Jump to content

శ్రేయాస్ గోపాల్

వికీపీడియా నుండి
శ్రేయాస్ గోపాల్
2019 ఐపీఎల్ సందర్భంగా మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్‌లో గోపాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రామస్వామి శ్రేయాస్ గోపాల్
పుట్టిన తేదీ (1993-09-04) 1993 సెప్టెంబరు 4 (age 31)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడి చేయి లెగ్ స్పిన్
పాత్రఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013/14–2022/23, 2024/25–కర్ణాటక
2014–2017 , 2024ముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 19)
2018–2021రాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 37)
2022సన్‌రైజర్స్ హైదరాబాద్
2023/24కేరళ క్రికెట్ జట్టు
2025–Presentచెన్నై సూపర్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఎఫ్‌సి లిస్ట్ ఎ టీ20
మ్యాచ్‌లు 88 75 104
చేసిన పరుగులు 3,577 974 526
బ్యాటింగు సగటు 34.72 27.82 16.43
100s/50s 6/15 0/4 0/0
అత్యధిక స్కోరు 161* 64 48*
వేసిన బంతులు 12,421 3,340 1,936
వికెట్లు 254 119 124
బౌలింగు సగటు 29.12 27.82 17.35
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 8 2 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/17 5/19 5/11
క్యాచ్‌లు/స్టంపింగులు 30/– 20/– 28/–
మూలం: [1]

రామస్వామి శ్రేయాస్ గోపాల్ (జననం 4 సెప్టెంబర్ 1993)[1] దేశీయ క్రికెట్‌లో కర్ణాటక తరపున ఆడే భారతీయ క్రికెటర్.[2] ఆయన కుడిచేతి బ్యాటింగ్, లెగ్ బ్రేక్ బౌలింగ్ చేసే ఆల్ రౌండర్. శ్రేయాస్ గోపాల్ 2011లో భారత అండర్-19 క్రికెట్ జట్టు తరపున మూడు వన్డేలు ఆడాడు. ఆయన అండర్-13, అండర్-15, అండర్-16, అండర్-19 వంటి స్థాయిలలో కర్ణాటకకు నాయకత్వం వహించాడు.[3]

దేశీయ కెరీర్

[మార్చు]

శ్రేయాస్ గోపాల్ 2013లో కర్ణాటక తరఫున అరంగేట్రం చేసి 2014 ఫిబ్రవరి 12న రెస్ట్ ఆఫ్ ఇండియాపై ఇరానీ కప్ చరిత్రలో తొలి హ్యాట్రిక్ సాధించాడు, ఇది కర్ణాటక ఇరానీ కప్ గెలవడానికి సహాయపడింది.[4] ఆయన ఆగస్టు 2019లో 2019–20 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా బ్లూ జట్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.[5][6]

శ్రేయాస్ గోపాల్ అక్టోబర్ 2018లో 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా ఏ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[7]

ఇండియన్ ప్రీమియర్ లీగ్

[మార్చు]

శ్రేయాస్ గోపాల్ ను 2014 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆయన జనవరి 2018లో 2018 ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.[8] ఆయన 2019 ఏప్రిల్ 30న 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై హ్యాట్రిక్ సాధించాడు, ఇందులో విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ & మార్కస్ స్టోయినిస్ వికెట్లును తీసుకున్నాడు.[9][10][11][12]

శ్రేయాస్ గోపాల్ ఫిబ్రవరి 2022లో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేసింది. ఆయన 2024 ఐపీఎల్‌ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది.[13]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శ్రేయాస్ గోపాల్ బెంగళూరులోని ది ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. జైన్ విశ్వవిద్యాలయం నుండి బికాం (బ్యాచిలర్ ఆఫ్ కామర్స్) పూర్తి చేశాడు.[14] ఆయన తండ్రి రామస్వామి గోపాల్ 20 సంవత్సరాలు క్లబ్ క్రికెటర్ కాగా, అతని తల్లి అమిత రాష్ట్ర స్థాయిలో వాలీబాల్ ఆడింది. శ్రేయాస్ గోపాల్ తన బాల్యంలో తన రోల్ మోడల్ అనిల్ కుంబ్లే బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించడానికి ఇష్టపడ్డాడు.[15]

శ్రేయాస్ గోపాల్ తన చిరకాల స్నేహితురాలు నిఖితను 2021 నవంబర్ 24న వివాహం చేసుకున్నాడు.[16][17]

మూలాలు

[మార్చు]
  1. "Shreyas Gopal - CricketArchive profile". CricketArchive.
  2. "Shreyas Gopal All Rounder profile -Shreyas Gopal ICC ర్యాంకింగ్, కెరీర్, బ్యాటింగ్, బౌలింగ్ గణాంకాలు". TV9 Telugu. 2024. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  3. "Rahul Dravid is my cricketing God, says Shreyas Gopal". Times of India. Retrieved 10 August 2014.
  4. "Shreyas Gopal records first hat-trick of Irani Cup history - Times of India". The Times of India. Retrieved 4 May 2019.
  5. "Shubman Gill, Priyank Panchal and Faiz Fazal to lead Duleep Trophy sides". ESPNcricinfo. Retrieved 6 August 2019.
  6. "Duleep Trophy 2019: Shubman Gill, Faiz Fazal and Priyank Panchal to lead as Indian domestic cricket season opens". Cricket Country. Retrieved 6 August 2019.
  7. "Rahane, Ashwin and Karthik to play Deodhar Trophy". ESPNcricinfo. Retrieved 19 October 2018.
  8. "List of sold and unsold players". ESPNcricinfo. Retrieved 27 January 2018.
  9. Rajarshi Gupta (May 1, 2019). "IPL 2019: Shreyas Gopal of Rajasthan Royals claims a hat-trick in 5-over game vs RCB". India Today (in ఇంగ్లీష్). Retrieved 29 August 2021.
  10. "Shreyas Gopal cherishes big scalps of Kohli and AB De Villiers | Shreyas Gopal cherishes big scalps of Kohli and AB De Villiers" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 4 April 2019. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  11. "IPL 2019: Rajasthan Royals' Shreyas Gopal claims hat-trick in five-over-a-side game". The Times of India. 1 May 2019. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  12. "Gopal hat-trick in washout, RCB eliminated". ESPNcricinfo. Retrieved 1 May 2019.
  13. "CSK's latest recruit Shreyas Gopal dazzles with hat-trick, dismisses Hardik and Krunal Pandya for golden ducks in Mushtaq Ali Trophy". The Times of India. 3 December 2024. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  14. Notable Alumni Jain University
  15. IANS. "No Pressure, But Dream to Don India Colors Soon: Shreyas Gopal". India West (in ఇంగ్లీష్). Archived from the original on 8 జూలై 2020. Retrieved 8 July 2020.
  16. "भारत के इस लेग स्पिनर ने की शादी, Photos पोस्ट कर दी जानकारी, पत्नी चलाती हैं दो कंपनियां". TV9 Bharatvarsh. 25 November 2021. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  17. "Indian Celebrities who got married in 2021". Shaadivale. 29 December 2021. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.