షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్
షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ | |
---|---|
దర్శకత్వం | డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ |
స్క్రీన్ ప్లే |
|
కథ |
|
దీనిపై ఆధారితం | మార్వెల్ కామిక్స్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | బిల్ పోప్ |
కూర్పు |
|
సంగీతం | జోయెల్ పి. వెస్ట్ |
నిర్మాణ సంస్థ | మార్వెల్ స్టూడియోస్ |
పంపిణీదార్లు | వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీs | ఆగస్టు 16, 2021(లాస్ ఏంజిల్స్ ) సెప్టెంబరు 3, 2021 (యుఎస్) |
సినిమా నిడివి | 132 నిముషాలు |
దేశం | యుఎస్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $150–200 మిలియన్ |
బాక్సాఫీసు | $432.2 మిలియన్ |
షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ 2021 లో విడుదలైన ఇంగ్లిష్ సినిమా[1]. ఇది మార్వెల్ కార్టూన్ పాత్ర అయిన "షాంగ్-చి" ఆధారంగా రూపొందించబడింది[2]. దీనిని మార్వెల్ స్టూడియోస్ నిర్మించింది, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఈ చిత్రానికి డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సిము లియు,[3] అక్వాఫినా, రోనీ లియోంగ్, బాలా సేన్, మెంగర్ జాంగ్ నటించారు.
కథ
[మార్చు]పది రింగుల నాయకుడు, వెన్వో, తన వద్ద ఉన్న రింగుల శక్తితో ప్రపంచాన్ని నిర్మిస్తాడు. అతను యింగ్ లీ అనే స్త్రీని కలుస్తాడు. ఆమె డాలోకి సంరక్షకురాలు. లీ అతనితో ప్రేమలో పడి, వివాహం చేసుకుటుంది. ఆమెను వెన్వో శత్రువులు చంపుతారు. వెన్వోకి కలలో తన భార్య బ్రతికే ఉందని, ఆమె ఒక చీకటి గుహలో బందీగా ఉన్నట్టు కనిపిస్తుంది. వెన్వో వెంటనే తన కొడుకు షాంగ్-చి, కుమార్తె జియాలింగ్ లను పిలిపిస్తాడు. వెన్వో భార్య చిక్కుకున్న ప్రదేశాన్ని తెరిస్తే, దానిలోని శక్తి ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అయినప్పటికీ, భార్యపై ప్రేమతో, భార్య కోసం కొడుకుతో, కూతురితో గొడవపడి తన శక్తులతో తలుపులు తీస్తాడు. అందులోంచి వచ్చిన శక్తి అతన్ని చంపేస్తుంది. చివరికి ఆ పది రింగులు షాంగ్-చికి వెళ్తాయి.[4]
నటవర్గం
[మార్చు]- సిము లియు (జు షాంగ్-చి)
- అక్వాఫినా (కాటి)
- మెంగెర్ జాంగ్ (జు జియాలింగ్)
- ఫ్లోరియన్ (రేజర్‌ఫిస్ట్)
- బెనెడిక్ట్ వాంగ్ (వాంగ్)
- బెన్ కింగ్స్లీ (ట్రెవర్ స్లాటరీ)
- టోనీ లెంగ్ (జు వెన్వు)
- మిచెల్ యో (యింగ్ నాన్)
మూలాలు
[మార్చు]- ↑ AdoroCinema, Shang-Chi e a Lenda dos Dez Anéis, retrieved 2022-04-08
- ↑ "Shang-Chi In Comics Powers, Enemies, History | Marvel". Marvel Entertainment. Retrieved 2022-04-08.
- ↑ Galuppo, Borys Kit,Mia; Kit, Borys; Galuppo, Mia (2019-07-20). "Marvel Finds Its Shang-Chi in Chinese-Canadian Actor Simu Liu". The Hollywood Reporter. Retrieved 2022-04-08.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "'Shang-Chi and the Legend of the Ten Rings' story and review". The New Indian Express. Retrieved 2022-04-08.