శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి (పాట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి"
సంగీతంఆర్. సుదర్శనం
సాహిత్యంతోలేటి వెంకటరెడ్డి
ప్రచురణ1954
భాషతెలుగు
రూపంభక్తిగీతం
గాయకుడు/గాయనిపి. సుశీల

శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి 1954లో విడుదలైన కాళహస్తి మహాత్యం చిత్రంలోని పేరుపొందిన పాటలలో ఒకటి. ఇది భక్తిగీతం. దీనిని పి.సుశీల అలనాటి నటి కుమారి కోసం ఆలాపించారు. తోలేటి వెంకటరెడ్డి సాహిత్యం అందించగా, ఆర్.సుదర్శనం సంగీతం అందించారు.

విశేషాలు

[మార్చు]

ఈ పాట పి.సుశీల మొదటి పాటలలో ఒకటి, నటి కుమారికి చివరి పాట, ఈ చిత్రం ఆవిడ చివరి చిత్రం కూడా. తోలేటి పార్వతీదేవిని కీర్తిస్తూ ఎంతో అందంగా రాయగా, ఆర్.సుదర్శనం కోమలమైన సంగీతం అందించిన ఈ పాటను సుశీల ఎంతో శ్రావ్యంగా పాడగా, కుమారి అద్భుతంగా అభినయించారు. ఈ పాట చివరిలో నటుడు లింగమూర్తి కూడా వస్తారు. ఈ పాట ద్వారా కుమారి పాత్ర అయిన 'గౌరి' కథలోకి ప్రవేశిస్తుంది. ఈ పాటను వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలన్నంత అద్భుతంగా ఉంటుంది.

శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి

మా పూజలే తల్లి గౌరీ శంకరీ

గౌరీ శంకరీ

శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి

మా పూజలే తల్లి గౌరీ శంకరీ

గౌరీ శంకరీ


ప్రాపు నీవె పాపహారి పద్మపత్రనేత్రి

ప్రాపు నీవె పాపహారి పద్మపత్రనేత్రి

కాపాడరావమ్మా కాత్యాయినీ

కాపాడరావమ్మా కాత్యాయినీ

శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి

మా పూజలే తల్లి గౌరీ శంకరీ

గౌరీ శంకరీ


నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవీ

నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవీ

పాలించరావమ్మా పరమేశ్వరీ

పాలించరావమ్మా పరమేశ్వరీ

శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి

మా పూజలే తల్లి గౌరీ శంకరీ

గౌరీ శంకరీ

లింకులు

[మార్చు]