శ్రీ కృష్ణ లీల (1971 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ కృష్ణ లీల
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం హోమీ వాడియా
తారాగణం సచిన్,
హీరా,
జయశ్రీ గడ్కర్
సంగీతం బి.గోపాలం
నిర్మాణ సంస్థ బసంత్ పిక్చర్స్
భాష తెలుగు

శ్రీ కృష్ణ లీల 1971లో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఇదే పేరుతో వెలువడిన హిందీ సినిమా దీనికి మూలం.

నటీనటులు

[మార్చు]
  • సచిన్ - శ్రీకృష్ణుడు
  • హీనా - రాధ
  • జయశ్రీ గడ్కర్ - యశోద
  • సప్రూ -కంసుడు
  • మనోహర్ దేశాయ్
  • రత్నమాల
  • తబస్సుమ్‌
  • బాబీ
  • రతన్

సాంకేతికనిపుణులు

[మార్చు]
  • నిర్మాత, దర్శకత్వం: హోమీ వాడియా
  • మాటలు, పాటలు: ఆరుద్ర
  • సంగీతం: బి.గోపాలం
  • కూర్పు: బాలు
  • ఛాయాగ్రహణం: అనంత వాడేకర్
  • కళ: హీరూభాయ్ పటేల్
  • నృత్యాలు: సూర్యకుమార్, కిరణ్ కుమార్
  • నేపథ్య సంగీతం: ఘంటసాల, జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, వసంత

పాటలు

[మార్చు]
పాటల వివరాలు[1]
క్ర.సం. పాట గాయకులు
1 సత్యం శివం సుందరం అనుపమ అమర కృష్ణలీల మనోహర మధుర కృష్ణలీల ఘంటసాల బృందం
2 సతి యశోద పురిటి శయ్యపై నిదురించ ఏగుదెంచె విష్ణు యోగమాయ ఘంటసాల
3 పవళించు బాల ఆనందలోల పాడేనురా తల్లి మహమంచి జోల ఎస్.జానకి
4 కలయో వైష్ణవమాయయో కానిపించె బాలకృష్ణుని నోటిలో బ్రహ్మమొదలు విష్ణుశంకర మూర్తులు ఘంటసాల
5 విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ బి.వసంత
6 అల్లరి కృష్ణుడు నల్లన అందరి కన్నులు చల్లన ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
7 కృష్ణయ్యా రావేరా బాల నందకిశోరా కృష్ణయ్యా ఎల్.ఆర్.ఈశ్వరి
8 నవ ప్రభాత రేఖ అదిగో నవప్రభాత రేఖ ఎస్.జానకి
9 నారీ జగతి గోధన ఖ్యాతి గ్రామసంపద కదయ్యా ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
10 పనులన్నియు వీడుచు చనునొకతె పతిసేవను మరచెను సతి యొకతె ఘంటసాల
11 గోకులాన్ని వదిలి గోపాలుడేగంగ అడ్డగించిరి దారి నాప్తజనులు ఘంటసాల
12 సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ (శ్లోకం) ఘంటసాల
13 ధేనువు మురిసెను వేణువు మ్రోగెను ప్రాణుల బ్రోచెను మాధవుడు ఘంటసాల బృందం

చెల్లెలు దేవకీదేవిని ఆమె భర్త వసుదేవునితోబాటు అత్తవారింటికి కంసుడు సాగనంపే సమయంలో దేవకి ఎనిమిదవ కొడుకు కంసునికి మృత్యువు అవుతాడని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. భార్యాభర్తల్ని కారాగారంలో పెట్టి తన ప్రాణరక్షణకు ఏర్పాట్లు చేసుకుంటాడు కంసుడు. వారి మొదటి కొడుకును దయతో వదలిపెట్ట దలచినా, నారదుడు ఎనిమిదవ కొడుకు ముందు వెనుకగా ఎప్పుడైనా పుట్టవచ్చని హెచ్చరిస్తాడు. దానితో కంసుడు దేవకికి పుట్టిన ఏడుగురు కొడుకులను వరుసగా చంపివేస్తాడు. ఎనిమిదవ కొడుకును ఆకాశవాణి సూచన ప్రకారం గోకులంలోని నందుని భార్య యశోద పుత్రికతో మారకం చేస్తాడు వసుదేవుడు. దైవాంశతో పుట్టిన ఆ బాలునికి యమునా నది రెండు పాయలుగా చీలి దారిని ఇస్తుంది. ఆ బాలుడే కృష్ణుడు. యశోద పుత్రికగా జన్మించిన యోగమాయ, తనను చంపచూచిన కంసునికి కృష్ణుని ఉనికిని తెలియజేస్తూ మాయమౌతుంది. కంసుని ఆజ్ఞ ప్రకారం గోకులంలోని పురిటి బిడ్డలనందరిని రాక్షసులు చంపసాగారు. తనను చంపడానికి వచ్చిన రాక్షసుణ్ణి అత్యాశ్చర్యకరంగా చంపి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తాడు బాలకృష్ణుడు.

ఎన్నో రకాలైన చిలిపి చేష్టలు చేస్తూ పెరిగి పెద్దవాడైన కృష్ణుడు ఒక సారి రాధను కలిసి ఆమె ప్రేమను చూరగొంటాడు. తనను చంపడానికి వచ్చిన కొంతమంది రాక్షసులను మట్టుపెట్టి గోకులంలో అందరికీ అభిమానపాత్రుడవుతాడు. రాధ భర్త అనయదాసు కంసుని రాజ్యాంగాన్ని బలపరుస్తూ గోకులవాసుల్ని కంసుని అధికారం క్రిందికి తెద్దామని ప్రయత్నించి విఫలుడౌతాడు. దీనికి ప్రతీకారంగా మరికొంతమంది రాక్షసుల్ని గోకులానికి పంపి మళ్ళీ అవమానితుడౌతాడు కంసుడు.

రాధతో సమానంగా తమను గౌరవించడలేదని మొరపెట్టుకున్న గోపికలను ఊరడించడానికి శరత్‌పౌర్ణిమ నాడు రాసక్రీడలు జరిపి వారిని ఆనందపరుస్తాడు కృష్ణుడు. ధనుర్యాగానికి రమ్మని పిలుపుతో బాటు వచ్చిన అక్రూరుడిని తోడిచ్చి నందుడు, గోకులవాసులు కన్నీళ్ళతో మధురకు సాగనంపుతారు. ముష్ఠికుడు అనే ఆస్థాన మల్లుని అవలీలగా ఓడించి, కంసుని మాయాయుద్ధంలో వధిస్తాడు శ్రీకృష్ణుడు. తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ, తన ప్రవర్తనను మార్చుకున్న అనయదాసును క్షమిస్తాడు కృష్ణుడు.[1]

మూలం

[మార్చు]
  1. 1.0 1.1 ఆరుద్ర (1971). Sri Krishna Leela (1971)-Song_Booklet (1 ed.). బొంబాయి: బసంత్ పిక్చర్స్. p. 16. Retrieved 29 July 2022.