షార్ప్‌విల్లే మారణకాండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Apartheid షార్ప్‌విల్లే మారణకాండ 21 మార్చి 1960న దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్‌వాల్ ప్రావిన్స్‌ (ప్రస్తుతం గాటెంగ్ అని పిలుస్తున్నారు)లో ఉన్న షార్ప్‌విల్లే పట్టణప్రాంత పోలీసు స్టేషను‌ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న నిరసనకారుల యొక్క ఒక రోజు ఆందోళనల అనంతరం దక్షిణాఫ్రికా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 69 మంది హతమయ్యారు. అయితే ఆందోళనకారులు శాంతియుతంగా ఉన్నారని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.[1] పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అనేక మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. పోలీసు స్టేషను చుట్టూ ఉన్న ప్రహరీని దాటుకుని లోపలికి చొచ్చుకొచ్చేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడం వల్లే వారిపై కాల్పులు జరిపినట్లు మరికొందరు తెలిపారు.[2]

అంతకుముందు సంఘటనలు[మార్చు]

1920ల నుంచి నల్లజాతి దక్షిణాఫ్రికన్లు అనుమతి చట్టాల (పాసు చట్టాలు) ద్వారా నియంత్రించబడ్డారు. అది షార్ప్‌విల్లే మారణకాండకు దారితీసింది. హెండ్రిక్ వెర్వోయర్డ్ నేతృత్వంలోని వర్ణవిచక్షణను సమర్థించే నేషనల్ పార్టీ ప్రభుత్వం మరింత విభజన[2]ను అమలు చేయడానికి ఈ చట్టాలను ఉపయోగించింది. 1959-1960 మధ్యకాలంలో ఆ చట్టాలను మహిళలకు కూడా విస్తరించారు.[3]:pp.14,528 1960ల నుంచి ఈ అనుమతి చట్టాలు ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను ఖైదు చేయడానికి ఉపయోగించిన ప్రాథమిక ఆయుధాలుగా ఉండేవి. అదే సమయంలో ఈ చట్టాలపై ప్రధానమైన వ్యతిరేకత పుంజుకుంది. దాంతో అప్పట్లో ప్రతిఘటన రాజకీయాలు ఊపందుకున్నాయి.[3]:p.163

ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC) అనుమతి చట్టాలకు వ్యతిరేకంగా ఒక ఆందోళనల ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించుకుంది. ఈ ఆందోళనల పర్వం 31 మార్చి 1960న ప్రారంభంకావాల్సి ఉంది. అయితే ప్రత్యర్థి పాన్-ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్ (PAC), ANCని నీరుగార్చడానికి అంతకు పది రోజుల ముందే అంటే మార్చి 21న సొంతంగా ఒక ఉద్యమాన్ని చేపట్టింది. అందుకు కారణం ANC ఉద్యమం ద్వారా విజయం సాధించలేదని PAC భావించడం.[4][5]

మారణకాండ[మార్చు]

మార్చి 21న జోహ్నెస్‌బర్గ్‌కి సమీపంలోని షార్ప్‌విల్లే పట్టణ ప్రాంతంలో ఉన్న ఒక స్థానిక పోలీసు స్టేషను వద్ద 5,000 నుంచి 7,000 వరకు ఉండే జన సమూహం గుమిగూడింది. తాము పాస్ పుస్తకాలు తీసుకురాలేదని, అరెస్టు చేసుకోమంటూ వారు ఆ సందర్భంగా అక్కడకు వచ్చారు.[6] ఇది PAC నిర్వహించిన విస్తృత ఉద్యమంలో భాగం.

అక్కడ హాజరైన సమూహంలో పలువురు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అయితే షార్ప్‌విల్లే టెలిఫోన్ తీగలను తెంచడం, అదే రోజు పనులకు హాజరుకావొద్దంటూ వ్యక్తులకు కరపత్రాలు పంచడం మరియు బస్సు డ్రైవర్లు మరియు పాదచారులను అడ్డుకోవడం సహా PAC సైతం భయాందోళనలు కలిగించే విధంగా కొన్ని పనులు చేసినట్లు రుజువు ఉంది.[3]:p.534

10:00 am కల్లా భారీ సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడారు. అయితే అప్పటికి మాత్రం వాతావరణం శాంతియుతంగా మరియు సంబరంగా ఉంది. ఆందోళన ప్రారంభమైన సమయంలో పోలీసు స్టేషను వద్ద 20 కంటే తక్కువ మంది పోలీసు అధికారులు మాత్రమే అక్కడ ఉన్నారు. అనంతరం అక్కడ సమూహం అమాంతం దాదాపు 20,000 వరకు పెరిగింది. దాంతో పరిస్థితులు విషమించాయి. సుమారు 130 మంది పోలీసులు నాలుగు సారాసెన్ రక్షక కవచం కలిగిన కార్ల ద్వారా రంగంలోకి దిగారు. పోలీసులు స్టెన్ ఉప యంత్ర తుపాకీలు సహా మారణాయుధాలను కలిగి ఉన్నారు. అక్కడి ఆందోళనకారుల్లో ఎవరు గానీ రాళ్లు తప్ప మరేదైనా ఇతర సామగ్రిని కలిగి ఉన్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లేదు.[2]

మైదానానికి వందడుగుల దూరంలో సాబ్రి జెట్‌లు మరియు హార్వర్డ్ శిక్షకులు సమీపించారు. ఆందోళనకారుల సమూహాన్ని చెల్లాచెదరు చేయడానికి వారిని సమీపించారు. అయితే వారు రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. సుమారు 1:00 pm ప్రాంతంలో ఒక ఆందోళనకారుడిని పోలీసులు ఖైదు చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. జన సమూహం ప్రహరీ దిశగా ముందుకు కదిలారు. మరికాసేపట్లోనే కాల్పులు మొదలయ్యాయి.[2]

మరణాలు మరియు గాయాల సంఖ్య[మార్చు]

ఈ ఘటనలో 8 మంది మహిళలు మరియు 10 మంది పిల్లలు సహా 69 మంది మరణించగా 31 మంది మహిళలు మరియు 19 మంది పిల్లలు సహా 180 మందికి పైగా గాయపడినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. పారిపోవడానికి ప్రయత్నించడం వల్ల వారిలో ఎక్కువ మందికి వీపు భాగంలో గాయాలయ్యాయి.[7]

కాల్పులకు కారణాలు[మార్చు]

1960లోని పోలీసుల నివేదికల ప్రకారం, అనుభవంలేని పోలీసు అధికారులు భీతిల్లడం మరియు హఠాత్తుగా కాల్పులు జరిపారు. సుమారు నలభై సెకన్లలో ముగిసిన గొలుసుకట్టు ప్రతిచర్యల ద్వారా వారు విరుచుకుపడ్డారు. మారణకాండ సంభవించడానికి రెండు నెలల ముందు పోలీసులు భయపడి ఉండొచ్చు. కాటో మనోర్ వద్ద మరో తొమ్మిది మంది పోలీసులు హత్యకు గురయ్యారు.[4] "స్థానిక మనస్తత్వం శాంతియుత ఆందోళనపై తాము హింసకు పాల్పడేందుకు అవకాశం కల్పించలేదని షార్ప్‌విల్లేలో పోలుసు బలగాలకు కమాండింగ్ అధికారియైన లెఫ్ట్‌నెంట్ కల్నల్ పీనార్ తమ నివేదికలో పేర్కొన్నారు. ఇక్కడ సేకరించడం (గేదర్) అంటే వారి అర్థం హింస అని"[7] కాల్పులకు ఆదేశించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తాను అలా చేసి ఉండనని చెప్పారు.

1998లో ట్రూత్ అండ్ రీకాన్సిలేషన్ కమిషన్కు సమర్పించిన ఆధారంలో "కాల్పులకు ఒక ఉన్నతస్థాయి చర్చ జరిగినట్లు" సూచించబడింది.[3]:p.537

స్పందన[మార్చు]

మారణహొమం బాధితులను చూపిస్తున్న చిత్రం

కాల్పుల నేపథ్యంలో నల్లజాతీయుల్లో తక్షణం ఉద్రిక్తత పెరిగింది. మరుసటి వారంలో దేశం నలుమూలలా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, సమ్మెలు మరియు దొమ్మీలు ఊపందుకున్నాయి. 30 మార్చి 1960న ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి, 18,000 మందికి పైగా అరెస్టు చేసింది.

షార్ప్‌విల్లే కాల్లుల నేపథ్యంలో అంతర్జాతీయ నిరసన ఉప్పెన ఎగసిపడింది. పలు దేశాల్లో[8][9] బాధితులకు అనుకూలంగా సంఘీబావ ప్రదర్శనలు చేపట్టడం జరిగింది. ఐక్యరాజ్యసమితి కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. 1 ఏప్రిల్ 1960న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 134ను ఆమోదించింది. దాంతో దక్షిణాఫ్రికా చరిత్రలో షార్ప్‌విల్లే ఒక మలుపు నాంది పలికింది. ఈ దేశం అంతర్జాతీయ సమాజంలో అత్యంత వివిక్తమైనదిగా గుర్తించబడింది. ఈ ఘటన 1961లో కామన్వెల్త్ దేశాల నుంచి దక్షిణాఫ్రికా నిష్క్రమించడంలో కీలక పాత్ర పోషించింది.

షార్ప్‌విల్లే మారణకాండ PAC మరియు ANCలపై నిషేధానికి దారితీసింది. అంతేకాక ఈ సంస్థలు నిష్క్రియాత్మక ప్రతిఘటన నుంచి సాయుధ ప్రతిఘటనకు మారడానికి కారణమైన ఉత్ప్రేరకాల్లో ఇది ఒకటి, తర్వాత PAC సైనిక విభాగం, పోకో మరియు ANC సైనిక విభాగం, ఉంకోంటో వుయ్ సిజ్‌వుయ్‌ స్థాపన జరిగింది.

పర్యవసానాలు[మార్చు]

21 మార్చి 1994 నుంచి ఆ రోజును దక్షిణాఫ్రికాలో మానవ హక్కుల దినోత్సవంగా గుర్తించబడుతోంది.

అధ్యక్షుడు నెల్సన్ మండేలా 10 డిసెంబరు 1996న దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి చట్టబద్ధత కల్పించడానికి షార్ప్‌విల్లే ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారు.

"పోలీసు చర్యలు ఆయుధరహిత వ్యక్తులను అడ్డుకోవడానికి అత్యధిక బలగాలను అనవసరంగా ఉపయోగించడం ద్వారా హెచ్చుస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేందుకు కారణమయ్యాయి" అని 1998లో ట్రూత్ అండ్ రీకాన్సిలేషన్ కమిషన్ (TRC) గుర్తించింది.[3]:p.537

జాత్యహంకార వివక్ష నిర్మూలణ సందర్భంగా అంతర్జాతీయ దినోత్సవం[మార్చు]

మారణకాండకు గుర్తుగా మార్చి 21ని వార్షిక జాత్యహంకార వివక్ష నిర్మూలణా అంతర్జాతీయ దినోత్సవంగా UNESCO ప్రకటించింది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • షార్ప్‌విల్లే సిక్స్ – 1984 అంతర్జాతీయ ద్యానము కలిగించిన షార్ప్‌విల్లే ఘటనలో ఆరుగురు వ్యక్తులు నేరస్తులుగా చూపించబడ్డారు.
 • యునైటెడ్ నేషన్స్ సెక్యురిటి కౌన్సిల్ రిసల్యుషన్ 610
 • యునైటెడ్ నేషన్స్ సెక్యురిటి కౌన్సిల్ రిసల్యుషన్ 615

సూచనలు[మార్చు]

 1. మక్ కే, జాన్ P.; హిల్, బెంనేట్ట్ D.; బక్లర్, జాన్; ఎబ్రే, పట్రికియ బక్లే; బెక్, రోగర్ B.; క్రౌస్టన్, క్లార్ హరు; వీస్నార్-హాంక్స్, మెర్రి E. ఏ హిస్టరీ అఫ్ వరల్డ్ సొసైటీస్: ఫ్రొం 1775 టు ప్రెసెంట్ . ఎనిమిదవ సంచిక. సంపుటం C – ఫ్రొం 1775 టు ప్రెసెంట్. (2009). బెడ్ఫోర్డ్/St.మార్టిన్స్ Archived 2011-02-25 at the Wayback Machine.: బోస్టన్/న్యూయార్క్. ISBN 978-0-312-68298-9. ISBN 0-226-68464-4. "1950 నాటికి, నల్ల జాతీయులు --మరియు వారి వర్ణ జీతేయులు, తెల్ల జాతీయులు, మైరియు ఆసియా సహాయకులు --భారి స్థాయిలో శాంతియుత నిరసనలు చేయసాగారు. 1960లో ఒక మలుపు వచ్చింది మాత్రం, షార్ప్‌విల్లే లో ఒక పూలీసు అధికారి ప్రశాంతమైన జనం పై కాల్పులు జరిపి మరియు అరవై తొమ్మిది మంది నల్ల జాతీయులు మరణించడం వలన సంభవించినది" (1010).
 2. 2.0 2.1 2.2 2.3 "The Sharpeville Massacre". Time Magazine. 4 April 1960. Retrieved 15 December 2006. Cite news requires |newspaper= (help) ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "TimeArticle" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 3. 3.0 3.1 3.2 3.3 3.4 Truth and Reconciliation Commission of South Africa Report, Volume 3, Chapter 6 (PDF). 28 October 1998. pp. 531–537. Retrieved 15 December 2006.
 4. 4.0 4.1 Boddy-Evans, Alistair. "Sharpeville Massacre, The Origin of South Africa's Human Rights Day". about.com. మూలం నుండి 17 ఫిబ్రవరి 2009 న ఆర్కైవు చేసారు. Retrieved 15 December 2006. Cite web requires |website= (help)
 5. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-03-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-03-13. Cite web requires |website= (help)
 6. సౌత్ ఆఫ్రికాన్ చరిత్రలోషార్ప్‌విల్లే ను గుర్తుంచుకొనుము
 7. 7.0 7.1 Reeves, Rt. Reverend Ambrose. "The Sharpeville Massacre - A watershed in South Africa". sahistory.org.za. మూలం నుండి 6 జూన్ 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 15 July 2007. Cite web requires |website= (help)
 8. "Outside సౌత్ ఆఫ్రికా బయట షార్ప్‌విల్లే గురించి చాలా పెద్ద స్పందనలు వచ్చాయి చాలా దేశాల్లో చాలా సందార్బాల్లో సౌత్ ఆఫ్రికా కు వ్యతిరేకంగా చాలా మంచి స్పందనలు వచ్చాయి".—Reeves Rt-Rev A.షార్ప్‌విల్లే మారణ హొమం--సౌత్ ఆఫ్రికాలో ఒక కంటతడి పెట్టించే సంఘటన Archived 2012-07-19 at Archive.is
 9. ఉదాహరణ, "[I]సౌత్ ఆఫ్రికాలో షార్ప్‌విల్లే మారణహొమం తరువాత, సిడ్నీలో సుమారు 1000 పైగా విద్యార్దులు పక్షపాత వ్యవస్థ పై నిరసన తెలిపారు".—బర్కాన్ A. సిడ్నీ విశ్వవిద్యాలయం లో విద్యార్దుల కార్యకలాపాలు 1960-1967 in హిస్టరీ అఫ్ ఎడ్యుకేషన్ రివ్యు, 1 జనవరి 2007