శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సుందిళ్ళ
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం | |
---|---|
తెలంగాణలో ఆలయ ఉనికి | |
భౌగోళికాంశాలు : | 18°28′5″N 79°6′42″E / 18.46806°N 79.11167°E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సుందిళ్ళ |
ప్రదేశం | |
దేశం: | భారతదేశము |
రాష్ట్రం: | తెలంగాణ |
ప్రదేశం: | సుందిళ్ళ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | లక్ష్మీనరసింహస్వామి |
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం సుందిళ్ళ గ్రామంలో ఉన్న దేవాలయం. సా.శ 13వ శతాబ్దంలో కాకతీయులచే నిర్మించిన ఈ దేవాలయంలో స్వామివారు యోగ నరసింహస్వామిగా దర్శనమిస్తాడు.[1][2]
స్థల విశిష్టత[మార్చు]
అనేక ప్రాంతాల్లో ఉగ్రమూర్తి ఉన్న నరసింహస్వామి ఇక్కడ శాంతమూర్తి కొలువుదీరాడు. ఇతర ప్రాంతాల్లో కొండలు, గుట్టల్లో వెలిసిన స్వామి సుందిళ్ళ అందమైన దేవాలయంలో వెలిసాడు. ఇక్కడి ప్రాంతం తన తపస్సుకు సరైనదిగా భావించన స్వామి శాంతమూర్తిగా మారి ఇక్కడే యోగముద్రలో కూర్చున్నడు ఆ స్వామి ఒళ్లంతా పుట్టలు మొలిచాయి.
స్థల పురాణం[మార్చు]
చాలా ఏళ్ళకిందట ఒక వృద్ధ బ్రాహ్మణుడు జనగాంలో ఉంటూ, సుందిళ్ళలో ఉన్న తన పొలాలకు వచ్చి వెళ్ళేవాడు. అది అడవి ప్రాంతం కావడంతో ఆ వృద్ధుడు తన పదేళ్ళ మనుమని వెంట బెట్టుకొని అక్కడికి వచ్చేవాడు. ఒకరోజు బ్రాహ్మణుడు ఒక్కడేవెళ్ళి పొలంలో తిరిగి అలసిపోయి దారితప్పి దిక్కుతోచని స్థితిలో భగవంతుని స్మరించుకోగా, ఆ క్షణమే ఒక బాలుడు అతని దగ్గరకు వచ్చి తాతా! దారి తప్పావా? సరైన త్రోవ నేను చూపిస్తాను రా! అని తీసుకొనిపోతాడు. పక్కనేవున్న వున్న ఒక రాత్రి ఈ మంటపం చూపించి, ఈ రాత్రి ఇక్కడే పడుకోమని చెప్పి, స్వామి ప్రసాదం. కొబ్బరి, బెల్లం ఇచ్చి పడుకున్నాడు. బ్రాహ్మణుడు వాటిని తిని పడుకున్నాడు. కొంతసేపటి తరువాత బ్రాహ్మణుని కలలో విష్ణుమూర్తి నరసింహ రూపంలో దర్శనమిచ్చి, పక్కనేవున్న పుట్టను తవ్వి చూడమన్నాడు. పుట్టను తవ్వగా సూర్యకిరణాల వెలుగులో పీఠం పెట్టుకొని, చేతులు యోగముద్రతోవుండి ఛాతి ఒకవైపు నలుపు, మరో వైపు ఎరుపు కలిగిన ఇసుకరాతి విగ్రహంతో స్వామి దక్షిణాభి ముఖంగా దర్శనమిచ్చాడు. దక్షిణ ద్వారం (దిక్కు) యమధర్మరాజుది అవడంవల్ల ఈ వైపున్న దేవాలయాల్లోకి ప్రవేశిస్తే యమబాధలుండవని భక్తుల నమ్మకం.
దేవాలయ నిర్మాణం[మార్చు]
సా.శ 13వ శతాబ్దంలో కాకతీయ రాజ వంశస్థులు ఈ దేవాలయం నిర్మించినట్లు సమీపంలోని ఓ శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. దేవాలయానికి ఈశాన్య భాగంలో 200 గజాల దూరాన పురాతన దేవాలయం ఉండినట్లు ఆలయ శిథిలాలు నేటికీ దర్శనమిస్తాయి. అయితే, నైరుతి దిశలోని కోనేరును కూడ్పించి, ఆ స్థలంలో స్వామివారి భక్తుల సౌకర్యార్థం పెద్ద హాలును దాతలు నిర్మించారు.
ఉత్సవాలు[మార్చు]
ఇక్కడ ప్రతి ఏడాది ధనుర్మాసంలో భజన సప్తాహం జరుగుతుంది. కుందారం, సెట్టిపెల్లి, శివ్వారం చుట్టు పక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తారు. అలాగే, ప్రతి ఏడూ ఫాల్గుణ మాసంలో స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంతేగాక, ప్రతినెలలో ఏకాహం (24గంటల భజన) ఉంటుంది.
పుష్కరాలు[మార్చు]
ఇక్కడ గోదావరి నది పుష్కరము జరుగుతుంది.
మూలాలు[మార్చు]
- ↑ వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (22 July 2018). "శాంతమూర్తిగా వెలసిన సుందిళ్ల యోగ నరసింహస్వామి!". మధుకర్ వైద్యుల. Archived from the original on 8 డిసెంబరు 2018. Retrieved 8 December 2018.
- ↑ ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం". Archived from the original on 16 July 2018. Retrieved 8 December 2018.