Jump to content

షన్నో దేవి

వికీపీడియా నుండి
షన్నో దేవి
హర్యానా శాసనసభ స్పీకర్
In office
1966 డిసెంబరు 6 – 1967 మార్చి 17
పంజాబ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్
In office
1951 మార్చి 20 – 1951 మార్చి 26
In office
1962 మార్చి 19 – 1966 అక్టోబరు 31
వ్యక్తిగత వివరాలు
జననం1901 జూన్ 1
మరణం1978 జులై 17
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
వృత్తిరాజకీయవేత్త

షన్నో దేవి (జననం:1901 జూన్ 1) ఈమె ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, భారతదేశంలోని రాష్ట్ర శాసనసభకు మొదటి మహిళా స్పీకరు. ఆమె పంజాబ్ రాష్ట్రం నుండి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు.[1] ఆమె 1966 డిసెంబరు 6 నుండి 1967 మార్చి 17 వరకు హర్యానా శాసనసభ స్పీకరుగా, 1962 మార్చి 19 నుండి 1966 అక్టోబరు 31 వరకు పంజాబ్ శాసనసభ డిప్యూటీ స్పీకరుగా పనిచేశారు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

దేవి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అమృత్సర్ సిటీ వెస్ట్ నియోజకవర్గం నుండి (1951-1957), భారత రాష్ట్రమైన పంజాబ్ లోని జగాధ్రి శాసనసభ నియోజకవర్గం (1962- 1966) కు ప్రాతినిధ్యం వహించారు.1940లో ముల్తాన్ నుండి పంజాబ్ శాసనసభకు (అప్పటి అవిభక్త భారతదేశం) దేవి మొదటిసారి ఎన్నికయ్యారు. గంగా రామ్ కుమారుడిని సుమారు 6000 ఓట్ల తేడాతో ఓడించారు.1946లో ఆమె తన సమీప ప్రత్యర్థి అభ్యర్థిని 19000 ఓట్ల తేడాతో ఓడించి అదే స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు.[4] 1951లో జరిగిన తదుపరి ఎన్నికలలో,ఆమె భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీ చేసి, భారతీయ జనసంఘకు చెందిన ప్రకాష్ చంద్ పై సుమారు 8000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.1962 పంజాబ్ శాసనసభ ఎన్నికలలో, భారత జాతీయ కాంగ్రెస్ టిక్కెటుపై పంజాబ్ శాసనసభ సభ్యురాలిగా తిరిగి ఎన్నికయ్యారు.[5][6]1966 డిసెంబరు 6న ఆమె హర్యానా శాసనసభలో మొదటి స్పీకరుగా చేరారు, అక్కడ ఆమె డిప్యూటీ స్పీకరుగా పనిచేశారు.[7]

వ్యక్తిగత జీవితం

దేవి అప్పుడు అవిభాజ్య భారతదేశమైన ముల్తాన్‌లో జన్మించింది.ఆమె తండ్రి లాల్ సేత్ రామ్ ఖన్నా ప్రభుత్వ ఉద్యోగి.దేవి జలంధర్ కన్యా మహా విద్యాలయ నుండి పట్టభద్రురాలై, విద్యార్థి నాయకురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను నిర్వహించారు.భారత విభజన తరువాత ఆమె భారతదేశంలోని పంజాబుకు వెళ్లారు.ఆమె రెండుసార్లు పంజాబ్ శాసనసభ,తరువాత హర్యానా శాసనసభ ఎన్నికయ్యారు.[8]

మూలాలు

[మార్చు]
  1. ↑ Chander, Prakash (2003). first woman deputy speakers in India. ISBN 9788176484558. Retrieved 5 July 2017.
  2. ↑ "Haryana Legislative Assembly speaker". legislativebodiesinindia.nic.in. Archived from the original on 13 May 2017. Retrieved 5 July 2017.
  3. ↑ "only woman to occupy a prominent position was Shanno Devi, the first Speaker of the Haryana Vidhan Sabha". tribuneindia.com. Retrieved 5 July 2017.
  4. ↑ "1940 & 1946 election of Multan". 1950. Retrieved 5 July 2017.
  5. ↑ "Election Results in Amritsar City West, Punjab". elections.traceall.in. Archived from the original on 30 సెప్టెంబరు 2018. Retrieved 5 July 2017.
  6. ↑ "Election Results in Jagadhri, Punjab". elections.traceall.in. Archived from the original on 30 సెప్టెంబరు 2018. Retrieved 5 July 2017.
  7. ↑ "Haryana Review, September 2009, Vol 23 Issue 8" (PDF). Haryana Review. p. 12. Archived from the original (PDF) on 17 మే 2018. Retrieved 14 February 2019.
  8. ↑ "List of Successful Candidates in Punjab Assembly Election in 1962". elections.in. Retrieved 9 July 2017.