Jump to content

శ్రీ ముత్తుమారియమ్మన్ ఆలయం, మాతలే

ముత్తుమారియమ్మన్ ఆలయం
ஸ்ரீ முத்துமாரியம்மன் கோவில்
శ్రీలంకలోని మటాలె పట్టణంలో ఉన్న ముత్తుమారియమ్మన్ ఆలయం
మతం
అనుబంధంహిందూధర్మం
జిల్లామటాలె జిల్లా
Provinceసెంట్రల్ ప్రావిన్స్
దైవంముత్తుమారియమ్మన్
ప్రదేశం
ప్రదేశంమటాలె
దేశంశ్రీలంక
పటం
ముత్తుమారియమ్మన్ ఆలయం యొక్క ఇంటరాక్టివ్ మ్యాప్
నిర్దేశాంకాలు7°28′35.9″N 80°37′21.4″E / 7.476639°N 80.622611°E / 7.476639; 80.622611
వాస్తుశిల్పం
రకంద్రావిడ దేవాలయ వాస్తుశిల్పం
సృష్టికర్తనాటుకోట్టై నాగరత్తార్ (చెట్టియార్)

ముత్తుమారియమ్మన్ ఆలయం లేదా అరుల్మిగు శ్రీ ముత్తుమారి అమ్మన్ కోవిల్ అనేది శ్రీలంకలోని మటాలె పట్టణంలో ఉన్న ఒక ప్రముఖ హిందూ ఆలయం.[1] "ముత్తు" అనే పదానికి అక్షరార్థంగా ముత్యం అని అర్థం. తమిళ భాషలో "మారి" అంటే వర్షం, "అమ్మన్" అంటే తల్లి అని అర్థం.[2] ఈ ఆలయం వర్షం, సంతానోత్పత్తి దేవత అయిన మారియమ్మన్ కు అంకితం చేయబడింది.[3] ఈ ఆలయంలో జరిగే రథోత్సవం సాధారణంగా పౌర్ణమి రోజున జరిగే మగం నక్షత్రంతో సమకాలీనంగా నిర్వహించబడుతుంది.[4]

108 అడుగుల ఎత్తు రాజగోపురం
తీర్థ కేర్ని

చరిత్ర

[మార్చు]

ఈ భూమి మొదట వరి పొలంలో భాగంగా ఉండేది. 1852లో భూమి యజమాని ఈ స్థలాన్ని దానం చేశాడు.[5] ప్రస్తుత ఆలయాన్ని 1874లో నాటుకొట్టై చెట్టియార్ వారి ఆర్థిక సహాయంతో నిర్మించారు.[6] ఈ ఆలయాన్ని హిందువులు, బౌద్ధులు ఇరువురూ ఉపయోగిస్తారు. ప్రారంభంలో ఈ ఆలయం ఒక చెట్టు క్రింద ఉన్న చిన్న విగ్రహంగా ఉండేది. హిందూ ప్రజలు అక్కడ పూజలు నిర్వహించేవారు. తరువాత మాతలే ప్రజల సహకారంతో ఇది అభివృద్ధి చెందింది.[7] ఆలయానికి మొదటి కుంభాభిషేకం 1960లో నిర్వహించబడింది.

జూలై 1983లో జరిగిన యాంటీ-తమిళ అల్లర్ల సమయంలో ఆలయం తీవ్రమైన నష్టాన్ని చవిచూసింది. అనంతరం దీనిని పునరుద్ధరించారు. ఈ ఆలయంలో విశేషంగా కనిపించే లక్షణాలలో ఒకటి 32.9 మీటర్ల ఎత్తుగల గోపురం (‘రాజ కోబురం’). ఇది ఆలయ ప్రధాన ఉత్తర ద్వారం (‘వడక్కు వాయిల్’) పైన నిర్మించబడింది.[5] రాజ కోబురం శ్రీలంకలోని అతి పెద్ద గోపురాలలో ఒకటి. ఇందులో ఉన్న 1008 హిందూ దేవతా విగ్రహాలను దక్షిణ భారత శిల్పి నాగలింగం, ఆయన కుమారుడు రామనాథన్ రూపొందించారు. వీరికి తమిళనాడు, శ్రీలంకకు చెందిన సుమారు 100 మంది డిజైనర్లు, చిత్రకారులు, వాస్తుశిల్పులు సహాయం చేశారు. రాజ కోబురం నిర్మాణం 2007లో పూర్తయింది. దీనికి సుమారు రూ. 150 మిలియన్ల వ్యయం అయ్యింది.

ప్రత్యేక కార్యక్రమాలు

[మార్చు]

ఆలయంలో ప్రధానంగా జరిగే మతపరమైన పండుగలలో రథోత్సవం ముఖ్యమైనది. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలలో జరుపబడుతుంది.[8][9] ఈ ఆలయంలో ఐదు అలంకారమయిన రథాలు ఉన్నాయి. వీటిని నగరంలో దేవతా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తారు. ఈ ఊరేగింపు 'తేర్' లేదా 'వెట్టై తిరువిళా' అనే రథోత్సవ దినాన నిర్వహించబడుతుంది. ఇది 'మెడిన్ పొయా' (మార్చిలో వచ్చే పొయా రోజు)కు ముందురోజు జరుగుతుంది.[10] ఈ రథోత్సవంలో గణేశుడు, శివుడు, మహాదేవి, మురుగన్, చండేశ్వర నాయనార్ అనే ఐదు ప్రధాన హిందూ దేవతల విగ్రహాలను భక్తులు రథాలలో మోస్తారు.[5]

వివాహ మండపం

[మార్చు]

హిందూ ప్రజల కోసం ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద వివాహ మండపం ఉంది. ఈ మండపం 1856 నుండి ఇప్పటివరకు వినియోగంలో ఉంది.[11][నమ్మదగని మూలం?]

మరిన్ని చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Muthumariamman Temple in Matale". Sightseeing-Lankatours. Archived from the original on 12 March 2017. Retrieved 9 March 2017.
  2. ↑ Nabokov, Isabelle (2000-09-21). Religion Against the Self: An Ethnography of Tamil Rituals (in ఇంగ్లీష్). Oxford University Press. ISBN 9780195354362.
  3. ↑ Bhattacharya, Jayati; Kripalani, Coonoor (2015-03-01). Indian and Chinese Immigrant Communities: Comparative Perspectives (in ఇంగ్లీష్). Anthem Press. ISBN 9781783083626.
  4. ↑ "மாத்தளை ஶ்ரீ முத்துமாரியம்மன் ஆலய இரதோற்சவப் பெருவிழா இன்று - Newsfirst". Sri Lanka Tamil News - Newsfirst | News1st | newsfirst.lk | Breaking (in ఇంగ్లీష్). 2020-03-08. Retrieved 2022-02-17.
  5. 1 2 3 "மகத்தான வாழ்வு தரும் மாத்தளை முத்து மாரியம்மன் திருக்கோவில் || mathalai muthu mariamman temple sri lanka". Maalaimalar (in ఇంగ్లీష్). 2018-09-26. Archived from the original on 17 February 2022. Retrieved 2022-02-17.
  6. ↑ Pieris, Kamalika (5 April 2016). "Hindu temples in British Ceylon". The Island. Retrieved 23 April 2017.
  7. ↑ "LANKALIBRARY FORUM • View topic – Arulmigu Sri Muthumari Amman Hindu Kovil". lankalibrary.com (in ఇంగ్లీష్). Retrieved 1 April 2017.
  8. ↑ "Matale Muthumariamman temple festival". www.omlanka.net (in ఇంగ్లీష్). Retrieved 9 March 2017.
  9. ↑ "Matale Muthumari Amman Chariot Festival". www.omlanka.net (in ఇంగ్లీష్). Retrieved 1 April 2017.
  10. ↑ Basnayake, Richard. "Theru Festival of Arulmigu Sri Muthumari Amman Kovil, Matale". Daily News. Retrieved 9 March 2017.
  11. ↑ "Notable Photos: The Colors of Matale". TravelShus. 2014-08-25. Retrieved 2017-04-30.