షాడో (2013 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాడో
Shadow poster.jpg
సినిమా విడుదల పోస్టర్
దర్శకత్వంమెహర్ రమేష్
నిర్మాతపరుచూరి కిరీటి
కథకోన వెంకట్
గోపీమోహన్
నటులుదగ్గుబాటి వెంకటేష్
తాప్సీ
మేకా శ్రీకాంత్
మధురిమ
సంగీతంఎస్.ఎస్. తమన్
ఛాయాగ్రహణంప్రసాద్ మూరెళ్ళ
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ
యునైటెడ్ మూవీస్
విడుదల
2013 మార్చి 27 (2013-03-27)
దేశంభారత్
భాషతెలుగు
ఖర్చు30 కోట్లు[1]

షాడో 2013 లో విడుదలైన తెలుగు చిత్రం.

కథ[మార్చు]

నానా భాయ్ (ఆదిత్య పంచోలి), అతని తమ్ములు జీవ, లాలా కలిసి ఇండియాలో పలుచోట్ల బాంబ్ బ్లాస్ట్ లు చేస్తుంటారు. వారిని ఎలాగైనా ప్రభుత్వానికి పట్టించాలనే ధ్యేయంతో అండర్ కవర్ జర్నలిస్ట్ రఘు రాం (నాగబాబు) నానా భాయ్ గ్యాంగ్ లో చేరి సమాచారం మొత్తం సేకరిస్తాడు. ఆ సమాచారాన్ని న్యూస్ పేపర్ ఓనర్ అయిన సిపి (సాయాజీ షిండే)కి ఇస్తాడు. అతను డబ్బుకి ఆశపడి నానా భాయ్ తో చేతులు కలపడంతో నానా భాయ్ రఘురాంని, అతని భార్య, కూతుర్ని దారుణంగా చంపేస్తాడు. అది చూసి అక్కడి నుంచి తప్పించుకున్న రఘురాం కొడుకు రాజారాం అలియాస్ షాడో (వెంకటేష్) చిన్నప్పుడే నానా భాయ్ అతని గ్యాంగ్ ని చంపాలని నిర్ణయించుకుంటాడు. రాజారాంకి బాబా (నాజర్) అండగా ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటాడు. అలా పెద్దైన రాజారాం నానా భాయ్ గ్యాంగ్ లోని ఒక్కొక్కర్నీ చంపేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే మలేషియాకి ప్రాజెక్ట్ కోసం వచ్చిన మధుబాల (తాప్సీ), పోస్ట్ మార్టం స్పెషలిస్ట్ దొంగ శ్రీనివాస్ (ఎం ఎస్ నారాయణ) లను వాడుకుంటాడు.

అదే తరుణంలో ఇండియాలో భారీ ఎత్తున బాంబు బ్లాస్ట్ లు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడంతో ఎసిపి ప్రతాప్ (శ్రీ కాంత్) ని నానా భాయ్ ని పట్టుకోవాలని రంగంలోకి దిగుతాడు. ప్రతాప్ పట్టు కోవాలనుకుంటున్న టైంలో నానా భాయ్ మనుషుల్ని షాడో చంపేస్తుండడంతో అసలు ఇతనెవరు ఎందుకు వీళ్ళని చంపుతున్నాడా? అని షాడో కోసం ప్రతాప్ వేట మొదలు పెడతాడు. అటు పోలీసుల్ని తప్పించు కుంటూ నానా భాయ్ గ్యాంగ్ ని షాడో ఎలా ఫినిష్ చేసాడు? అనేదే మిగిలిన కథాంశం.

నటవర్గం[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "చిత్రీకరణ వివరాలు". timesofindia.indiatimes.com. జులై 9, 2012. Archived from the original on 2013-08-01. Retrieved జనవరి28, 2013 at 4:07 PM IST. Check date values in: |accessdate= and |date= (help)