షాలిని పాండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాలిని పాండే
Shalini Pandey at 100% kaadhal movie launch.png
జననం (1993-09-23) 1993 సెప్టెంబరు 23 (వయసు 29)
జాతీయతభారతీయురాలు
వృత్తిచలనచిత్ర నటి
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం

షాలిని పాండే భారతీయ చలనచిత్ర నటి. 2017లో తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా సినీరంగంలోకి ప్రవేశించింది.[1][2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

శాలిని పాండే 1993, సెప్టెంబరు 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. జబల్ పూర్ లోని జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించింది.

సినిమారంగ ప్రస్థానం[మార్చు]

నటనపై ఉన్న ఆసక్తితో నాటకాలలో నటిస్తున్న షాలిని పాండే, అర్జున్ రెడ్డి అనే తెలుగు చలనచిత్రం ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది. తెలుగు మాట్లాడడం రాకపోయినా ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ప్రస్తుతం 100% కాదల్, మహానటి చిత్రాలలో నటిస్తోంది.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2017 అర్జున్ రెడ్డి ప్రీతి శెట్టి తెలుగు
2018 మేరి నిమ్ము నిమ్ము స్నేహితురాలు హిందీ అతిధి పాత్ర
మహానటి వి.ఎన్. జానకి తెలుగు
మళయాలం
తమిళం
2019 ఎన్.టి.ఆర్. కథానాయకుడు షావుకారు జానకి తెలుగు
118 మేఘ తెలుగు
100% కాదల్ మహాలక్ష్మి తమిళం
గోరిల్ల ఝాన్సీ తమిళం చిత్రీకరణ
ఇద్దరి లోకం ఒకటే వర్ష తెలుగు
2020 బాంఫడ్ నీలం హిందీ
నిశ్శబ్దం సొనాలి తెలుగు ద్విభాషా చిత్రం
సైలెన్స్ తమిళం
2021 జయేశ్ భాయ్ జోర్దార్ కింజల్ అజ్మెరా హిందీ
మహారాజ

లఘు చిత్రాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాష ఇతర వివరాలు
2020 ద్వంద్ ప్రధాన పాత్ర హిందీ [3]

Television[మార్చు]

సంవత్సరం పేరు భాష చానల్ ఇతర వివరాలు
2016 మన్ మే హై విష్వాస్ హిందీ Sony Television
2017 క్రైం పాట్రొల్ హిందీ Sony Television

Web series[మార్చు]

సంవత్సరం పేరు పాత్రపేరు భాష నెట్‌వర్క్ ఇతర వివరాలు
2018 గందీ బాత్ జాన్వి హిందీ ZEE5 adult movie

మూలాలు[మార్చు]

  1. సాక్షి (25 August 2017). "'అర్జున్ రెడ్డి' మూవీ రివ్యూ". Retrieved 1 March 2018.
  2. Deccan Chronicle, Entertainment, Tollywood (12 August 2017). "Shalini Pandey: Driven by passion". Panita Jonnalagadda. Retrieved 1 March 2018.
  3. "Shalini Panday Shines In The Short Film Dwand - Bollywood Galiyara". Bollywood Galiyara (in ఇంగ్లీష్). 17 December 2020. Archived from the original on 17 డిసెంబరు 2020. Retrieved 18 December 2020.