షన్నూ ఖురానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షన్నూ ఖురానా (జననం 1927) ప్రముఖ భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి, స్వరకర్త. హిందుస్థానీ సంగీతంలోని రాంపూర్-సహస్వాన్ ఘరానా సంప్రదాయానికి చెందినది ఈమె. ఘరానా సంప్రదాయంలో అత్యంత ప్రముఖులైన గురువు ఉస్తాద్ ముష్టాక్ హుస్సేన్ ఖాన్ శిష్యురాలు ఆమె. ఖయ్యాల్, తరానా, టుమ్రీ, దాద్రా, టప్పా, చైతీ, భజన్ వంటి వివిధ ప్రక్రియల్లో ఆమె చాలా బాగా పాడగలిగినా, బందిష్, రాగ్ ప్రక్రియల్లో ఆమె పాడే విధానం ఎంతో ప్రఖ్యాతి చెందింది. జోధ్ పూర్ లో పుట్టి, పెరిగిన షన్నూ, 1945 నుండి లాహోర్ లో ఆకాశవాణిలో పాటలు పాడేది. ఆ తరువాత ఆమె ఢిల్లీకి మారిపోయినా, అక్కడ కూడా ఆకాశవాణిలో పాడటం ఆపలేదు. ఆకాశవాణితో పాటు, ఢిల్లీలో జరిగే కచేరీల్లోనూ, సంగీత ఉత్సవాల్లోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది షన్నూ. కైరాగర్ విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఫిల్, పిహెచ్ డీ పూర్తి చేసింది ఆమె. ఆ తరువాత రాజస్థాన్ జానపద సంగీతంపై విస్తృత పరిశోధన చేసింది షన్నూ.

2006 మార్చి 29న పద్మభూషణ్ పురస్కారం అందుకుంటున్న షన్నూ ఖురానా

1991లో పద్మశ్రీ, 2006లో పద్మభూషన్ పురస్కారాలతో షన్నూను గౌరవించింది భారత ప్రభుత్వం.[1] 2002లో సంగీత, నృత్య, నాటకాలకు భారత్ లో అత్యంత ప్రతిష్ఠత్మకమైన సంస్థ అయిన కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇచ్చే అత్యంత గౌరవప్రదమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ను 2002లో అందుకుంది షన్నూ.

తొలినాళ్ళ జీవితం, సంగీత అభ్యాసం

[మార్చు]

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఒక పంజాబీ కుటుంబంలో 1927లో జన్మించింది షన్నూ.[2] ఆమెది సంగీత కుటుంబం కాదు. ఆమె కుటుంబంలో ఎక్కువ మంది వైద్యులు, ఇంజినీర్లు, ఫారిన్ లో ఉద్యోగం చేసేవారే ఉన్నారు. కానీ ఆమె సోదరుడు పండిట్ రంగనాధ్ రావు ముసల్గౌంకర్ వద్ద సంగీతం నేర్చుకోవడంతో ఆమెకు చాలా చిన్న  వయసులోనే సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. రంగనాధ రావు, గ్వాలియర్ ఘరానా సంప్రదాయానికి చెందిన రాజా భయ్యా పూంచ్వాలే కు మేనల్లుడు. ఆమె కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆడపిల్లలను సంగీతం నేర్చుకోనివ్వరు. కానీ ఆమె రేడియోలో సంప్రదాయ సంగీతాన్ని శ్రద్ధగా వినడం గమనించిన ఆమె తండ్రి, ఆమెను సంగీతం నేర్చుకొనేందుకు అనుమతించారు. అలా షన్నూ తన 12వ ఏట రంగనాధ్ రావు వద్ద సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2015-10-15. Retrieved July 21, 2015.
  2. "Shanno Khurama". gharanfestival. Archived from the original on 19 సెప్టెంబరు 2012. Retrieved 29 May 2013.
  3. Manjari Sinha (20 July 2007). "It's raining ragas". The Hindu. Archived from the original on 6 నవంబరు 2012. Retrieved 3 జూన్ 2017.