శ్రీ రామభక్త హనుమాన్
శ్రీ రామభక్త హనుమాన్ (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాబూ భాయ్ మిస్త్రి |
---|---|
నిర్మాణం | వాడియా బ్రదర్స్ |
తారాగణం | మహీపాల్, ఎస్.ఎన్.త్రిపాఠి, అనితా గుహ, బి.ఎం.వ్యాస్ |
సంగీతం | విజయభాస్కర్ |
నిర్మాణ సంస్థ | బసంత్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
శ్రీ రామభక్త హనుమాన్ హిందీ నుండి తెలుగుకు డబ్బింగ్ చేసిన సినిమా. ఈ పౌరాణిక సినిమా 1958, మార్చి 21, ఉగాది పండుగనాడు విడుదలయ్యింది.
తారాగణం
[మార్చు]- మహీపాల్
- ఎస్.ఎన్.త్రిపాఠి
- అనితా గుహ
- బి.ఎం.వ్యాస్
- కృష్ణకుమారి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: బాబూ భాయ్ మిస్త్రి
- సంగీతం: విజయభాస్కర్
- మాటలు, పాటలు: శ్రీశ్రీ
- నిర్మాత: వాడియా బ్రదర్స్
- ఊహ కలిగేనే ఊహ కలిగే సంతోషమలరగా పాడగా - ఎస్.జానకి
- పూజా తపముల మరి నేనెరుగ మరి నే నెరుగను హారతి - పి.లీల
- ప్రియా ప్రియా ప్రియా ఉప్పొంగిన ప్రేమంతా మదిలో ప్రియునికై - పి.సుశీల
- ప్రియా రామునలా చూసి ఎరుగరే మరి కని - పి.సుశీల, ఎ.ఎం.రాజా
- మది తలచెదనే కోరి కొలిచెదనే మధు మధురము కాదా - ఘంటసాల
- మహిలో ఎపుడూ చూడ రాముని మహిమ అపురూపం - ఘంటసాల బృందం
- లేవయ్యా లేవయ్యా లేరయ్య నీసాటి వీరాంజనేయా - పి.బి.శ్రీనివాస్ బృందం
- సంసార జలధీ దాటించగలదీ రెండక్షరముల నామమే - ఘంటసాల బృందం
- ఆదియు తానే అంతము తానే శ్రీరాముడే అణువణువు నందు - ఘంటసాల
- కుమారీ రంజనా ఓ కుమారీ రంజనా మంచి పాటలే పాడెద -
- భువన వీధుల తేలి తేలి చల్లని గాలులు వీచే -
- రామ రామ రామ జయ జయ రామా రాం రాం రామ్ రామ్ -
- సీతా, హే సీతారాం శ్రీరామ్ ప్రియరాము నెలా చూతున్ -
కథ
[మార్చు]వాయుదేవుని అనుగ్రహం వల్ల ఆంజనేయుడు జన్మించడంతో కథ ఆరంభమౌతుంది. తోటిపిల్లల ప్రోత్సాహం వల్ల అతడు గగనమండలానికి ఎగిరివెళ్లి సూర్యుణ్ణి మింగివేస్తాడు. ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తాడు.ఆ దెబ్బకు ఆంజనేయుడు మరణిస్తాడు.అప్పుడు బ్రహ్మ వచ్చి ప్రాణం పోస్తాడు. ఆపైన దేవతలందరూ వచ్చి తలో వరం ప్రసాదిస్తారు. అప్పుడు అతడు సూర్యుణ్ణి వదిలిపెడతాడు. ఆంజనేయుడు ఋషివాటికలలో తిరుగుతూ రామనామం వింటాడు. శబరి పరిచయంద్వారా రామనామ మహాత్మ్యం గ్రహించి రామభక్తుడౌతాడు. రామలక్ష్మణులు సీతకోసం వెదుకుతూ వుండగా కబంధుడు వెంటవచ్చి లక్ష్మణున్ని ఆకాశంలోకి ఎగురవేస్తాడు. అతడు క్రింద పడేలోగా ఆంజనేయుడు అడ్డువచ్చి కాపాడుతాడు. ఆవిధంగా రాముణ్ణి కలుసుకుంటాడు. మిగతా అంతా రామాయణ కథా భాగం. రావణుని వధ అనంతరం సీత ఆంజనేయునికి ముత్యాలహారం బహుమతిగా ఇస్తుంది. అతడు ఒక్కొక్కొ ముత్యమే తీసి కొరికి చూసి రాముడు లేని ఆ ముత్యాలు నాకెందుకు అంటూ పారేస్తూ వుంటాడు. రాముడు నీలో ఉన్నాడా అని పెద్దలు సభలో అతన్ని సవాలు చేస్తారు. అప్పుడు హనుమంతుడు గుండెను చీల్చి తన హృదయపీఠంలో కొలువుతీరిన సీతారాములను చూపిస్తాడు[2].
మూలం
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "శ్రీరామ భక్త హనుమాన్ - 1958 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 27 January 2020.
- ↑ సంపాదకుడు (23 March 1958). "'శ్రీ రామభక్త హనుమాన్ '". ఆంధ్రపత్రిక. Retrieved 27 January 2020.[permanent dead link]