శ్రీలేఖ మిత్ర
శ్రీలేఖ మిత్ర | |
---|---|
జననం | [1] | 1971 ఆగస్టు 30
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1993–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సిలాదిత్య సన్యాల్ (2003-2013)[2] |
పురస్కారాలు | బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ అవార్డు, ఆనందలోక్ అవార్డు |
వెబ్‌సైటు | sreelekhamitra.com |
శ్రీలేఖ మిత్ర, బెంగాలీ సినిమా నటి.[3] హోతాత్ బ్రిష్టి (1998), కాంతతార్ (2006), అస్కోర్జో ప్రొదీప్ (2013), స్వదే అహ్లాడే (2015), చౌకత్ (2015), రెయిన్‌బో జెల్లీ (2018) వంటి సినిమాలలో నటించి గుర్తింపు పొందింది.[4] బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ అవార్డును, ఆనందలోక్ అవార్డును అందుకుంది.
జననం
[మార్చు]శ్రీలేఖ, పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది. శ్రీలేఖ తండ్రి సంతోష్ మిత్రా, థెస్పియన్ నటుడు.[5] శ్రీలేఖ ఆక్సిలియం కాన్వెంట్ స్కూల్ నుండి ప్రాథమక విద్యలో ఉత్తీర్ణత సాధించింది.[6] జయపురియా కళాశాలలో తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీలో చేరి, కోల్‌కతాలోని తాజ్ హోటల్‌లో ఉద్యోగం రావడంతో చదువును వదిలేసింది.[7]
వ్యక్తిగత జీవితం
[మార్చు]శ్రీలేఖకు 2003లో సిలాదిత్య సన్యాల్ తో వివాహం జరిగింది. 2013లో వారిద్దరు విడాకులు తీసుకున్నారు.
సినిమారంగం
[మార్చు]దులాల్ లాహిరి దర్శకత్వం వహించిన బాలికర్ ప్రేమ్ అనే బెంగాలీ టివి సిరీస్ లో తొలిసారిగా నటించింది.[5] అనింద్య సర్కార్ దర్శకత్వంలో 1996లో వచ్చిన తృష్ణ అనే బెంగాలీ టివి సిరీస్ నబానిత పాత్రతో గుర్తింపు పొందింది.[8] బాసు ఛటర్జీ తీసిన హోతత్ బ్రిష్టి (1998) సినిమాలో నటించింది. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది.[9][10] బప్పాదిత్య బందోపాధ్యాయ తీసిన కంటటర్ (2006) లో సినిమాలో నటించి బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డు, ఆనందలోక్ అవార్డును పొందింది. సుమన్ ముఖోపాధ్యాయ్ తీసిన మహానగర్@కోల్‌కతా (2010) సినిమాలో నటించి, 2011లో సహాయ పాత్ర విభాగంలో ఉత్తమ నటిగా బిగ్ బంగ్లా మూవీ అవార్డును అందుకుంది.[11] 2012లో, ఉరో చితి (2011) లో నటనకు ఉత్తమ సహాయ నటి విభాగంలో జీ బంగ్లా గౌరవ్ సమ్మాన్‌ని అందుకుంది. అష్చోర్జ్యో ప్రోదీప్ (2013) లో పాత్రకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు, జీ బంగ్లా గౌరవ్ సమ్మాన్‌కు ఎంపికైంది.[12] రాజా దాస్‌గుప్తా తీసిన చౌకాత్ (2016) లో నటించి ప్రశంసలు అందుకుంది. రీమా ముఖర్జీ దర్శకత్వం వహించిన తొలి చిత్రం అర్ధాంగిని ఏక్ అర్ధసత్య (2016) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
అవార్డులు
[మార్చు]అవార్డు | సంవత్సరం | విభాగం | సినిమా | టివి సిరీస్ | ఫలితం | |
---|---|---|---|---|---|---|
బి.జె.ఎఫ్.ఏ. అవార్డు | 2007 | ప్రధాన పాత్రలో ఉత్తమ నటి | కంటటర్ | గెలుపు | ||
ఫిలింఫేర్ అవార్డ్స్ తూర్పు | 2014 | సహాయ పాత్రలో ఉత్తమ నటి | అశ్చోర్జ్యో ప్రోదీప్ | ప్రతిపాదించబడింది | ||
ఆనందలోక్ అవార్డు | 2006 | ప్రధాన పాత్రలో ఉత్తమ నటి | కంటటర్ | గెలుపు | [13] | |
2008 | ప్రధాన పాత్రలో ఉత్తమ నటి | టోలీ లైట్లు | ప్రతిపాదించబడింది | |||
జీ బంగ్లా గౌరవ్ సమ్మాన్ | 2012 | సహాయ పాత్రలో ఉత్తమ నటి | ఉరో చితి | గెలుపు | [12] | |
2014 | సహాయ పాత్రలో ఉత్తమ నటి | అశ్చోర్జ్యో ప్రోదీప్ | ప్రతిపాదించబడింది | [12] | ||
బిగ్ బంగ్లా మూవీ అవార్డు | 2010 | సహాయ పాత్రలో ఉత్తమ నటి | మహానగర్ @ కోల్‌కతా | గెలుపు | [14] | |
కళాకర్ అవార్డు | 2003 | ప్రధాన పాత్రలో ఉత్తమ నటి | ప్రతిబింబ | గెలుపు | [15] | |
2009 | ప్రధాన పాత్రలో ఉత్తమ నటి | టోలీ లైట్లు | గెలుపు | [15] |
మూలాలు
[మార్చు]- ↑ "মাকে বড্ড মিস করছি, জন্মদিনে কেঁদে ফেললেন শ্রীলেখা". anandabazar.com. Retrieved 2022-04-08.
- ↑ "আমার প্রাক্তন হ্যান্ডসম বলেই আর কাউকে সে ভাবে মনে ধরল না: শ্রীলেখা". anandabazar.com. 20 November 2020. Retrieved 2022-04-08.
- ↑ "Sreelekha Mitra movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2018-04-07. Retrieved 2022-04-08.
- ↑ "Sreelekha Mitra's explosive video, actor alleges superstars control casting in Bengali industry". The Times of India (in ఇంగ్లీష్). 20 June 2020. Retrieved 2022-04-08.
- ↑ 5.0 5.1 "'I'll never sell my soul to be No. 1'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-08.
- ↑ "প্রথম চুমু... মুখ খুললেন শ্রীলেখা". anandabazar.com. 28 August 2018. Retrieved 2022-04-08.
- ↑ "কোনও নায়ক, প্রডিউসার আমার প্রেমিক ছিলেন না, বিছানাতেও যায়নি, তাই আমি মিসফিট: বিস্ফোরক শ্রীলেখা". The Wall. 19 June 2020. Retrieved 2022-04-08.[permanent dead link]
- ↑ "শ্রীলেখা কারোর কাজ নিয়ে নেয় নি তো? স্বজনপোষণ বিতর্ক উস্কে দিলেন প্রিয়া কার্ফা". Zee24Ghanta.com. 21 June 2020. Retrieved 2022-04-08.
- ↑ "Hothat Brishti made me the Ferdous I am". Archived from the original on 17 June 2014.
- ↑ Singh, Shalu (20 June 2020). "Actor Sreelekha Mitra claims superstars govern casting in Bengali film industry". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-08.
- ↑ "92.7 BIG FM and Mustraj presents BIG Bangla Movie Awards 2010". EVENTFAQS Media. Retrieved 2022-04-08.
- ↑ 12.0 12.1 12.2 "I felt insulted and humiliated". www.telegraphindia.com. Retrieved 2022-04-08.
- ↑ "লাস্যময়ী শ্রীলেখার কিছু আবেদনময়ী ছবি". Khas Khobor. 8 August 2020. Retrieved 2022-04-08.[permanent dead link]
- ↑ "92.7 BIG FM and Mustraj presents BIG Bangla Movie Awards 2010". EVENTFAQS Media. Retrieved 2022-04-08.
- ↑ 15.0 15.1 "Kalakar award winners" (PDF). Kalakar website. Archived from the original (PDF) on 25 April 2012. Retrieved 2022-04-08.