 సెంట్ల నాణేలను ప్రవేశపెట్టారు. అంచులు చెక్కిన ఈ 10 సెంట్ల నాణెం వెండి 10 సెంట్ల నాణెం స్థానంలో వచ్చింది. ఆ తర్వాత 1957లో జారీ చేయబడిన 2 సెంట్ల నాణేలు మాత్రమే ఆ కాలంలో ఎలిజబెత్ II రాణి చిత్రంతో జారీ చేయబడిన ఏకైక నాణేలు. 1952లో జార్జ్ VI మరణించిన తర్వాత కూడా అతని చిత్రపటంతో కూడిన నాణేలు చలామణిలో కొనసాగాయి. 1957లో, బౌద్ధమతం 2,500 సంవత్సరాల జ్ఞాపకార్థం కుప్రో-నికెల్ 1 రూపాయి నాణేలు, .925 వెండితో చేసిన 5 రూపాయల నాణేలను జారీ చేశారు.

1963లో, రాచరిక చిత్రపటాన్ని విస్మరించి, దానికి బదులుగా సిలోన్ ఆర్మొరియల్ ఎన్‌సైన్‌తో కొత్త నాణేలను ప్రవేశపెట్టారు. జారీ చేయబడిన నాణేలలో అల్యూమినియం 1 సెంట్, 2 సెంట్లు, నికెల్-బ్రాస్ 5 సెంట్లు, 10 సెంట్లు, కుప్రో-నికెల్ 25 సెంట్లు, 50 సెంట్లు, 1 రూపాయి నాణేలు ఉన్నాయి. ఈ నాణేలు అంతకు ముందున్న నాణేల ఆకారం, పరిమాణం కలిగి ఉండి వివిధ పదార్థాలతో తయారు చేయబడ్డాయి. 1976లో పరిమిత సంఖ్యలో జ్ఞాపకార్థ ఏడు-పలకల 2 రూపాయల నాణేలు, పది-పలకల 5 రూపాయల నాణేలను ప్రవేశపెట్టారు. 1978లో జరిగిన మూల్యహీనీకరణతో 5 సెంట్లు, 10 సెంట్ల నాణేలలో నికెల్-బ్రాస్ స్థానంలో అల్యూమినియం వాడాల్సి వచ్చింది, ఆ తర్వాత కొద్ది కాలానికే 1 సెంట్, 2 సెంట్ల నాణేల ఉత్పత్తి నిలిపివేయబడింది. కుప్రో-నికెల్ 2 రూపాయలు, అల్యూమినియం-బ్రాంజ్ 5 రూపాయల నాణేలను ఆయా నోట్ల స్థానంలో 1984లో ప్రవేశపెట్టారు. 1987లో జ్ఞాపకార్థ 10 రూపాయల నాణేలు విడుదల చేయబడ్డాయి. ఇవి 5 సెంట్ల నాణెంలాగే వృత్తాకార అంచులతో చతురస్రాకారంలో ఉన్నాయి. 1998లో ద్విలోహ (బైమెటాలిక్) జ్ఞాపకార్థ 10 రూపాయల నాణెం విడుదలైంది. అంతకు ముందున్న రూపాయి నాణేల లాగానే, ఆయా నోట్ల స్థానంలో ఉద్దేశించినవి కాకపోవడం వల్ల ఇవి కూడా పరిమిత సరఫరాలో మాత్రమే విడుదల చేయబడ్డాయి.

1972 నుండి జారీ చేసిన నాణేల ముందు భాగంలో రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ఆర్మొరియల్ ఎన్‌సైన్ ముద్రించబడింది. నాణెం వెనుక భాగంలో అంకెల్లో విలువతో పాటు దాని కింద సింహళం, తమిళం, ఆంగ్లంలో విలువను ముద్రించారు. నాణెం పై భాగంలో సింహళంలో శ్రీలంక అని, అడుగున జారీ చేసిన సంవత్సరం ముద్రించబడింది. తక్కువ డినామినేషన్స్ ఉన్న 1 సెంట్, 2 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్లు, 25 సెంట్లు, 50 సెంట్ల నాణేలు చలామణిలో లేవు, వాటి ముద్రణ నిలిపివేయబడింది.

కొత్త నాణేల ముందు, వెనుక డిజైన్లు అంతకు ముందు చలామణిలో ఉన్న నాణేలను పోలి ఉంటాయి. అయితే సులభంగా గుర్తించడానికి, ఉత్పత్తి ఖర్చును తగ్గించడానికి, వాటి బరువులను, కూర్పులను ఘన లోహమిశ్రమం (సాలిడ్ అల్లాయ్)కి బదులుగా ఎలక్ట్రోప్లేటెడ్ స్టీల్‌కు మార్చారు.

2017 సంవత్సరంలో, కొత్త స్టెయిన్‌లెస్ స్టీల్ నాణేల సిరీస్‌ను ప్రవేశపెట్టారు, ఇది ప్రస్తుతం చలామణిలో ఉంది.

2005 – శ్రీలంక పాత నాణేల సిరీస్
చిత్రం విలువ ముందు వైపు వెనుక వైపు లోహం వ్యాసం బరువు మందం అంచు సంవత్సరం
దస్త్రం:Bc0035 25c 2005.jpg 25 సెంట్లు ఆర్మొరియల్ ఎన్‌సైన్ దేశం పేరు, సంవత్సరం, విలువ రాగి పూత గల స్టీల్ 16.0 మి.మీ 1.68 గ్రా 1.2 మి.మీ సాధారణం 2005
దస్త్రం:Bc0036 50c 2005.jpg 50 సెంట్లు 18.0 మి.మీ 2.5 గ్రా 1.4 మి.మీ సాధారణం
దస్త్రం:Bc0037 1r 2005.jpg 1 రూపాయి ఇత్తడి పూత గల స్టీల్ 20.0 మి.మీ 3.65 గ్రా 1.7 మి.మీ మిల్డ్ (అంచులు చెక్కిన)
దస్త్రం:Bc0038 2r 2005.jpg 2 రూపాయలు నికెల్ పూత గల స్టీల్ 28.5 మి.మీ 7.0 గ్రా 1.5 మి.మీ మిల్డ్ (అంచులు చెక్కిన)
దస్త్రం:Bc0039 5r 2005.jpg 5 రూపాయలు ఇత్తడి పూత గల స్టీల్ 23.5 మి.మీ 7.7 గ్రా 2.7 మి.మీ లెటర్డ్ (అక్షరాలతో)
10 రూపాయలు నికెల్ పూత గల స్టీల్ 26.4 మి.మీ (హెండెకాగాన్- పదకొండు పలకలు) 8.36 గ్రా 2.1 మి.మీ సాధారణం 2009

2017 - కొత్త నాణేల సిరీస్

[మార్చు]
2017 శ్రీలంక కొత్త నాణేల సిరీస్[5]
చిత్రం డినామినేషన్ ముందు వైపు వెనుక వైపు లోహం వ్యాసం మందం ఆకారం అంచు సంవత్సరం
1 రూపాయి దేశం పేరు, ఆర్మొరియల్ ఎన్‌సైన్, సంవత్సరం (సింహళం, తమిళం, ఆంగ్లంలో వ్రాత) విలువ స్టెయిన్‌లెస్ స్టీల్ 20 మి.మీ 1.75 మి.మీ వృత్తాకారం ఇంటర్మిటెడ్ మిల్డ్ (మధ్యమధ్యలో అంచులు చెక్కిన) 2017
2 రూపాయలు 22 మి.మీ 1.75 మి.మీ నాచ్డ్ (గాట్లుగల)
5 రూపాయలు 23.5 మి.మీ 1.8 మి.మీ క్రమమైన మిల్లింగ్ అంచులతో
10 రూపాయలు 26.4 మి.మీ 1.8 మి.మీ ఎలెవెన్ లోబ్డ్ (పదకొండు వక్ర భాగాలు) క్రమమైన మిల్లింగ్ అంచులతో
20 రూపాయలు అల్యూమినియం కాంస్యం 28 మి.మీ 2.0 మి.మీ సెవెన్ లోబ్డ్ (ఏడు వక్ర భాగాలు) సాధారణం 2020

జ్ఞాపకార్థ నాణేలు

[మార్చు]

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక 1957 నుండి జ్ఞాపకార్థ నాణేలను జారీ చేసింది.

60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2010 డిసెంబరు 15న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక 5,000 రూపాయల డినామినేషన్‌లో ఫ్రాస్టెడ్ ప్రూఫ్ క్రౌన్ సైజు మల్టీ-కలర్ వెండి జ్ఞాపకార్థ నాణేన్ని జారీ చేసింది. ఇది సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన మొదటి బహుళ వర్ణ (మల్టీ-కలర్) నాణెం. శ్రీలంక 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సెంట్రల్ బ్యాంక్ 2023 మార్చి 9న 1000 రూపాయల జ్ఞాపకార్థ నాణేల కొత్త పరిమిత ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ 1000 రూపాయల జ్ఞాపకార్థ నాణేలు ఎంపిక చేసిన సెంట్రల్ బ్యాంక్ అమ్మకాల కేంద్రాలలో నాణేనికి రూ. 6,000 చొప్పున అమ్మకానికి ఉంచబడ్డాయి.[6]

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక జారీ చేసిన జ్ఞాపకార్థ నాణేలు:

నోట్లు

[మార్చు]
గవర్నమెంట్ ఆఫ్ సిలోన్, రూ. 5/- (1929)

సిలోన్ ప్రభుత్వం 1885లో మొదటిసారిగా రూపాయి నోట్లను జారీ చేసింది. 5 రూపాయల నోటు (1885-1925) తర్వాత 10 రూపాయలు (1894-1926), 1000 రూపాయల నోట్లను (1899, 1915) ప్రవేశపెట్టారు.[7] రెండవ సంచికలో 1 రూపాయి (1917-1939), 2 రూపాయలు (1917-1921), 50 రూపాయలు (1914), 100 రూపాయల (1919) నోట్లు జారీ చేశారు.[7] 1920ల కాలంలో (కొన్నిసార్లు 1930లలో కూడా) 1 రూపాయి (పైన పేర్కొన్న విధంగా), 2 రూపాయలు (1925-39), రెండు రకాల 5 రూపాయల నోట్లు (1925-28, 1929-39), రెండు రకాల 10 రూపాయల నోట్లు (1927-28, 1929-39), 50 రూపాయలు (1922-39), 100 రూపాయలు (1926-39), 500 రూపాయలు (1926), 1,000 రూపాయల (1929) నోట్లు అన్నీ చలామణిలో ఉండేవి.[8]

1941లో రెండు విడతలుగా నోట్లు జారీ చేశారు. మొదటి విడతలో 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నోట్లను కేవలం 1941లో మాత్రమే జారీ చేశారు.[9] కాస్త ముందుగా జారీ చేసినప్పటికీ, 1,000 రూపాయల నోటును (1938) ఈ సంచికలోనే కలిపారు.[10] 1941 రెండవ సంచికలో 1 రూపాయి (1941-49), 2 రూపాయలు (1941-49), 5 రూపాయలు (1941-49), 10 రూపాయలు (1941-46), 50 రూపాయలు (1941-45), 100 రూపాయలు (1941-45), 1,000 రూపాయలు (1941), 10,000 రూపాయల (1947) నోట్లు ఉన్నాయి.[nb 1][11] 1942లో, ఫ్రాక్షనల్ నోట్ల ఇష్యూను ప్రవేశపెట్టారు. 25 సెంట్లు, 50 సెంట్ల నోట్లు (1942)[12] తర్వాత రెండవ విడతగా 5 సెంట్లు (1942), 10 సెంట్లు (1942-43), 25 సెంట్లు (1942-49), 50 సెంట్ల నోట్లను (1942-49) జారీ చేశారు.[13]

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సిలోన్[nb 2] 1 రూపాయి, 10 రూపాయల నోట్లను (1951),[13] 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల నోట్లను (1952-54) జారీ చేసింది.[nb 3]

1963లో 1 రూపాయి నోట్ల స్థానంలో నాణేలను ప్రవేశపెట్టారు.

1977 నుండి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక నోట్లను జారీ చేస్తోంది. 1979లో 20 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు, ఆ తర్వాత 1981లో 500 రూపాయలు, 1,000 రూపాయల నోట్లు వచ్చాయి. 1998లో 200 రూపాయలు, 2006లో 2,000 రూపాయల (నిలిపివేయబడింది) నోట్లు జారీ చేశారు. శ్రీలంక నోట్ల వెనుక భాగంలో నిలువుగా ముద్రించడం వాటి ప్రత్యేకత. 1998లో స్వాతంత్ర్య 50వ వార్షికోత్సవం (1948-1998) సందర్భంగా 200 రూపాయల నోటును జారీ చేశారు. శ్రీలంకలో జారీ చేసిన మొట్టమొదటి పాలిమర్ నోటు ఇది, దీనిని నోట్ ప్రింటింగ్ ఆస్ట్రేలియా ముద్రించింది. మిగతా అన్ని డినామినేషన్లను శ్రీలంక ప్రభుత్వం, డి లా రూ సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో నడిచే డి లా రూ లంకా కరెన్సీ అండ్ సెక్యూరిటీస్ ప్రింట్ (ప్రైవేట్) లిమిటెడ్ ముద్రిస్తోంది.

శ్రీలంక మాజీ ప్రధాన మంత్రులు, మాజీ రాష్ట్రపతి మహింద రాజపక్స చిత్రపటాలు శ్రీలంక బ్యాంక్ నోట్ల ముందు భాగంలో ఉండగా, నోట్ల వెనుక భాగంలో శ్రీలంక జంతుజాలం, వృక్షజాలం, శ్రీలంక ప్రకృతి దృశ్యాలు, పరిశ్రమలు, శ్రీలంక సంస్కృతి, చరిత్ర, విజయాలను ప్రతిబింబించే చిత్రాలను ప్రచురించారు.

మారకపు రేటు

[మార్చు]

మూస:Exchange rate

శ్రీలంక రూపాయి ఒక పరిమిత (క్లోజ్డ్) కరెన్సీ, అంటే ఇది శ్రీలంక వెలుపల కొనడానికి లేదా అమ్మడానికి అందుబాటులో ఉండదు.[16] ఎవరైనా శ్రీలంక విమానాశ్రయం వద్ద లేదా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న కరెన్సీ అవుట్‌లెట్ల వద్ద దీనిని కొనుగోలు చేయవచ్చు.[మూలం అవసరం]

ఐఎమ్ఎఫ్ (IMF) మార్చి 20న శ్రీలంక కోసం $2.9 బిలియన్ల బెయిలౌట్‌ను ఖరారు చేయనున్నట్లు ప్రకటించడం, అప్పుల పునర్నిర్మాణ (డెట్ రీస్ట్రక్చరింగ్) ప్రయత్నాలలో శ్రీలంకకు సహాయం చేస్తామని చైనా హామీ ఇవ్వడంతో, 2023 మార్చి 7న డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.5% పెరిగి 250.8 వద్ద ట్రేడయ్యింది, దీని ద్వారా రూపాయి మారకపు విలువలో 14% పెరుగుదల నమోదైంది. అయితే, ఫిచ్ రేటింగ్స్ 2023 మార్చి 8న ప్రచురించిన అంచనా ప్రకారం, రూపాయి విలువ సుమారు 23% క్షీణించి సంవత్సరాంతానికి డాలర్‌కు 290 వద్ద జీవితకాల కనిష్టానికి చేరుకుంటుందని పేర్కొంది.[17]

అమెరికన్ డాలర్ / శ్రీలంక రూపాయి మారకపు రేటు
2022 మార్చి ప్రారంభంలో శ్రీలంక రూపాయి తన విలువను వేగంగా కోల్పోవడం ప్రారంభించింది

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • శ్రీలంక ఆర్థిక వ్యవస్థ

మూలాలు

[మార్చు]

ఫుట్‌నోట్స్

[మార్చు]
  1. 10,000 రూపాయల నోటును బ్యాంకుల మధ్య లావాదేవీలకు మాత్రమే ఉపయోగించేవారు.
  2. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సిలోన్ 1949లో మానిటరీ లా యాక్ట్ (MLA) నంబర్ 58 ద్వారా స్థాపించబడింది, 1950 ఆగస్టు 28న తన కార్యకలాపాలను ప్రారంభించింది.[14]
  3. 5 రూపాయల నోటు 1953లో జారీ కాలేదు[13], 10 రూపాయల నోటు 1953, 1954లో జారీ అయింది.[15]

నోట్స్

[మార్చు]
  1. "World Bank Editorial Style Guide 2020 - page 138" (PDF). openknowledge.worldbank.org. Archived (PDF) from the original on 2 August 2022. Retrieved 2022-08-22.
  2. Wijewardena, W. A. "A child's guide to currency board systems – Part I: How colonial Ceylon did it?". The Financial Times. Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
  3. Shenoy, B. R. (December 1941). "The New Currency Law in Ceylon". The Economic Journal. 51 (204): 512–515. doi:10.2307/2226385. JSTOR 2226385.
  4. Hogg, Charu Lata (April 24, 2022). "Sri Lanka's humanitarian crisis could be the start of a political upheaval". The Guardian. Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  5. "2017 - New Coin Series SRI LANKA". coins.lakdiva.org. Archived from the original on 14 January 2019. Retrieved 13 January 2019.
  6. "Limited number of 75th Ind Day commemorative coins for Sale". NewsWire (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-03-08. Archived from the original on 10 March 2023. Retrieved 2023-03-10.
  7. 7.0 7.1 Cuhaj 2010, p. 197.
  8. Cuhaj 2010, pp. 197–98.
  9. Cuhaj 2010, p. 198.
  10. Cuhaj 2010, p. 199.
  11. Cuhaj 2010, pp. 199–200.
  12. Cuhaj 2010, pp. 200–01.
  13. 13.0 13.1 13.2 Cuhaj 2010, p. 201.
  14. Linzmayer, Owen (2013). "Ceylon". The Banknote Book. San Francisco, CA: BanknoteNews.com. Archived from the original on 23 September 2015. Retrieved 2 May 2012.
  15. Cuhaj 2010, p. 202.
  16. "Currency in Sri Lanka : A Guide on Using LKR". 15 April 2021. Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  17. "Sri Lanka's Rupee Will Reverse Gains and Plummet 20%, Fitch Says". Bloomberg.com (in ఇంగ్లీష్). 2023-03-08. Retrieved 2023-03-10.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]