Jump to content

షణ్ముఖ

వికీపీడియా నుండి
షణ్ముఖ
దర్శకత్వంష‌ణ్ముగం సాప్ప‌ని
రచనష‌ణ్ముగం సాప్ప‌ని
నిర్మాత
  • తుల‌సీరామ్ సాప్ప‌ని
  • ష‌ణ్ముగం సాప్ప‌ని
  • రమేష్ యాదవ్
తారాగణం
ఛాయాగ్రహణంఆర్.ఆర్. విష్ణు
కూర్పుఎంఏ మాలిక్
సంగీతంరవి బస్రూర్
నిర్మాణ
సంస్థ
సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్
విడుదల తేదీs
21 March 2024 (2024-03-21)(థియేటర్)
11 April 2024 (2024-04-11)( ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

షణ్ముఖ 2025లో విడుదలైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌పై తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని నిర్మించిన ఈ సినిమాకు ష‌ణ్ముగం సాప్ప‌ని దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 13న విడుదల చేసి,[1] సినిమాను మార్చి 21న విడుదల చేశారు.[2]

ఈ సినిమా ఆహా ఓటీటీలో ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

విగాండా(చిరాగ్ జానీ)కి ఆరు ముఖాలతో వికృత రూపంలో ఉన్న కొడుకు (షణ్ముఖ) పుడతాడు. వికృతంగా ఉన్న ఆ కొడుకు మామూలుగా మారాలంటే వివిధ రాశులకు చెందిన యువతులను బలి ఇవ్వాలని ఓ మాంత్రికుడు చెబుతాడు. దింతో విగాండా కొన్నేళ్లపాటు క్షుద్రపూజలు, మంత్రాలు, మాయలు నేర్చుకుంటాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పీజీలో రీసెర్చ్ స్కాలర్ సారా (అవికా గోర్) ఈ అమ్మాయిల మిస్సింగ్ కేసుకు సంబంధించి ప్రాజెక్టు చేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం తన మాజీ ప్రియుడు పోలీసాఫీసర్ కార్తీ వల్లభన్ (అది సాయికుమార్) సహాయం కోరుతుంది. మరి మిస్ అయిన అమ్మాయిలు ఎవరు? వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? షణ్ముఖని మాములు మనిషి చేయడానికి విగాండా చేసిన ప్రయత్నం ఏంటి ? షణ్ముఖ మాములు మనిషి అయ్యాడా? కార్తీ కేసుని చేధించాడా? కొడుకును మామూలు వాడిని చేయాలనుకున్న విగాండ కోరిక నెరవేరిందా ? లేదా? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "'ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ'.. ఆసక్తిగా ట్రైలర్". Sakshi. 13 March 2025. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
  2. "షణ్ముఖ అందరికీ నచ్చుతుంది". Chitrajyothy. 11 March 2025. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
  3. "ఓటీటీలోకి ఆది సాయికుమార్ 'షణ్ముఖ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!". NT News. 10 April 2025. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
  4. "రివ్యూ: షణ్ముఖ.. ఆది సాయికుమార్‌ ఖాతాలో హిట్‌ పడిందా?". Eenadu. 21 March 2025. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
  5. "ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా డివోషనల్‌ థ్రిల్లర్‌ షణ్ముఖ". NT News. 9 July 2024. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
  6. "'ష‌ణ్ముఖ'లో అవికా గోర్ ఎంత అందంగా ఉందో." Chitrajyothy. 30 June 2024. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=షణ్ముఖ&oldid=4508521" నుండి వెలికితీశారు