Jump to content

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం చిహ్నం
నినాదంజ్ఞానం సమ్యగవేక్షణం
ఆంగ్లంలో నినాదం
"జ్ఞానం సరైన దృక్పథంలో వుంటుంది"
రకంప్రభుత్వ విశ్వవిద్యాలయం
స్థాపితం1954 (1954)
బడ్జెట్INR 185.2 million (12th plan)[1]
ఛాన్సలర్బిశ్వభూషణ్ హరిచందన్
వైస్ ఛాన్సలర్ప్రొఫెసర్‌ టాటా నరసింగరావు[2][3]
రెక్టర్వి.శ్రీకాంత రెడ్డి
స్థానంతిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారత దేశం

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి జిల్లా తిరుపతి లోగల విశ్వవిద్యాలయము. 1954లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో ప్రారంభమైంది.[4] మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.

1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించడం విశేషం.

చరిత్ర

[మార్చు]

టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి లాంటి నాయకుల కృషితో 1954లో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.[5]

శాఖలు

[మార్చు]
విశ్వవిద్యాలయ పరిపాలనా భవనము నీలం సంజీవరెడ్డి భవన్
విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భముగా ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారము

తెలుగు శాఖ

[మార్చు]

తెలుగు శాఖ విద్యార్థుల సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులో ఉన్నాయి.[6]

అనుబంధ కళాశాలలు

[మార్చు]

ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ సైన్స్ కళాశాల, ఎస్వీ కామర్స్ మేనేజ్‌మెంట్ సైన్స్ , కంప్యూటర్ సైన్స్ కళాశల, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నాయి.

విద్యనభ్యసించిన ప్రముఖులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. UGC.ac.in State Universities, Andhra Pradesh
  2. "ఎస్వీయూ వీసీగా నరసింగరావు". Andhrajyothy. 9 October 2025. Retrieved 9 October 2025.
  3. "ఐదు విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Eenadu. 9 October 2025. Archived from the original on 9 October 2025. Retrieved 9 October 2025.
  4. ఆంధ్రమహిళ. Vol. 11 (6 ed.). మద్రాసు: ఆంధ్ర మహిళా సభ. 1954. p. 6.
  5. డి., సుందరరామ్. "105 వ చిత్తూరు జిల్లా ఆవిర్భావ దినోత్సవ సంచిక 2015" (PDF).
  6. "శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ సిద్ధాంత గ్రంథాలు". Retrieved 2018-12-18.