శ్రీ రమణాశ్రమం

వికీపీడియా నుండి
(శ్రీ రమణాశ్రమము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీ రమణాశ్రమం ప్రవేశ ద్వారం.

శ్రీ రమణాశ్రమం, రమణ మహర్షి నివాస స్థలంలో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది 1922 నుండి 1950 వరకు ఆధునిక తత్వవేత్త అయిన రమణ మహర్షి ఇక్కడ నివసించారు. అరుణాచల పర్వతాల పాదప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమం తిరువన్నామలై జిల్లాలో పడమర వైపు విస్తరించి ఉంది. 1950 లో మహర్షి స్వర్గస్తులయినప్పుడు అనేక వేల మంది భక్తులు అయన దర్శనార్ధమ్ వచ్చారు. ఆయన స్వర్గస్తులయిన తరువాత కూడా చాలా మంది భక్తులు, ఆసక్తి గల సందర్శకులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. మహర్షి తుది శ్వాస విడిచిన చోట ఒక కోవెల నిర్మించారు. ప్రతీ సంవత్సరం ఆయన శిష్యులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి, కొంత సమయం సామాజిక సేవలలో గడపటం చేస్తూవుంటారు.[1][2]

చరిత్ర[మార్చు]

1927 నుండి 1950 లమధ్య రమణ మహర్షి విశ్రాంతి మందిరం
ఆశ్రమంలో రమణ మహర్షి మహానిర్వాణ ప్రదేశం

ఈ ఆశ్రమం క్రమంగా అభివృద్ధి చెందినది. 1922 మే 19 న అతని తల్లి అలగమ్మాల్ మరణించిన తరువాత ఆమె సమాధి వద్ద రమణ మహర్షి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. మొదట్లో ఈ ఆశ్రమం చిన్న గృహంగా ప్రారంభమైంది. 1922లో రెండు గృహాలు ప్రారంభమైనవి. ఒకటి సమాధికి అభిముఖంగా మరొకటి ఉత్తరం వైపు నిర్మించబడ్డాయి.

చేరుకునే మార్గం[మార్చు]

చెన్నైకి 120 మైళ్ళు, కాట్పాడి జంక్షన్‌కు 60 మైళ్ళ దూరంలో ఉంది. ఈ రెండుచోట్ల నుంచి నేరుగా చేరుకునే బస్‌లు చాలా తరచుగా నడుస్తాయి. అలాగే తిరుపతి నుంచి కూడా కాట్పాడి (వేలూర్‌) మీదుగా బస్‌లు 5 గం.లో చేరుస్తాయి. వైజాగ్‌, విజయవాడల నుంచి తిరువణ్ణామలై స్టేషన్‌ మీదుగా పోయే రైళ్ళు రెండున్నాయి (నెం. 22603/5, 22604/5). హైదరాబాద్ (లకడీ-కా-పుల్) నుంచి డైరెక్టు బస్ రోజూ నడుస్తోంది.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఇతర పఠనాలు[మార్చు]

  • సూరి నాగమ్మ వ్రాసిన My life at Sri Ramanasramam, Pub. Sri Ramanasramam, 1975.

ఆధారాలు[మార్చు]

  1. Sri Ramana Ashram Archived 2011-07-21 at the Wayback Machine Tiruvannamalai district website.
  2. రమణ ఆశ్రమం, తిరువన్నమలై
  3. "ఆశ్రమాన్ని చేరుకొనేదెలా?". Archived from the original on 2016-02-15. Retrieved 2015-12-30.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]