షట్‌పుత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


  • ఔరసుడు = ధర్మపత్ని యందు పుట్టిన కుమారుడు
  • క్షేత్రజుడు = తన అనుమతితో భార్యకు ఇతరుల వలన పుట్టినవాడు
  • దత్తకుడు = దత్తత చేసుకున్న పుత్రుడు
  • కృత్రిముడు = కృత్రిమముగా తనకు అంటగట్టబడినవాడు, లేదా అభిమాన పుత్రుడు
  • గూఢోత్పన్నుడు = రహస్యముగా తన వలన ఇతరులకు పుట్టినవాడు
  • అపవిద్ధుడు = ఎవరో కని వదలివేయగా దొరికినవాడు

పాండవులు పాండురాజు అనుమతితో అతని భార్యలకు ఇతరుల వలన పుట్టినవారు. కనుక వారు పాండురాజుకు క్షేత్రజులు. కర్ణుడు కుంతీదేవి కని వదలి వేయగా రాధకు దొరికిన వాడు కనుక రాధకు కర్ణుడు అపవిద్ధుడు. ఉంపుడుకత్తెకు పుట్టిన పుత్రుడు గూఢోత్పన్నుడు.