శ్రీ కృష్ణ జన్మభూమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ కృష్ణ జన్మభూమి
Krishnajanmabhoomi 1988A.jpg
ఆధ్యాత్మిక స్థానమైన దీని ప్రక్కనే ఉన్న మసీదు మరియు దేవాలయమును చూడండి
Coordinates27°30′20″N 77°40′10″E / 27.505433°N 77.669314°E / 27.505433; 77.669314Coordinates: 27°30′20″N 77°40′10″E / 27.505433°N 77.669314°E / 27.505433; 77.669314
శ్రీ కృష్ణ జన్మభూమి is located in ఉత్తర ప్రదేశ్Lua error in మాడ్యూల్:Location_map at line 389: Minutes can only be provided with DMS degrees for longitude.
ఉత్తర ప్రదేశ్ లో ప్రదేశం

శ్రీ కృష్ణ జన్మభూమి అనేది మథుర నగరంలో ఉన్న ఒక ధార్మిక దేవాలయం. ఈ ఆలయం పురాతన హిందూ మత దేవుడైన శ్రీకృష్ణుడి జన్మస్థలం.[1][2] ఇది కంసునికి చెందిన ఒక జైలు గది, ఇక్కడే శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు.

చరిత్ర[మార్చు]

చరిత్రకారుల ప్రకారం ఈ జైలు గది 'గర్భ గృహ' గా పేరొందింది, ఈ ఆలయ ఆవరణమే కృష్ణుడు జన్మించిన కచ్చితమైన ప్రదేశం. ఈ జైలు గది గోడ కంసరాజు యొక్క క్రూరత్వాన్ని గుర్తుచేస్తుంది. అనేక విగ్రహాలు మరియు పురాతన కాలానికి చెందిన శిల్పాలు ఇక్కడి తవ్వకాలలో కనిపించాయి. ఈ జైలు గది క్రమంగా మారి ప్రస్తుతం అందమైన దేవాలయమయింది. లక్షలాది భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి సమయంలో ఆలయం వద్దకు తరలి వస్తారు. ఇక్కడ పండుగ సమయాలలో జరిపే ఉత్సవాలు మరియు వేడుకలు భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. వేడుకలు శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన మధ్య రాత్రి సమయంలో ప్రారంభమవుతాయి.[1]

ప్రదేశం[మార్చు]

శ్రీ కృష్ణ జన్మభూమికి ప్రక్కనే ఉన్న కేశవ దేవ్ ఆలయం
శ్రీ కృష్ణ జన్మభూమికి సమీపంలో ఉన్న పొట్రా కుండ్ ఆలయ కోనేరు

శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన మథుర నగరం యమునా నది ఒడ్డున ఉన్నది మరియు ఇది రాజధాని నగరం ఢిల్లీకి సుమారు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం శ్రీకృష్ణ ప్రసిద్ధ కృష్ణ జన్మ భూమి మందిర్ భక్తులను అత్యంత గౌరవించే అతిధేయ ఆలయంగా ఖ్యాతి చెందింది. వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రదేశంలో భగవానుడు జన్మించాడని చెబుతుంటారు. పొరుగు పట్టణాలైన గోవర్ధన్, నందగావ్ మరియు బృందావన ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతం హిందువులకు ఒక ప్రధాన యాత్రా ప్రదేశం. ఈ ఆలయం మథుర నగరానికి మధ్యన ఉంది.[3]

పర్యాటక రంగం[మార్చు]

మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం భక్తులలో అత్యంత భక్తి విశ్వాసాలు నింపే ఆలయంగా ఉంది. దేవకి మరియు వాసుదేవులకి శ్రీకృష్ణుడు జన్మించిన ఈ ప్రదేశం ప్రముఖ పవిత్రాలయంగా విరాజిల్లుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

మహాభారతం - ఆంధ్ర మహాభారతం - వ్యాసుడు - కవిత్రయం

పర్వాలు

ఆది పర్వము  • సభా పర్వము  • వన పర్వము లేక అరణ్య పర్వము  • విరాట పర్వము  • ఉద్యోగ పర్వము  • భీష్మ పర్వము  • ద్రోణ పర్వము  • కర్ణ పర్వము  • శల్య పర్వము  • సౌప్తిక పర్వము  • స్త్రీ పర్వము  • శాంతి పర్వము  • అనుశాసనిక పర్వము  • అశ్వమేధ పర్వము  • ఆశ్రమవాస పర్వము  • మౌసల పర్వము  • మహాప్రస్ధానిక పర్వము  • స్వర్గారోహణ పర్వము  • హరివంశ పర్వము

పాత్రలు
శంతనుడు | గంగ | భీష్ముడు | సత్యవతి | చిత్రాంగదుడు | విచిత్రవీర్యుడు | అంబ | అంబాలిక | విదురుడు | ధృతరాష్ట్రుడు | గాంధారి | శకుని | సుభద్ర | పాండు రాజు | కుంతి | మాద్రి | యుధిష్ఠిరుడు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | దుర్యోధనుడు | దుశ్శాసనుడు | యుయుత్సుడు | దుస్సల | ద్రౌపది | హిడింబి | ఘటోత్కచుడు | ఉత్తర | ఉలూపి | బభృవాహనుడు |అభిమన్యుడు | పరీక్షిత్తు | విరాటుడు | కీచకుడు | ద్రోణుడు | అశ్వత్థామ | ఏకలవ్యుడు | కృతవర్మ | జరాసంధుడు | సాత్యకి | దుర్వాసుడు | సంజయుడు | జనమేజయుడు | వేదవ్యాసుడు | కర్ణుడు | జయద్రధుడు | శ్రీకృష్ణుడు | బలరాముడు | ద్రుపదుడు | | దృష్టద్యుమ్నుడు | శల్యుడు | శిఖండి
ఇతర విషయాలు
పాండవులు | కౌరవులు | హస్తినాపురం | ఇంద్రప్రస్థం | రాజ్యాలు | కురుక్షేత్ర యుద్ధం | భగవద్గీత