శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి ఆలయం, కంది, సంగారెడ్డి జిల్లా, తెలంగాణా
ఈ పేజీ ఇప్పుడే కొత్తగా సృష్టించబడింది. దీని రచయితకు వికీపీడియా యొక్క inclusion guidelinesతో అవగాహన ఉన్నది. ఈ వ్యాసాన్ని సదుద్దేశంతోనే సృష్టించారు. బహుశా వికీపీడియా ప్రమాణాలకు తగిన విధంగా దిద్దటానికి ఇంకా కొంత కృషిచేయాలి. అప్పటి దాకా దయచేసి తొందరపడి తొలగించాలని ప్రతిపాదించవద్దు. కానీ అప్పుడప్పుడు ఈ పేజీని గమనిస్తుండండి లేదా ఈ వ్యాసం అభివృద్ధి చేయటానికి ఉన్న ప్రణాళికను గురించి తెలుసుకొనేందుకు ఈ వ్యాసపు సృష్టికర్తను సంప్రదించండి. ఈ వ్యాసాన్ని సృష్టించినవారు దీనిపై కృషిచేయటం మానేస్తే లేదా సంప్రదించినప్పుడు తిరిగి సమాధానం ఇవ్వకపోతే ఈ వ్యాసాన్ని తొలగించండి లేదా వాడుకరి పేరుబరికి ఉపపేజీలాగా (ఉదా: వాడుకరి:పుల్లయ్య/ఈ పేజీ శీర్షిక ) తరలించి వాడుకరీకరించండి ఈ వ్యాసా లో చివరిసారిగా దిద్దుబాట్లు చేసినది: SATYA SAI VISSA (talk | contribs) 22 నెలల క్రితం. (Update timer) |
శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి ఆలయం, కంది, సంగారెడ్డి జిల్లా, తెలంగాణా సంగారెడ్డి జిల్లా, కంది మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి ఆలయ కంది గ్రామం లో దాదాపు 500 సంవత్సరాలక్రితం వెలసి కంది పరిసర గ్రామాలకు ఆద్యాత్మిక శోభతో అలరారింది. జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ జాతర ఉత్సవాలలో భాగంగా రాత్రి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతుంది. ఈ జాతర ఉత్సవంలో స్థానిక అధికార అనధికార ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు దర్శించి శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి వార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించి తరిస్తారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం జరుగుతుంది. స్థానికంగా ఆధ్యాత్మిక సంస్కృతి యొక్క గొప్ప వారసత్వ సంపద చారిత్రక మైలురాళ్ళుగా విలసిల్లిన ఈ ఆలయం ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది. పురాతన భారతీయ వాస్తు శైలి కలిగి ఉన్న ఇటువంటి పురాతన ఆలయాల పరిరక్షణ భాధ్యత ఆటు ప్రభుత్వం, ఇతర మఠాధిపతులు, వదాన్యులైన భక్త దాతలు పూనుకోవాలి. ఈ ప్రదేశం స్థానిక ప్రజలలో చాలా ప్రసిద్ధి చెందింది మరియు ప్రత్యేక సందర్భాలలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ప్రాంతం ప్రధాన రహదారి నుండి కొద్దిగా లోపల ఉంది. చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నఈ ఆలయ గోడలు ప్రమాదకర స్థితిలో ఉన్నందున దీనికి నిర్వహణ కూడా అవసరం. ప్రధాన ద్వారం మరియు భవనాల యొక్క విభిన్న నిర్మాణం దాని వయస్సును రుజువు చేస్తుంది. ప్రజలు ఆ విశాల దేవాలయ ప్రాంగణంలో అనేక నివాసాల నిర్మాణాలలో ప్రజలు నివసించేవారని తెలుస్తుంది. భక్తులు పెద్ద పాత చెట్టు ముందు మరియు మందిరంలో ప్రార్థనలు చేస్తారు. చెరువు వద్దకు చేరుకోవడానికి మందిరం పక్కనే ఒక చిన్న మార్గం ఉంది. ఈ ఆలయం లోపల వివాహాలు జరుపుకుంటారు.