శ్రీవల్లి భామిడిపట్టి
శ్రీవల్లి భామిడిపట్టి (జననం 2001 డిసెంబరు 12), జాతీయ జట్టు తరపున ఆడే భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి.[1] ఆమె 2025 మే 26 నాటికి డబ్ల్యుటిఎ సింగిల్స్ ర్యాంకింగ్లో 330వ స్థానంలో ఉంది. ఆమె భారతదేశంలో మూడవ అత్యధిక ర్యాంక్ కలిగిన మహిళా క్రీడాకారిణి.
ప్రారంభ జీవితం
[మార్చు]శ్రీవల్లి తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుకు చెందినది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన బి. ఆర్. ఎన్. ప్రసాద్, బి. రాజశ్రీ దంపతులకు ఆమె జన్మించింది. ఆమె హైదరాబాదు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె వాణిజ్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లండన్ లో చార్టర్డ్ అకౌంటెన్సీలో కోర్సు చేయాలని చేరింది.[2] ఆమె 11 సంవత్సరాల వయస్సులో టెన్నిస్ ఆడటం ప్రారంభించింది.[3] ఆమె హైదరాబాదులో కోచ్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది. తన ఆటను చక్కగా తీర్చిదిద్దడానికి ఢిల్లీకి చెందిన మాజీ డేవిస్ కప్ విశాల్ ఉప్పల్ సేవలను కూడా తీసుకుంది. ఆమె ఫీనిక్స్ గ్రూప్, లక్ష్య స్పోర్ట్స్ ఎడెల్గైవ్ ఫౌండేషన్ చేత స్పాన్సర్ చేయబడింది.[4]
కెరీర్
[మార్చు]ఏప్రిల్ 2025లో, శ్రీవల్లి పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓషియానియా గ్రూప్ 1లో సీనియర్ భారత మహిళల జట్టుకు అరంగేట్రం చేసింది. ఆమె ఐదు సింగిల్స్ మ్యాచ్ లు అన్నిటినీ గెలుచుకుంది, ఇందులో మూడు అధిక ర్యాంక్ కలిగిన ఆటగాళ్లపై విజయం సాధించినవి ఉన్నాయి.[5] భారత్ కప్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.[6] ఆమె మొదట న్యూజిలాండ్ కు చెందిన ఐషి దాస్ ను 6-1,6-1 తో ఓడించింది, తరువాత రెండవ సింగిల్స్ లో థాయిలాండ్ కు చెందిన లాన్లానా తారారుడీని 6-2,6-4 తో ఓడించింది.[7] ఆమె హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్లను కూడా గెలుచుకుంది.[7] 2025 ఏప్రిల్ 11న, ఆమె చైనీస్ తైపీకి చెందిన 207వ ర్యాంక్ జోవన్నా గార్లాండ్ ను 2 గంటల 38 నిమిషాల్లో 6-2,7-6 (7-3) తేడాతో ఓడించింది.[8][9] ఆమె ఐదవ, చివరి మ్యాచ్ లలో, ఏప్రిల్ 12న దక్షిణ కొరియాకు చెందిన 248వ ర్యాంక్ సోహున్ పార్కును 5-7,6-3,7-6 (7-5) తేడాతో 2 గంటల 52 నిమిషాల్లో ఓడించింది.[10][11][12]
ఫిబ్రవరి 2024లో, ఆమె డబ్ల్యుటిఎ ముంబై ఓపెన్లో పాల్గొంది. మార్చి 2024లో, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కొన్ని గంటల తర్వాత, ఆమె ఇండోర్ ఐటిఎఫ్ ఈవెంట్ ఫైనల్ ఆడింది.[13] డిసెంబరు 2024లో, మహారాష్ట్ర సోలాపూర్ లో జరిగిన ఒయాసిస్ సోలాపూర్ ఓపెన్ మహిళల ఐటిఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ ను ఆమె గెలుచుకుంది, ఫైనల్లో థాయిలాండ్ కు చెందిన తమ్చైవత్ బి ని 7-5,6-3 తేడాతో ఓడించింది.[14][15][16] 2023లో, ఆమె తన మొదటి సీనియర్ జాతీయ టైటిల్, ఫెనెస్టా ఓపెన్ నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2023ను గెలుచుకుంది.[17] నవంబరు 2023లో, బెంగళూరులో జరిగిన బౌరింగ్ ఇన్స్టిట్యూట్ ఐటిఎఫ్ ఉమెన్స్ వరల్డ్ టెన్నిస్ టూర్ ఫైనల్స్ ను గెలుచుకున్న ఆమె తన తొలి ఐటిఎఫ్ టైటిల్ ను గెలుచుకుంది.[18]
మూలాలు
[మార్చు]- ↑ "Shrivalli Bhamidipaty | Player Stats & More – WTA Official". Women's Tennis Association (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Shrivalli Bhamidipaty | Player Stats & More – WTA Official". Women's Tennis Association (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Accidental tennis star Shrivalli on a winning streak". The Indian Express (in ఇంగ్లీష్). 2025-04-12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ Subrahmanyam, V. V. (2023-10-14). "Rashmika focused on the present, wants to keep things simple". The Hindu (in Indian English). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Shrivalli Bhamidipaty | Player Stats & More – WTA Official". Women's Tennis Association (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Shrivalli Bhamidipaty | Player Stats & More – WTA Official". Women's Tennis Association (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- 1 2 "Shrivalli Bhamidipaty – 3 wins from 3 matches in Billie Jean King Cup matches at Pune". The Indian Express (in ఇంగ్లీష్). 2025-04-11. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Accidental tennis star Shrivalli on a winning streak". The Indian Express (in ఇంగ్లీష్). 2025-04-12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ IANS (2025-04-12). "BJK Cup 2025: Vaidehi, Shrivalli help India down Chinese Taipei; close in on a playoff spot". The Statesman (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Shrivalli Rashmikaa Bhamidipaty live scores, results, fixtures | Flashscore.in / Tennis". www.flashscore.in (in Indian English). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Billie Jean Cup 2025: Team India Seal Historic Playoffs Berth With Win Over Korea As Shrivalli Bhamidipaty Shines | Sports News". News18 (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ Srinivasan, Kamesh (2025-04-12). "Billie Jean King Cup: Indian team qualifies for Playoffs for the first time since 2020-21". Sportstar (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Shrivalli Bhamidipaty | Player Stats & More – WTA Official". Women's Tennis Association (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Shrivalli Bhamidipaty | Player Stats & More – WTA Official". Women's Tennis Association (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Accidental tennis star Shrivalli on a winning streak". The Indian Express (in ఇంగ్లీష్). 2025-04-12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Shrivalli Bhamidipaty | Player Stats & More – WTA Official". Women's Tennis Association (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "From Hyderabad, emerges another promising Indian Tennis Star: The Shrivalli Bhamidipaty story - Indian Tennis Daily". indiantennisdaily.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-12-03. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.
- ↑ "Shrivalli Bhamidipaty | Player Stats & More – WTA Official". Women's Tennis Association (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-14.