షీలా నగర్ (విశాఖపట్నం)
షీలా నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°43′08″N 83°12′08″E / 17.718959°N 83.202347°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530012 |
షీలా నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి దక్షిణ భాగంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి సుమారు 13 కి.మీ.ల దూరంలో ఉంది.
గురించి
[మార్చు]ఈ ప్రాంతంలో పెద్దపెద్ద నివాస సముదాయాలు ఉన్నాయి. గాజువాక, ఎన్ఎడి ఎక్స్ రోడ్ వంటి ముఖ్య ప్రాంతాలతో సమీపంలో ఉండడంవల్ల ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. విశాఖపట్నం నగరంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే రహదారులు, మురుగునీరు, తాగునీరు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఇక్కడ సౌకర్యవంతంగా ఉన్నాయి.
భౌగోళికం
[మార్చు]ఇది 17°43′08″N 83°12′08″E / 17.718959°N 83.202347°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]తుంగలం, బిహెచ్‌పివి టౌన్‌షిప్, మిండి విలేజ్, ఆటో నగర్, అహ్మద్‌నగర్ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
రియల్ ఎస్టేట్
[మార్చు]ప్రస్తుతం షీలా నగర్‌లోని భూమికి ఎక్కువ డిమాండ్ ఉంది, భూమి ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి.[2] ఒఎన్‌జిసి, హెచ్‌పిసిఎల్, విఎస్‌పి, నాపర్‌వా వంటి పిఎస్‌యుల ఉద్యోగులు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్నారు.
ప్రార్థనా స్థలాలు
[మార్చు]ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది.
వినోదం
[మార్చు]ఈ ప్రాంతంలో ఎస్‌టిబిఎల్ సినీవర్ల్డ్ అనే మల్టీప్లెక్స్ ఉంది.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో షీలా నగర్ మీదుగా గాజువాక, ఎన్ఏడి ఎక్స్ రోడ్, కంచరపాలెం, ఆర్‌టిసి కాంప్లెక్స్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో గోపాలపట్నం రైల్వే స్టేషను, సింహాచలం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Sheela Nagar Locality". www.onefivenine.com. Retrieved 7 May 2021.
- ↑ "Price edge drives realty boom on Vizag outskirts". The Times of India. Hyderabad. 31 January 2012. Retrieved 7 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 7 May 2021.