శ్రీలక్ష్మి చింతలూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీలక్ష్మి చింతలూరి(ఆంగ్లం:Srilakshmi Chinthaluri) ప్రముఖ నృత్య కళాకారులు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె స్వస్థలం విజయవాడ, ఈమె తోలేటి కృష్ణమూర్తి , కస్తూరి కామేశ్వరి దంపతులకు జన్మించారు. వీరికి ఏడుగురు అక్కలు,ఒక అన్నయ్య .చిన్నతనంలో వెంపటి చినసత్యం మాష్టారు అధ్వర్యంలో విజయవాడలో జరిగిన శ్రీనివాస కళ్యాణం నృత్య ప్రదర్శన శాస్త్రీయ నాట్యం పై ఆసక్తి పెంచుకున్నారు .కొత్తపల్లి పద్మ తొలి గురువు. ఆమె వద్ద కూచిపూడి అభ్యసించడం మొదలు పెట్టారు. తరవాత వాసిరెడ్డి కనక దుర్గ గారి వద్ద కొంత కాలం భరత నాట్యం లో శిక్షణ తీసుకున్నారు . కనక దుర్గ గారి వద్ద భారత నాట్యం లో డిప్లమో చేసారు .13 సంవత్సరాలు వచ్చేటప్పటికే భరత నాట్యం లో డిప్లమో పూర్తి చేసారు . కూచిపూడి కళా క్షేత్రంలో నేర్చుకున్నారు.గురువులు వేదాంతం రత్తయ్య, వేదాంత రాధేశ్యాం . కూచిపూడి లో సర్టిఫికేట్ . డిప్లమో , బి.ఏలో కూచిపూడి చేసారు .

ఉద్యోగం[మార్చు]

డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే ఉద్యోగం వచ్చింది .రైల్వేలో డాన్స్ విభాగంలో,1988 లో వచ్చింది . ఆల్ ఇండియా పోటిలలో సౌత్ సెంట్రల్ జోన్ కి ఆ సంవత్సరం ఈమె ఒక్కరే ఎంపిక కావడం విశేషం .

నృత్య రూపకాలు[మార్చు]

సమతా జ్యోతి , నమో వేంకటేశ ,శివోహం , కృష్ణ తత్వం (పూల బాలలు). నమో వేంకటేశ నృత్య రూపకాన్ని 100 కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు

పురస్కారాలు[మార్చు]

మద్రాసు లో జరిగిన సదస్సులో నాట్య విశారద , బాలభారతి వారు నాట్య నందిని అవార్డు . 1998 నృత్య అవార్డు , 2010 లో ఆరాధన సంస్థ నుండి జీవిత సాఫల్య పురస్కారం .

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]