షామీర్‌పేట్‌

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
షామీర్‌పేట్‌
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో షామీర్‌పేట్‌ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో షామీర్‌పేట్‌ మండలం యొక్క స్థానము
షామీర్‌పేట్‌ is located in Telangana
షామీర్‌పేట్‌
తెలంగాణ పటములో షామీర్‌పేట్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°35′30″N 78°34′56″E / 17.591667°N 78.58223°E / 17.591667; 78.58223
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము షామీర్‌పేట్‌
గ్రామాలు 28
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,18,895
 - పురుషులు 61,438
 - స్త్రీలు 57,457
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.42%
 - పురుషులు 69.09%
 - స్త్రీలు 47.07%
పిన్ కోడ్ 500078

షామీర్‌పేట్‌, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇటీవలి కాలంలో పలు అభివృద్ధి పనుల వలన మంచి పురోభివృద్ధి సాధించింది.

షామీర్‌పేట్‌ చెరువు

పెద్ద చెరువు[మార్చు]

శామీర్‌పేట సమీపంలోని చెరువు పెద్ద చెరువుగా పేరుగాంచినది. ఇది ఒక విహారస్థలంగా కూడా అభివృద్ధి చెందినది. సెలవు దినాలలో పరిసర ప్రాంతవాసులచే ఈ చెరువు పర్యాటక ప్రాంతంగా కనిపిస్తుంది. రాజీవ్ రహదారి ఈ చెరువు కట్టపై నుంచే వెళుతుంది. అంతేకాకుండా ఈ చెరువు పరిసరాలలొ జవహర్ దుప్పుల పార్కు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ఉన్నాయి.

రత్నాలయ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం[మార్చు]

శామీర్‌పేటలో రాజీవ్ రహదారి ప్రక్కనే రత్నాలయం పేరుతో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల నుండి భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. శనివారం రోజులలో భక్తులతో ఈ దేవాలయం కిటకిటలాడుతుంది.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,18,895 - పురుషులు 61,438 - స్త్రీలు 57,457

మూలాలు[మార్చు]

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]