తిరుమల శ్రీవారి అన్నదాన నిలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమలలో శ్రీవారి అన్నదాన నిలయాన్ని ఏప్రిల్ 6, 1985న అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించారు. దీనిని శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం కాంప్లెక్స్ అని అంటారు.

భారత రాష్ట్రపతి జూలై 7, 2011న మరొక శ్రీవారి నూతన అన్నదాన నిలయాన్ని ప్రారంభించారు. దీనిని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కాంప్లెక్స్ అని అంటారు.

శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం[మార్చు]

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన పథకము తిరుమల తిరుపతి దేవస్థానం

శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కాంప్లెక్స్[మార్చు]

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కాంప్లెక్స్ ను నూతనంగా తిరుమలలో నిర్మించారు. దీని నిర్మాణానికి సుమారు 35 కోట్ల రూపాయల ఖర్చయింది. ఈ అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణానికి దాతల నుంచి విరాళాలను స్వీకరించారు.

దీనిని భారత రాష్ట్రపతి జూలై 7, 2011న ప్రారంభించారు. ఈ భవనంలో గల రెండు అంతస్తులలో నాలుగు పెద్ద భోజనశాలలు ఉన్నాయి. ఒక్కొక్క భోజనశాలలో ఒకేసారి వెయ్యి మంది కూర్చుని తినగలిగే సౌకర్యం ఉంది.

ప్రతిరోజు 12 గంటల పాటు అన్నదానం జరపబడే ఈ కాంప్లెక్స్ లో సుమారు వెయ్యి మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతిరోజు 70 వేల మంది భక్తులకు అన్నదానం చేయగల సామర్థ్యం ఈ కాంప్లెక్స్ లో ఉంది.

వీరికి సరిపడ భోజనంతో పాటు ప్రతిరోజు అదనంగా ఎనిమిది వేల రొట్టెలను ముద్ద పప్పుతో పాటు అందిస్తున్నారు. అత్యాధునిక యంత్రాల ద్వారా రొట్టెలను తయారు చేస్తున్నారు.

ఈ యంత్రం ప్రతి గంటకు రెండు వేల రొట్టెలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

మూలాలు[మార్చు]