Jump to content

శిఖా వర్మ

వికీపీడియా నుండి
(షిఖా వర్మ నుండి దారిమార్పు చెందింది)
శిఖా వర్మ
వృత్తిమహిళా శాస్త్రవేత్త
జీవిత భాగస్వామిఅజిత్ మోహన్

శిఖా వర్మ తండ్రి ఇంజనీరు. ఆయన పిల్లలకు చదువు ముఖ్యత్వం గురించి చెప్తూ ఉండేవాడు. శిఖా వర్మకు ఆరంభకాలంలో తండ్రి ప్రోత్సాహం అధికంగా ఉంటూ ఆమెకు సైన్స్ మీద ఆసక్తి ఏర్పడింది. తరువాత. ఆమె లెవెంత్ చదివేసమయంలో ఆమె తండ్రి ఉద్యోగనుండి విరమించాడు. అప్పుడు శిఖా వర్మ అన్న చదువుకు ముఖ్యత్వం ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఆమె తల్లితండ్రులు చక్కగా చదువుకుని స్వతంత్రంగా జీవించమని చెప్పేవారు.

ఐ.ఐ.టి

[మార్చు]

1982లో కాన్పూర్ ఐ.ఐ.టిలో ఎం.ఎస్.సి అధ్యయనం కొరకు చేరింది. అక్కడ టీచర్లు విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ఇచ్చేవారు. ప్రొఫెసర్ జి.కె మెహతాస్ ఎక్పెరిమెంటల్ మెథడ్స్ టీచింగ్ శిఖా వర్మకు ప్రేరణ ప్రేరణ కలిగించిది. ఆతరువాత ఆమె ఎక్పెరిమెంటల్ మెథడ్స్ పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నది. ఐ.ఐ.టిలో ఆమె తన సీనియర్ అయిన అజిత్ మోహన్‌ను కలుసుకున్నది. తరువాత ఆమె 1984లో ఎం.ఎస్.సి పూర్తిచేసిన తరువాత అజిత్‌ మోహన్‌ను వివాహం చేసుకున్నది. తరువాత భార్యాభర్తలిద్దరూ యు.ఎస్‌లోని సిరాకస్ యూనివర్శిటీలో పి.హె.డి చేసారు.

పి.హెచ్.డి

[మార్చు]

శిఖా వర్మ 1990లో పోస్ట్‌డాక్టొరల్ పొజిషన్ కొరకు క్లేవ్‌లాండ్ లోని వెస్ట్రన్ యూనివర్శిటీలో చేరింది. తరువాత మిల్వూకీ సమీపంలో ఉన్న " యూనివర్శిటీ ఆఫ్ విస్కాంసిన్ "లో కొనసాగింది.శిఖా వర్మ.1993లో ఎం.బి.ఇ , ఎం.ఒ.సి.వి.డి అధ్యయనం చేయడానికి " యూనివర్శిటీ ఆఫ్ కలిఫోర్నియా- శాంటాబర్బరా "కి వెళ్ళింది.

పోస్ట్‌డాక్టొరల్ పొజిషన్

[మార్చు]

శిఖా వర్మ ఆమె భర్త పోస్ట్‌డాక్టొరల్ పొజిషన్ కొరకు యు.ఎస్.లోని వేరువేరు ప్రాంతాలలో ఉన్నందున రెండుప్రాతాలు ఒకదానికి ఒకటి దూరంగా ఉన్నందున భార్యాభర్తలు ఇరువురు 4 సంవత్సరాల కాలం దూరంగా ఉండిపోయారు. తరువాత వారిరువురు ఒకే ప్రదేశంలో నివసించాలని నిర్ణయించుకుని భారతదేశంలో పర్మనెంట్ పొజిషన్ కొరకు అభ్యర్థించారు. అందుకు బదులుగా భువనేశ్వర్ " ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ " (ఐ.ఒ.పి) నుండి ఫాకల్టీ కొరకు భార్యాభర్త లిరువురికి అవకాశం లభించింది. 1994 వేసవిలో వారికి కుమారుడు జన్మించాడు. తరువాత మూడు మాసాలకు ఆమె ఐ.ఒ.పిలో చేరింది. వారిరువురికి సమానార్హతలు ఉన్నందున ఇరువురికి ఒకే ఇంస్టిట్యూట్లులో ఉద్యోగాలు లభించాయి.

ఐ.ఒ.పి

[మార్చు]

ఆరంభకాలంలో ఐ.ఒ.పిలో శిఖా పని వర్మకు చాలా కష్టం, శ్రమతో గడిచింది. ఎక్స్‌పెరిమెంటల్ సిస్టంలో సరైన వసతులు లేని కారణంగా సమస్యలు ఎదురైయ్యాయి. అయినప్పటికీ భర్త సహకారంతో ఎక్స్‌పెరిమెంటల్ సిస్టం ఏర్పాటు చేసి పనిచేయడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకున్నది. పిల్లల పోషణ నిమిత్తం వారిరువురు పనివేళలను షిఫ్ట్ పద్ధతిలో మార్చుకుని పనిచేసారు. శిఖా వర్మ ఎక్స్‌పెరిమెంట్లు తరచుగా రాత్రివేళవరకు కొనసాగుతుంటాయి. ఐ.ఒ.పిలో పనిచేసే సమయంలో ఎక్స్‌పెరిమెంట్లు నిర్వహించడానికి దేశంలోని ఇతర లాబరేటరీలకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడేది. ఆమె మొదటిసారి కాంఫరెంస్‌కు వెళ్ళేసమయానికి ఆమె కుమారునికి 6 మాసాలు మాత్రమే. కాని భర్త సహకారం, డైరెక్టర్ ప్రొఫెసర్ రామమూర్తి అందించిన సహకారంతో ఇలాంటి పరిస్థితులను అధిగమించగలిగింది. తరువాత నిధులను సమకూర్చుకుని ఐ.ఒ.పిలో లాబరేటరీ ఏర్పాటు చేసిన తరువాత పరిస్థితులు అనికూలంగా మారాయి. తరువాత ఆమె రీసెర్చ్ స్కాలర్స్‌కు మార్గదర్శిగా, తల్లిగా బాధ్యతలు విజయవంతంగా నెరవేర్చగలిగింది.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.


"https://te.wikipedia.org/w/index.php?title=శిఖా_వర్మ&oldid=3858249" నుండి వెలికితీశారు