షమీమ్ అక్తర్
షమీమ్ అక్తర్ | |||
![]() తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జస్టిస్ షమీమ్ అక్తర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2025 ఏప్రిల్ 17[1] | |||
పదవీ కాలం 2 జనవరి 2019 – డిసెంబర్ 2022 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1 జనవరి 1961 నల్లగొండ, తెలంగాణ రాష్ట్రం | ||
తల్లిదండ్రులు | జాన్ మహ్మద్, రెహీమున్సీసా బేగం | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
షమీమ్ అక్తర్ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 1986 నుంచి న్యాయవాదిగా సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించి 2019 జనవరి 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[2]
జస్టిస్ షమీమ్ అక్థర్ 2025 ఏప్రిల్ 11న తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యాడు.[3][4]
జననం, విద్యాభాస్యం
[మార్చు]షమీమ్ అక్తర్ 1961 జనవరి 1లో నల్లగొండలో రెహీమున్సీసా బేగం, జాన్ మహ్మద్ దంపతులకు జన్మించాడు. ఆయన నల్గొండలో డిగ్రీ వరకు చదివి, నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, హైదరాబాద్, బషీర్‌బాగ్ పీజీ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి 2006లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నాడు.
వృత్తి జీవితం
[మార్చు]షమీమ్ అక్తర్ ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశాక 1986 నుంచి 2002 వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. ఆయన 2002లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జిగా, ఖమ్మం జిల్లా అదనపు జిల్లా న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా, సికింద్రాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ అడిషనల్ డైరక్టర్‌గా, గుంటూరు జిల్లా నరసరావుపేట అదనపు జిల్లా న్యాయమూర్తిగా, నిజామాబాదు అదనపు జిల్లా న్యాయమూర్తిగా వివిధ హోదాల్లో పనిచేసి 2017 జనవరి 17న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "New Chairperson and Members of Telangana Human Rights Commission take charge; convene sitting to take up 300 old cases" (in Indian English). The Hindu. 17 April 2025. Archived from the original on 17 April 2025. Retrieved 17 April 2025.
- ↑ Sakshi Post (1 January 2019). "12 Judges Take Oath Under Telangana Chief Justice Radhakrishnan" (in ఇంగ్లీష్). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
- ↑ "Justice Shameem Akther Assumes Charge As Chairperson Of Telangana Human Rights Commission" (in Indian English). Deccan Chronicle. 17 April 2025. Archived from the original on 17 April 2025. Retrieved 17 April 2025.
- ↑ "Justice Shameem Akther Assumes Charge As Chairperson Of Telangana Human Rights Commission" (in Indian English). Deccan Chronicle. 17 April 2025. Archived from the original on 17 April 2025. Retrieved 17 April 2025.
- ↑ Sakshi (2 January 2019). "కొలువుదీరిన కొత్త హైకోర్టు". Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.