శ్రీ భారతీ తీర్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sri Bharati Tirtha MahaswaminaH
[ಶ್ರೀ ಭಾರತೀ ತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿನ:] error: {{lang}}: unrecognized language tag: Kannada (help)
[శ్రీ భారతి తీర్థ స్వామి] error: {{lang}}: unrecognized language tag: Telugu (help)
[பாரதி தீர்த்த சுவாமிகள்] error: {{lang}}: unrecognized language tag: Tamil (help)
దస్త్రం:Sri Bharati Tirtha.jpg
ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಭಾರತೀ ತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿನ:
జననంTangirala Sitarama Anjaneyulu
(1951-04-11) 1951 ఏప్రిల్ 11 (వయస్సు: 68  సంవత్సరాలు)
Machilipatnam, Madras State, India (now in Andhra Pradesh, India)
బిరుదులు/గౌరవాలు36th and present Jagadguru of Sringeri Sharada Peetham
గురువుSri Abhinava Vidyatirtha Swaminah
తత్వంAdvaita
Smartism
ప్రముఖ శిష్యు(లు)డుSri Vidhushekhara Bharati mahaswamigal
ఉల్లేఖనभारती करुणापात्रं भारती पदभूषणम् । भारती पदमारूढं भारती तीर्थमाश्रये ॥

జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి శృంగేరి శారదా పీఠము యొక్క ప్రస్తుత 36వ పరమాచార్యులు.

భారతీ తీర్థుల వారి జన్మస్థలం గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో నాగులేరు నదీ తీరాన ఉన్న అలుగు మల్లెపాడు గ్రామము. ఇక్కడ తంగిరాల వారిది వైదికాచార కుటుంబము. స్వామివారి తల్లిదండ్రులు తంగిరాల వేంకటేశ్వరావధాని మరియు అనంతలక్ష్మమ్మ. వీరు కృష్ణయజుఃశాఖీయులు, ఆపస్తంబసూత్రులు, కుత్సస గోత్రులు. వీరు నలుగురు కుమార్తెల తరువాత పుత్రుడు కలగాలని శివారాధన చేయగా ఏప్రిల్ 11, 1951 తేదీన స్వామివారు కలిగారు. తల్లిదండ్రులు సీతారామాంజనేయులు అని పేరుపెట్టారు.

స్వామివారు చిన్నప్పటి నుండే భక్తిభావాలను ప్రదర్శించేవారు. వేదాధ్యయనము తండ్రిగారి వద్ద ప్రారంభించి తరువాతి కాలంలో ప్రతాపగిరి శివరామశాస్త్రి గారి వద్ద సంస్కృతాంధ్రాల్ని చేర్చుకున్నారు. చిన్నతనంలోనే సంస్కృతంలో మంచి ప్రావీణ్యము గడించి విద్వాంసుల మన్ననలు పొందారు. సంహితా, బ్రాహ్మణ, ఆరణ్యకములను అభ్యసించి జిల్లా వేద ప్రవర్థక విద్వత్పరిషత్తు వారి వేద పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వీరు ఏకసంథాగ్రాహి.

1960వ సంవత్సరంలో శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు విజయయాత్రలో నరసారావుపేట వేంచేశారు. అవధానిగారు తన కుమారుని వెంటబెట్టుకొని జగద్గురువులకు పాదాభివందనం చేసిరి. గురువుల దర్శనము సీతారామాంజనేయులు అనిర్వచనీయమైన అనుభూతిని పొందెను. వేద పండితులతో పాటు జరిగిన వేదమంత్ర పఠనములో అతని మంత్రోచ్ఛారణము చూచి శ్రీచరణులు ముగ్ధులైనారు. 1961 సంవత్సరములో మహాస్వాముల వారి పునర్దర్శన సమయంలో వీరి సంస్కృత భాషను తిలకించి విశిష్ట పురస్కారం ఇచ్చారు. మహాస్వామి వారు ఉజ్జయినిలో చాతుర్మాస్య వ్రతము జరుపుచుండగా అక్కడకు చేరిన సీతారామాంజనేయులు తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థించెను. వారి అనుగ్రహంతో స్వామివారి శిష్యునిగా ఏడెనిమిది సంవత్సరములలో కృష్ణయజుర్వేదాలు, న్యాయ, వ్యాకరణ, పూర్వోత్తర, మీమాంసాది శాస్త్రములలో పరిపూర్ణ పాండిత్యము గడించారు.

చాలా సంవత్సరములు శారదా పీఠంలో అతి సన్నిహితముగా ఆ బ్రహ్మచారి మేధాశక్తిని, సత్ప్రవర్తనను, శాస్త్ర పాండిత్యములను పరీక్షించుచున్న పీఠాధిపతులు అతనిమీద వాత్సల్యము కలిగి శ్రీ శారదాదేవి అనుమతితో శ్రీ శృంగేరి శంకర పీఠానికి ఉత్తరాధిపతిగా నియమించవలెనని ఆనంద నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి (నవంబరు 11, 1974) నాడు నిర్ణయించిరి. ఆనాడు వేలాది భక్తుల సమక్షంలో వారికి సన్యాసాశ్రమము అనుగ్రహించి "శ్రీ భారతీ తీర్థ" అనే ఆశ్రమ నామధేయము ఇచ్చారు.

స్వామివారి శాస్త్ర పాండిత్యము మరియు సంభాషణా చాతుర్యములు నిరుపమానమైనది. వీరు సంస్కృతము, తెలుగు, కన్నడము, తమిళము, హిందీ భాషలలో అనర్గళముగా ఉపన్యాసాలు ఇస్తారు. సన్యాసాశ్రమంలో గురువుగారితోను, తరువాత ఒక్కరే భారతదేశమంతా విజయయాత్రలు జరిపిరి.

అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు సెప్టెంబరు 21, 1989 తేదీన బ్రాహ్మీభావమును పొందిరి. శ్రీ భారతీ తీర్థ స్వాములు శుక్ల నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పంచమి గురువారం (అక్టోబరు 19, 1989) నాడు పట్టాభిషిక్తులై శృంగేరి శారద పీఠాధిపత్యమును వహించిరి. శ్రీచరణులు పీఠాధిరోహణము చేసిన తర్వాత గురువులు చూపిన మార్గములో ధర్మరాజ్యపాలనము చేయుచు, భక్తుల అభ్యర్ధనలను మన్నించి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు ఢిల్లీ రాష్ట్రాలలో విజయయాత్ర జరిపి భక్తులను అనుగ్రహించారు.

బయటి లింకులు[మార్చు]