Coordinates: 17°43′29″N 83°18′46″E / 17.724702°N 83.312717°E / 17.724702; 83.312717

శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ సంపత్ నినాయగర్ దేవాలయం
శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం
శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం
శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం is located in Andhra Pradesh
శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఉనికి
భౌగోళికం
భౌగోళికాంశాలు17°43′29″N 83°18′46″E / 17.724702°N 83.312717°E / 17.724702; 83.312717
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
స్థలంవిశాఖపట్నం
సంస్కృతి
దైవంవినాయకుడు

శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం విశాఖపట్నం లో ఉన్న దేవాలయం. ఇది విశాఖపట్నం లోని అసీల్ మెట్ట లో ఉంది. [1] ఇక్కడి ప్రధాన దైవం వినాయకుడు.

చరిత్ర[మార్చు]

ఈ ఆలయాన్ని 1962 లో టిఎస్ రాజేశ్వరన్, టిఎస్ సెల్వగణేశన్, ఎస్.జి.సంబంధన్ లు నిర్మించారు. ఈ ముగ్గురూ పోర్టులో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం చేసేవారు. వారు తమ వాహనాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా తొలుత ఇక్కడివినాయకుడికి పూజలు నిర్వహించేవారు. 1967లో కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఈ దేవాలయంలో శ్రీ గణపతి యంత్రాన్ని స్థాపించి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసాడు. 1996లో ఇది ఎంటోమెంట్స్ పరిధిలోకి వచ్చింది.[2]

1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో ఈ ఆలయం పి.ఎన్.ఎస్. ఘజీ దాడి నుండి నగరాన్ని రక్షించిందని స్థానిక ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇది విశాఖపట్నం తీరంలో ఆ జలాంతర్గామిని ముంచివేసిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. [3]

విశేషాలు[మార్చు]

సంపత్ వినాయగర్ ఆలయం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతంలో, కొత్తగా కొనుగోలు చేసిన ఏదైనా వాహనం యొక్క పూజను నిర్వహించడానికి ప్రజలు ఇప్పటికీ ఇక్కడికి వస్తూంటారు. [4] ఈ ఆలయం నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థిని గొప్ప ఆడంబరంగా జరుపుకుంటారు. ప్రజలు దీనిని నగరం యొక్క అదృష్ట దేవాలయంగా నమ్ముతారు [5]

మూలాలు[మార్చు]

  1. "The Hindu". Archived from the original on 2004-09-17. Retrieved 2020-10-23.
  2. "అప్పటి నుంచి ఇష్టారాజ్యంగా దేవాలయ నిర్వహణ". Amaravati News. Archived from the original on 2020-10-26. Retrieved 2020-10-23.
  3. gotirupati
  4. "Festive spirit pervades on eve of Ganesh Chaturthi". Deccan Chronicle. 17 September 2015. Retrieved 22 May 2019.
  5. timesofindia

వెలుపలి లంకెలు[మార్చు]