అక్షాంశ రేఖాంశాలు: 18°16′18.52″N 84°0′22.97″E / 18.2718111°N 84.0063806°E / 18.2718111; 84.0063806

శ్రీకూర్మం

వికీపీడియా నుండి
(శ్రీ కూర్మం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీకూర్మం
శ్రీకూర్మం దేవాలయం
శ్రీకూర్మం దేవాలయం
పటం
శ్రీకూర్మం is located in ఆంధ్రప్రదేశ్
శ్రీకూర్మం
శ్రీకూర్మం
అక్షాంశ రేఖాంశాలు: 18°16′18.52″N 84°0′22.97″E / 18.2718111°N 84.0063806°E / 18.2718111; 84.0063806
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం
మండలంగార
విస్తీర్ణం36.87 కి.మీ2 (14.24 చ. మై)
జనాభా
 (2011)[1]
16,973
 • జనసాంద్రత460/కి.మీ2 (1,200/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు8,402
 • స్త్రీలు8,571
 • లింగ నిష్పత్తి1,020
 • నివాసాలు4,341
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్532404
2011 జనగణన కోడ్581524
శ్రీకూర్మం-గుడి స్దంబం పై శాసనం
శ్రీకూర్మం దేవాలయం సాటిలైట్

శ్రీకుర్మం శ్రీకాకుళం జిల్లా, గార మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గార నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4341 ఇళ్లతో, 16973 జనాభాతో 3687 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8402, ఆడవారి సంఖ్య 8571. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1074 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 10. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 581524[2].

శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం

[మార్చు]

శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానంశ్రీకాకుళం నుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మం గ్రామంలో ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.

దేవాలయం ప్రశస్తి

[మార్చు]

శ్రీకూర్మం పూర్వపు కళింగ రాజ్యము లోని వరాహక్షేత్రములోని పాతాళసిద్ధేశ్వర క్షేత్రమే. ఇచటకల స్వయంవ్యక్త లింగమూర్తి బౌద్ధ మత ప్రభావం ఈప్రాతంలోలేని సమయంలో కళింగ దేశాధీశుడుఇన విజయసిద్ధి ప్రతిష్ఠించాడు.ఈ లింగమూర్తి వలయాకారపు పానవట్టముపై ఎత్తుగా ఉండి, దర్శన మాత్రమున లింగాకృతి కన్నులకు కట్టి యుండును.

శ్రీకూర్మం, అరసవల్లి, సిమ్హాచలం మొదలగునవి ప్రథమంలో శైవమతమునకు పుట్టినిల్లు. అయినప్పటికీ ఈనాడు వైష్ణవక్షేత్రాలుగా ఉన్నాయి.శ్రీకూర్మాలయం, సింహాచలాలలో గల శిలాశాసనాలను బట్టి ఆకాలమున నరహరి తీర్ధులచే వైష్ణవమతము కళింగమున వ్యాపించెనని తెలుస్తున్నది. ఈతని కాలమునాటి శిలాశాసనములు శ్రీకూర్మంలోనూ, సింహాచలం లోనూ చాలా ఉన్నాయి.

దీనిని సా.శ. 12వ శతాబ్దంలో వైష్ణవ మతాచార్యుడు శ్రీ రామానుజాచార్యులు తీర్ధయాత్ర సందర్భంగా కళింగదేశం వచ్చాడని, శైవలలో మత సంబంధమైన చర్చలు జరిపి శైవులను అవలీలగా వాగ్వివాదంలో జయించి వైష్ణవాలయంగా మార్చి శ్రీకూర్మనాధుడని నవీన నామకరణం చేసినట్లు సంస్కృతంలోగల ప్రన్నామృతం వలన తెలుస్తున్నది. నాటినుండి పాతాళసిద్ధేశ్వర ప్రశంస మాసిపోయి శ్రీకూర్మనాధ ప్రశస్తి ప్రబలింది. విష్ణుమూర్తిని కూర్మావతార రూపాన ఇచట పూజించటం వలన ఈదేవాలయాన్ని శ్రీకూర్మనాధాలయమనీ ఆగ్రామాన్ని శ్రీకూర్మమని పిలుస్తున్నారు.ఈ దేవాలయం చుట్టూగల స్తంభాల మంటపాలలో నల్లరాతితో చెక్కిన రమణీయమైన శిల్పాలు ఉన్నాయి. దేవకోష్టమునందు త్రివిక్రమ, పరశురామ, బలరామ, సరస్వతి, కుబేర, మహిషాసురమర్దిని, ఇంకనూ అనేక శంఖచక్రధారియైన విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయమునందు రెండు ధ్వజ స్తంభాలు ఉన్నాయి. విమానం చోళ రాజుల వాస్తు శిల్పకళారీతులలో నిర్మించారు. చక్కగా కుదురుటచే కాబోలు కుదురుకు కూర్మము చిలుకునకు సింహాచలము అను లోకోక్తి వచ్చింది. శ్రీకూర్మ పురాణం శైవసంప్రదాయసారమై ఉంది. దీనిని రాజలింగకవి మండచిట్టి కామశాస్త్రి ఆంధ్రీకరించారు. ఈ క్షేత్ర మహాత్యాన్ని దత్తాత్రేయులవారు వ్యాసమునీంద్రులకు వివరించారనీ, అందు స్థల పురాణం వలన స్వయంగా శ్రీహరిదత్తాత్రేయులకు శ్రీకూర్మనాధ మహాత్యాన్ని గూర్చి స్వప్నంలో చెప్పినత్లు చెబుతారు.

ఇచ్చటి శిలాశాసనముల వలన నాల్గవ శతాబ్దం నుండి పదునాల్గవ శతాబ్దం వరకు పాలించిన తూర్పు గాంగరాజుల చరిత్ర పూర్తిగా తెలుస్తున్నది. సా.శ. 1273లో పాలించిన తూర్పుచాళుక్య రాజైన రాజ రాజ నరేంద్రుడు తన ఆస్థానకవి అయిన నన్నయ్య భటారికుని సంస్కృతంలో కల భారతాన్ని తెనుగదించవలసినదిగా కోరినట్లు తెలిపే ఒక శాసనం ఉంది. ఆనాటి సాంఘిక, రాజకీయ, పరిస్థితులను వివరించే అనేక శాసనములు కూడా ఇక్కడ ఉన్నాయి.

తిరునాళ్ళు, ఉత్సవాలతో ఆస్తికులు ఆచరించే జీవిన విధానమే స్మార్తము. దీనిలో ఏ మతం వారైనా పాలు పంచుకొనే అవకాశం ఉంది. కాకతీయుల కాలంలో విరివిగా 'స్మార్తము' ఆచరించే కాలంలో, బౌద్ధ క్షేత్రంగా వెలుగొంది, అనంతర కాలంలో వైష్ణవ మత ప్రదేశంగా మారినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీకూర్మంతో పాటు సర్పవరం, బాపట్ల కూడా ఇదే రీతిన బౌద్ధ మత కేంద్రాల నుంచి వైష్ణవ మత స్థలాలుగా మారాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 23, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.

సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల శ్రీకాకుళంలో ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల మునసబ్ పేటలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు శ్రీకాకుళంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల శ్రీకాకుళంలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

శ్రీకుర్మంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

శ్రీకూర్మాం ఆలయ ముఖద్వారము

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

శ్రీకుర్మంలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

శ్రీకుర్మంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 267 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 48 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 325 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 43 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 130 హెక్టార్లు
  • బంజరు భూమి: 806 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2064 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1772 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1229 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

శ్రీకుర్మంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 916 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 219 హెక్టార్లు
  • చెరువులు: 93 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

శ్రీకుర్మంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులు

[మార్చు]