శ్రీ వినాయక విజయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ వినాయక విజయం
(1979 తెలుగు సినిమా)
Sri-Vinayaka-Vijayam.jpg
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
తారాగణం కృష్ణంరాజు ,
వాణిశ్రీ
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ జగన్మాత ఆర్ట్స్
భాష తెలుగు

కథ[మార్చు]

పరమేశ్వరుడు త్రిపురాసురులను అంతమొందించిన తరువాత గజాసురుడు, మూషికాసురుడు అనే రాక్షసులు ముల్లోకాలను గజగజలాడించడం మొదలు పెట్టారు. శివభక్తుడైన గజాసురుడు తపశ్శక్తితో శివుని మెప్పించి శివుడు నిత్యం తనలోనే వుండేలా వరం పొందుతాడు. శివుని విరహం భరించలేని పార్వతి శివదీక్షావ్రతాన్ని ఆచరించడానికి పూనుకుని స్నానమాచరించబోతూ పిండితో ఒక బాలుని బొమ్మ తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. ఆ బాలునికి ఉమాపుత్రుడని నామకరణం చేసి తన దీక్షకు భంగం కలగకుండా అతడిని కాపలా ఉంచుతుంది. మహావిష్ణువు ఆడిన నాటకం మూలాన శివుడు గజాసురుని గర్భంలోనుండి బయటకువచ్చి కైలాసంలో తన మందిరం లోనికి ప్రవేశించబోగా పార్వతీ మానసపుత్రుడైన బాలుడు అడ్డగించడంతో ఆగ్రహించి బాలుని శిరస్సు ఖండించాడు. పార్వతి ఇది తెలుసుకుని కోపోద్రిక్తురాలవడంతో శివుడు బాలునికి ఏనుగు తలను అమర్చి ప్రాణం పోస్తాడు. ఈ బాలుడే మూషికాసురుని సంహరించడానికి అవతరించిన వినాయకుడు. ద్విరూపుడూ, ద్విజన్ముడూ, సర్వవిద్యాపారంగతుడూ అయిన వీరుని చేతిలో చావు వ్రాసిపెట్టి ఉన్న మూషికాసురుని వినాయకుడు సంహరించిన విధానమూ, మూషికాసురుని జన్మవృత్తాంతమూ, వినాయకుడు గణాధిపతి, విఘ్నేశ్వరుడు, సర్వ సిద్ధి ప్రదాత అయిన విధానమూ ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు[1].

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • కథ: బోణం ఆంజనేయులు
 • దర్శకుడు : కమలాకర కామేశ్వరరావు
 • సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
 • నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి

పాటలు[మార్చు]

 1. అన్ని లోకాలనేలెడు కన్నతల్లి - రచన: వేటూరి; గానం: ఎస్.జానకి
 2. ఎవరవయా ఎవరవయా ఏ దివ్య భువినుండి దిగి - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 3. ఒక వంక - రచన: వేటూరి; గానం: ఎమ్.రమేష్, ఎస్.పి.శైలజ
 4. కిలకిల నగవుల జలకములాడగ - రచన: ఆరుద్ర; గానం: వాణీ జయరాం
 5. కోటి నదులందు మునిగిన (పద్యం) - రచన: వేటూరి; గానం: ఎమ్.రమేష్
 6. కండ కావరమున (పద్యం) - రచన: వేటూరి; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 7. నమో నమో తాండవకేళీ లోలా నమో నమో ఆశ్రిత జనపాలా - రచన: వేటూరి; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 8. బాలను లాలించరా గజానన మేలిమి నెరజానరా - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
 9. మ్రోగి మ్రోగి మూగవైనవేలా ఆ గంధర్వ వీణల తీగెలు - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గానం: విజయలక్ష్మి శర్మ, ఎస్.పి.శైలజ

మూలాలు[మార్చు]

 1. రమణ (1 January 1980). "చిత్ర సమీక్ష శ్రీ వినాయక విజయము". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 66, సంచిక 270). Retrieved 16 January 2018.

బయటిలింకులు[మార్చు]