Jump to content

శ్రీ త్రికూటేశ్వర వీరభద్ర క్షేత్రం (నాగులపహాడ్)

వికీపీడియా నుండి

నాగుల పహాడ్ క్షేత్రం సూర్యాపేట జిల్లా, పెన్ పహాడ్ మండలంలో ఉంది. ఈ క్షేత్రం హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి నూట నలభై ఎనిమిది కిలోమీటర్లు, సూర్యాపేట నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యాపేట నుంచి కోదాడ విజయవాడ హైవేలో వెళితే దురాజ్ పల్లి క్రాస్ రోడ్స్ వస్తుంది. ఇక్కడి నుంచి పెన్ పహాడ్ రోడ్ లోకి అంటే కుడివైపు రోడ్ లోకి తీసుకోవాలి. ఇంత అద్భుత శిల్పకళను మనం మరెక్కడా చూసి ఉండం. చూస్తే ఆశ్చర్యపడాల్సిందే. ఒక ఊరు రెండు ఎనిమిది వందల ఏళ్ల నాటి పురాతన శివాలయాలు. అందులో ఒక ఆలయంలో మూడు బ్రహ్మసూత్ర శివలింగాలు. బ్రహ్మసూత్ర శివలింగం అని కనిపిస్తోందా మనకు? భార్యాభర్తలు పోటీపడి కట్టించిన ఆలయాలు. భవిష్యత్తు చెప్పే మంత్ర దర్పణం. సూర్యాపేట జిల్లాలో మూసీనది ఒడ్డున అద్భుత క్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో పురాతన ఆలయాలకు కొదవే లేదు అనిపిస్తోంది. ఎక్కడ చూసినా సరే చాలా పురాతన ఆలయం. కొంత వందల సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆలయాలు మనకు కనిపిస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం ఆ తర్వాత పిల్లలమర్రిలో కూడా ఈ మధ్య ఎరకేశ్వర స్వామి ఆలయం మరి రెండు శివాలయాలను కూడా పురాతన శైలిలో ఉన్న ఆలయాలను తెలిసికున్నాము. ఇక్కడి నుంచి మరో ఇరవై కిలోమీటర్ల దూరం. ఈ పెన్ పహాడ్ రోడ్లో ఇలాగే వెళితే అనంతారం X రోడ్ వస్తుంది. ఇక్కడి నుంచి కుడివైపు రోడ్లోకి వెళ్ళి అనంతారం ఊర్లోకి వెళ్ళిన తర్వాత నేరేడ్చర్ల రోడ్ లోకి వెళ్ళాలి. ఇదే route లో అన్నారం, నారాయణగూడెం దాటిన తర్వాత నాగుల పహాడ్ చేరుకుంటాం. ఇదే రోడ్ లో ఎడమవైపు వరుసగా పురాతన ఆలయాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇక మనం మన మజిలీని చేరుకున్నట్లే. ఈ ఆలయం చరిత్ర విషయానికొస్తే కాకతీయులు నిర్మించిన శైలిలో కనిపించే ఈ ఆలయాలను కాకతీయుల సామంతరాజులైన రేచర్ల వంశస్థులు నిర్మించారు. రేచర్ల నామిరెడ్డి పుత్రులు అయిన రేచర్ల కాటిరెడ్డి, రేచర్ల కామిరెడ్డిలు, నామిరెడ్డి భార్య, తమ తల్లి అయిన ఐతమ్మ. ఈమెనే ఐతాంబిక అని పిలిచేవారు. ఆమె పేరిట ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. నామిరెడ్డి పెద్ద కుమారుడైన కాటిరెడ్డి మనం చూస్తున్న ఈ త్రికూటాలయాన్ని పన్నెండు వందల యాబై ఆరులో నిర్మించారట. త్రికూటాలయం అంటే ఒకే ఆలయంలో మూడు గర్భాలయాలు ఉండటం. అయితే ఇక్కడ మూడు ఆలయాల్లోనూ శివలింగ రూపాలే ఉండటం విశేషం. ఉన్న ఒక ఊర్లో ఇటువంటి ఆలయాన్ని చూస్తాం అయితే మనం ఊహించలేని ఎంత అద్భుతమైన శిల్పకళ ఇక్కడి నుంచే మనకు కనిపిస్తుంది మధ్యలో ఉన్న మంటపము నంది మంటపం అదేవిధంగా ఆ చూడండి ఇక్కడ కూడా ఎంత అద్భుతంగా ఉంది. ఈ నాట్య మంటపం అంటే ఈ స్తంభాలు కూడా శబ్దాలు వివిధ రకాల సరాగాలు పలుకుతాయని మనము పిల్లల మర్రిలో కూడా మనం చూసాము అంటే ఈ నాట్య స్తంభాల వరకు కూడా వివిధ రకాల సరాగాలు పలికే నాట్య స్తంభాలు ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి. చూడండి వివిధ రకాల ఈ శబ్దాలు అంటే రాగాలు పలుకుతూ ఉన్నాయి. అంటే ఈ స్తంభాలని ఎంత అద్భుతమైన ఇంజనీరింగ్ పనితనం చూడండి అప్పట్లోనే మనకు కొన్ని వందల సంవత్సరాల కింద ఈ technique అండి ఇప్పుడు ఎవరైనా నిర్మించగలుగుతామా లేదండి అది విశేషం ఇక్కడ. ముగ్గురు నందీశ్వరులు కనిపిస్తున్నారు ఎంత అద్భుతంగా ఉంది చూడండి అసలు మెడలో మూపురంలో ఈ డిజైన్ డిజైన్ గొలుసులు గాని ఎంత అద్భుతం ఉంది నిజంగా గ్రేట్ అండి అద్భుతం ఇక మనకు ఇక్కడ నిలబడితే ఇటువైపు ఒక ఆలయము అదేవిధంగా ఇటువైపు ఒక ఆలయం గర్భాలయం ఇటువైపు కూడా ఆలయం ఉందన్నమాట మూడు వైపుల కూడా మనకు ఈశ్వరుని ఆలయాలే అంటే శివలింగాలే కనిపిస్తాయి అన్నమాట ముందు మనం ఇక్కడ చూస్తే అండి ఇక్కడ త్రికుటేశ్వర ఆలయంలో ముందు మనకు ఎడమవైపు ఉత్తరం వైపు చూస్తున్న నందీశ్వరుడు కనిపిస్తారు.

మూలాలు

[మార్చు]

సూర్యాపేట జిల్లా నాగుల‌ప‌హాడ్‌లోని 800 యేళ్ల పురాత‌న శివాల‌యాల‌ను చూస్తే అలాగే అనిపిస్తుంది. మూడు బ్ర‌హ్మ‌సూత్రాలున్న త్రికూటాల‌యం ఒక‌వైపు కుప్ప‌కూలిన ప‌రిస్థితి నుంచి పున‌ర్వైభ‌వానికి నోచుకుని నిత్య ధూప‌దీప నైవేద్యాలు అందుకోవ‌డం చూసి మ‌న‌సు పొంగిపోతుంది. ఆ ప‌క్క‌నే అత్య‌ద్భుత శిల్ప‌క‌ళ‌తో నిండి తురుష్కుల దాడిలో దెబ్బ‌తిని నిధుల కోసం త‌వ్వ‌కాలతో చెదిరిపోయి శిథిలాల‌తో క‌నిపించే మ‌రో బ్ర‌హ్మ‌సూత్ర శివాల‌యాన్ని చూసి మ‌న ఆధ్యాత్మిక చారిత్ర‌క వైభ‌వం మ‌న క‌ళ్లెదుటే కాల‌గ‌ర్భంలో క‌లిసిపోతున్న దుస్థితి చూసి అంతు తెలియ‌ని ఆవేద‌న క‌లుగుతుంది. ఒక భారీ బ్ర‌హ్మ‌సూత్ర శివ‌లింగ‌మే పెకిలివేయ‌బ‌డి బ‌య‌ట ఆవ‌ర‌ణ‌లో ప‌డేసి ఉండ‌డం ఆల‌య దుస్థితికి అద్దం ప‌డుతుంది. అయితే ఈ క్షేత్రం మామూలుది కాదు. మ‌న‌ల్ని క‌ట్టిప‌డేసే శిల్ప‌క‌ళాచాతుర్యం అణువ‌ణువూ నిండిన క‌ళాత్మ‌క‌త అచ్చెరువొందిస్తుంది. భ‌విష్య‌త్తు చెప్పే మంత్ర‌ద‌ర్ఫ‌ణం వంటి ఎన్నో విశేషాలు నిండిఉన్నాయి.

  • శ్రీ త్రికూటేశ్వర వీరభద్ర క్షేత్రం#NAGULAPAHAD TEMPLE Video