శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం కల్వకుర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి.

దేవాలయ చరిత్ర

కల్వకుర్తి పట్టణంలోని దేవరకొండ రోడ్డులోని వాసవి నగర్‌లో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో గత 28 సంవత్సరాల నుండి దూపదీప నైవేద్యలతో ఆధ్యాత్మిక కేంద్రంగా నిత్యం పూజలు అందుకుంటూ వాసవి అమ్మవారు భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ కొంగుబంగారంగా పట్టణంలో వాసిల్లుతుంది. దీనిని 1986వ సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. 1988 వ సంవత్సరంలో వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి నాడు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. రజతోత్సవం నిర్వహించుకున్న ఈ ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధ కన్యకా పరమేశ్వరి ఆలయంగా విలసిల్లుతోంది. కన్యకాదేవి సన్నిధిలోనగరేశ్వరస్వామి సన్నిధి తప్పక నెలకొని ఉంటుంది. కన్యకాదేవి, నగరేశ్వరస్వామి ఒకే లోగిలిలో కొలువుతీరి ఉంటారు. జ్యోతి స్ఫటిక లింగమూర్తిగా నగరేశ్వర స్వామి ఇచట ప్రకటితమవుతాడు. ఆలయ ముఖ మంటపంలో అమ్మవారి ఉత్సవ మూర్తి ప్రత్యేకమైన పీఠంపై విలసిల్లుతోంది. నిత్య కుంకుమ పూజలు, ఇతర పారాయణాలను భక్తులు ఈ ఉత్సవ మూర్తి సమక్షంలో నిర్వహిస్తారు. [1] ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసం తొమ్మిది దినములు అమ్మవారిని తొమ్మిది అవతరాలుగా అలంకరించి పూజిస్తూ భక్తులు తరిస్తారు.

దేవాలయంలో ఉన్న ఉపదేవాలయాలు

ఈ ఆలయ సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి.[1]

  • శ్రీ వింధ్యా వాసిని నగరేశ్వర స్వామి దేవాలయం
  • శ్రీ కొనకమల జనార్ధన స్వామి దేవాలయం
  • శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం
  • శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం
  • శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం
  • శ్రీ నవగ్రహ దేవాలయం
  • శ్రీ రాధాకృష్ణ దేవాలయం
  • శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం

దేవాలయంలో జరుగు ఉత్సవములు

ఈ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు, వాసవి అమ్మవారి జన్మదినం, ఆత్మార్పణ, దినోత్సవాలు, శివరాత్రి, వసంత పంచమి వేడుకలు కార్తీక మాస దీపోత్సవం, వినాయక చవితి, దీపావళి, ఉగాది, తోలి ఏకాదశి, హనుమాన్ జయంతి, శని త్రయోదశి, సుబహ్మణ్య షష్టి, శ్రావణమాస సామూహిక వరలక్ష్మి వ్రతాలు, కృష్ణాష్టమి, ఇవి ప్రధానంగా జరుగుతాయి. ఇక పండుగ రోజుల్లో ఈ దేవాలయంలో భక్తులతో కిక్కిరిసి పోతుంది.[1]

మూలాలు

  1. 1.0 1.1 1.2 Sri Kanyaka Parameswari Temple | Kalwakurthy | Teerthayatra | 9th June 2017 | Full Episode | ETV TS, retrieved 2018-01-23

బాహ్య లింకులు