Jump to content

శ్రీ నిహాల్ తమన్నా

వికీపీడియా నుండి
శ్రీ నిహాల్ తమన్నా
CNN హీరోస్ 2022 అవార్డు ప్రదానోత్సవంలో శ్రీ నిహాల్ తమన్నా
జననం2009 (age 1617)
జాతీయతఇండియన్ -అమెరికన్
వృత్తిపర్యావరణ ప్రచారకర్త
క్రియాశీలక సంవత్సరాలు2019–ప్రస్తుతం
పేరుపడ్డదిరీసైకిల్ మై బ్యాటరీ వ్యవస్థాపకుడు
వెబ్‌సైటుhttps://recyclemybattery.org

శ్రీ నిహాల్ తమన్నా బ్యాటరీ రీసైక్లింగ్‌లో ప్రత్యేకత కలిగిన అమెరికన్ పర్యావరణ ప్రచారకర్త. ఆయనకు10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 'రీసైకిల్ మై బ్యాటరీ' ఆలోచన వచ్చింది. కాలిఫోర్నియాలోని ఒక వ్యర్థాల తొలగింపు ప్లాంట్‌లో సరిగ్గా పారవేయని లిథియం-అయాన్ బ్యాటరీల వల్ల జరిగిన అగ్నిప్రమాదం గురించి ఒక వార్త చూసిన తర్వాత ఇదంతా ప్రారంభమైంది. ఈ అగ్నిప్రమాదం లక్షలాది డాలర్ల నష్టాన్ని కలిగించింది, దాని గురించి ఏదైనా చేయవలసిన అవసరం ఉందని భావించి బ్యాటరీలను సక్రమంగా పారవేయకపోవడం వల్ల మన పర్యావరణానికి ఎంత ప్రమాదకరం, హానికరం కావచ్చో అని గ్రహించి 'రీసైకిల్ మై బ్యాటరీ' అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశాడు.[1]

పర్యావరణ పై కృషి

[మార్చు]

శ్రీ నిహాల్ తమన్నా 2019లో అమెరికాకు చెందిన లాభాపేక్షలేని సంస్థ రీసైకిల్ మై బ్యాటరీని స్థాపించాడు. వారు ఉచిత బ్యాటరీ రీసైక్లింగ్ బిన్‌లను ఏర్పాటు చేస్తూ బ్యాటరీ రీసైక్లింగ్ గురించి విద్యార్థులు, పెద్దలకు అవగాహన కల్పిస్తారు.[2] ఈ జూలై 2025 నాటికి సంస్థ దాదాపు 6,75,000 ఉపయోగించిన బ్యాటరీలను రీసైకిల్ చేసింది, 50 మిలియన్లకు పైగా ప్రజలకు బ్యాటరీ రీసైక్లింగ్ గురించి అవగాహన కల్పించింది, అనేక దేశాలలో 1,000 మందికి పైగా యువ వాలంటీర్ల బృందాన్ని కలిగి ఉంది. , రీసైకిల్ మై బ్యాటరీ 2025లో బ్యాటరీ ఛాలెంజ్‌ను ప్రారంభించింది.[3][4][5]

వెస్టర్మాన్ ప్రచురించిన జర్మన్ పాఠ్యపుస్తకంలోని ఒక పాఠంలో శ్రీ నిహాల్ తమన్నా కనిపించాడు. ఆయన CNNలో ప్రత్యక్ష ప్రదర్శన,[6] జపనీస్ టీవీ నెట్‌వర్క్ ఫుజి టీవీలో ఫీచర్డ్ సెగ్మెంట్,[7] బీబీసీలో ఒక డాక్యుమెంటరీ ప్రదర్శనతో సహా అనేక మీడియా ప్రదర్శనలలో పాల్గొన్నాడు.[8] ఆయన రెండు టెడ్ ప్రసంగాలు ఇచ్చాడు, ఒకటి 2021లో "సేవింగ్ ఎర్త్, వన్ బ్యాటరీ ఎట్ ఎ టైమ్!",[9] 2023లో "రీసైకిల్ మై బ్యాటరీ: ఎంపవరింగ్ కమ్యూనిటీస్" శీర్షికతో రెండవ ప్రసంగం.[10] తమ్మనా 2023లో టైమ్ ఫర్ కిడ్స్ మ్యాగజైన్‌లో "కిడ్ హీరోస్ ఆఫ్ ది ప్లానెట్"లో ఒకరిగా కనిపించాడు.[11]

రీసైకిల్ మై బ్యాటరీ 2023 అక్టోబర్ 7న 31,204 బ్యాటరీలను ఒకే లైన్‌లో ఉంచడం ద్వారా పొడవైన బ్యాటరీల లైన్ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. మునుపటి రికార్డు 1,380 బ్యాటరీలు.[12][13]

అవార్డులు

[మార్చు]
  • 2020: నేషనల్ వేస్ట్ & రీసైక్లింగ్ అసోసియేషన్ , నేషనల్ రీసైక్లింగ్ అవార్డు[14]
  • 2020: ప్రెసిడెంట్స్ ఎన్విరాన్‌మెంటల్ యూత్ అవార్డు[15]
  • 2020: న్యూజెర్సీ గవర్నర్స్ ఎన్విరాన్‌మెంటల్ ఎక్సలెన్స్ అవార్డు[16]
  • 2022: CNN హీరోస్, యంగ్ వండర్ అవార్డు[17]
  • 2022: గ్లోరియా బారన్ ప్రైజ్, యంగ్ హీరోస్[18]
  • 2023: ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్  ప్రైజ్ కి టాప్ 3 ఫైనలిస్టులు[19]
  • 2023: హానోరీ న్యూ జెర్సీ గవర్నర్స్ వాలంటీరిజం అవార్డ్స్[20]
  • 2023: డయానా అవార్డు[21][22]
  • 2023: యూత్ సమ్మిట్ అవార్డులు[23]

మూలాలు

[మార్చు]
  1. "Indian American kid founded Recycle My Battery in US – an effort to reduce toxic waste". The Times of India. 6 December 2020. the original నుండి 3 January 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 January 2026.
  2. "Recycle Old Batteries At South Brunswick Library On Earth Day". South Brunswick, NJ Patch (in ఇంగ్లీష్). 2023-04-18. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-16.
  3. "Sri Nihal Tammana | Young Innovator and Entrepreneur | Global Indian". Global Indian Youth (in అమెరికన్ ఇంగ్లీష్). the original నుండి 2023-03-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-16.
  4. "Four PIO teens win top US prize for young heroes". The Times of India. 2022-10-03. ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-22.
  5. Monthly, New Jersey (2022-12-21). "Edison Student Leads the Charge on Recycling Used Batteries". New Jersey Monthly. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-22.
  6. CNN Heroes Young Wonder: Sri Nihal Tammana | CNN (in ఇంగ్లీష్), 2022-12-13, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-16
  7. "フューチャーランナーズ". フジテレビ (in జపనీస్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-16.
  8. "BBC World Service - The Documentary, A Billion batteries". BBC (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2023-08-08. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-16.
  9. Tammana, Sri Nihal (2021-06-10), Saving Earth, One Battery At A Time!, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-16
  10. Tammana, Sri Nihal (2023-06-12), Recycle My Battery: Empowering Communities, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-28
  11. "Kid Heroes for the Planet". Time for Kids (in ఇంగ్లీష్). 2023-04-05. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-20.
  12. "Longest line of batteries". Guinness World Records.
  13. "Guinness World Record Set by Recycle My Battery - On New Jersey" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-10-10. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-02-01.
  14. "Battery delight: AP boy recycles his way to glory". The Times of India. 2020-11-13. ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-16.
  15. US EPA, OA (2022-06-10). "President's Environmental Youth Award (PEYA) 2020 Winners". United States Environmental Protection Agency (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-16.
  16. "NJDEP| Governor's Environmental Excellence Awards | 2020 Winners". Governor's Environmental Excellence Awards (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-16.
  17. "Photos: 'CNN Heroes: An All-Star Tribute' 2022". CNN (in ఇంగ్లీష్). 2022-12-12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-16.
  18. "Four Indian-American teens win top prize for young heroes". Business Insider. the original నుండి 2023-07-16 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-16.
  19. NJ.com, Jackie Roman | NJ Advance Media for (2023-11-16). "14-year-old from N.J. named finalist for International Children's Peace Prize". nj (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-01-26.
  20. "Honorees 2023". Volunteerism Awards (in అమెరికన్ ఇంగ్లీష్). the original నుండి 2023-07-22 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-22.
  21. "Roll of Honour 2023". diana-award.org.uk (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-22.
  22. "Eight Indian Americans win Diana Award". New India Abroad. 2023-07-02. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-22.
  23. "Youth Summit Awards". www.youthsummitawards.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-22.