షి యోమి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షి యోమి జిల్లా
మఠం నుండి మెచుకా దృశ్యం
మఠం నుండి మెచుకా దృశ్యం
Location of Shi Yomi district in Arunachal Pradesh
Location of Shi Yomi district in Arunachal Pradesh
దేశం India
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
స్థాపించబడిందిడిసెంబర్ 9, 2018
ప్రధాన కార్యాలయంటాటో
విస్తీర్ణం
 • Total2,875 km2 (1,110 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • Total13,310
 • సాంద్రత4.6/km2 (12/sq mi)
కాలమానంUTC+05:30 (IST)
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుAR

ఈశాన్య భారతదేశం,అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 23 జిల్లాల్లో షియోమి జిల్లా ఒకటి.[1][2] చైనా సరిహద్దు వెంబడి ఉత్తర ప్రాంతాలను పశ్చిమ సియాంగ్ జిల్లాను విభజించడం ద్వారా షియోమి కొత్త జిల్లాగా 9 డిసెంబరు 2018 న సృష్టించబడింది.విభజించగా మిగిలిన దక్షిణ ప్రాంతాలు పశ్చిమ సియాంగ్ జిల్లాగా మిగిలిపోయాయి.దీని ప్రధాన కార్యాలయం టాటోలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఇదిఒకప్పుడు చుటియా రాజ్యంలో ఒకభాగంగా ఉంది.

స్థానం[మార్చు]

మెచుకా తరువాత మెక్‌మహాన్ రేఖ భారత భూభాగాన్ని,చైనా భూభాగాన్ని వేరు చేస్తుంది.[3]

జనాభా[మార్చు]

షియోమి జిల్లోలా ఆది,టాగిన్,మెంబా తెగల ప్రజలు ఎక్కువుగా నివసిస్తున్నారు.లోయలో పాటిస్తున్న మతాలలో డోని పోలో, టిబెటన్ బౌద్ధమతం, క్రైస్తవ మతాలకు చెందిన జనాభా ఉన్నారు.

షియోమి జిల్లాలో ఆది,టాగిన్,మెంబా భాషలు మాట్లాడతారు.

విభాగాలు[మార్చు]

మెచుకా,టాటో,పిడి,మానిగోంగ్ అనే నాలుగు పరిపాలనా విభాగాలు జిల్లాలో ఉన్నాయి.అరుణాచల్ తూర్పు లోకసభ నియోజకవర్గంలో మెచుకా ఒక భాగంగా ఉంది.[4][5]

రవాణా[మార్చు]

అరుణాచల్ ప్రదేశ్ ఆధునిక సరిహద్దు రహదారి నిర్మాణానికి ముందు,స్థానిక ప్రజలకు సరుకులను సరఫరా చేయడానికి, భారత వైమానిక దళం ఉపయోగించే విమానాశ్రయం ద్వారా మాత్రమే ప్రవేశం ఉంది.

భారత వైమానిక దళం మెచుకాలో అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్(ఎఎల్‌జి)గా పిలువబడే విమానాశ్రయాన్ని నిర్వహిస్తుంది. అస్సాంలోని నగరాల నుండి అంటోనోవ్32 విమానం,హెలికాప్టర్ల ద్వారా కీలకమైన సామాగ్రిని తీసుకురావడానికి విమానాశ్రయం తరచుగా ఉపయోగిస్తారు.విమానాలు దిగే ప్రాంతాన్ని ప్రభుత్వం 2017లో కాంక్రీట్ తోఉన్నత నిర్మాణంగా 4700 అడుగులకు పునర్నిర్మించి, బలోపేతం చేశారు.[6] ఈ ప్రాంతంలో గణనీయమైన సైనిక ఉనికి ఉంది.ఇది పౌరులకు కొన్ని ఉపాధి అవకాశాలను కలిగిస్తుంది.

ఉడాన్ పథకం కింద వారానికి రెండుసార్లు చిన్న విమాన సేవలు ఉన్నాయి. ఉడాన్ పథకం కింద ఉండని 9 మంది కూర్చోనే సదుపాయం నిర్ణీత సమయాలలో సేవలు నిర్వహించడానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనధికార విమానయాన సంస్థల నుండి వేలం ధరఖాస్తులు ఆహ్వానించింది.[6]

పర్యాటక[మార్చు]

షి యోమి జిల్లా,మెచుకా క్రమంగా ఒక పేరు గడించిన పర్యాటక కేంద్రంగా మారుతోంది.అరుణాచల్ ప్రదేశ్ కారణంగా దాని అత్యద్భుతమైన అందాన్ని,అన్యదేశ తెగలు,సున్నితమైన కొండలు,మంచుతో కప్పబడిన పర్వతాలు, మెచుఖా గుండా ప్రవహించే సియోమ్ నది కూడా లోయలో ఒక సుందరమైన దృశ్యాన్ని అందిస్తుంది.ఇక్కడ ప్రధాన పర్యాటక ఆకర్షణ మహాయాన బౌద్ధ మతానికి చెందిన 400 సంవత్సరాల పురాతన సామ్టెన్ యోంగ్చా మఠం, ఎంతో గౌరవనీయమైన తవాంగ్ మొనాస్టరీకి సమకాలీనుడు, ఇది మెచుఖా పశ్చిమ భాగంలో ఒక కొండపై ఉంది.[7]

ఇది కూడ చూడు[మార్చు]

  • అరుణాచల్ ప్రదేశ్ జిల్లాల జాబితా

ప్రస్తావనలు[మార్చు]

  1. "Arunachal Assembly Passes Bill For Creation Of 3 New Districts". NDTV.com. Retrieved 2018-08-30.
  2. "Arunachal Pradesh gets 25th district called Shi Yomi". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2019-02-16.
  3. "The last village in our arunachal". Retrieved 1 August 2017.
  4. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011.
  5. "Mechuka MLA". Archived from the original on 19 August 2016. Retrieved 14 August 2016.
  6. 6.0 6.1 Arunachal Pradesh plans fixed-wing flight service to Mechuka, closest to China border, The Hindu, 15 May 2018.
  7. "Mechuka Valley to be next tourist hotspot in northeast". The Times of India. 20 April 2012. Archived from the original on 4 జూలై 2013. Retrieved 26 April 2013.