ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా

వికీపీడియా నుండి
(షెడ్యూల్డ్ కులాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

షెడ్యూల్డు కులాలు అనగా(ఎస్సీల్లో) చేర్చడానికి రాజ్యాంగం ప్రకారం ఉండవలసిన అర్హత - ‘సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం.

ప్రసుతం ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలో 61 కులాలున్నాయి: ఒక్కోకులానికి సంప్రదాయకంగా ఒక్కో వృత్తి ఉంది. ఎస్సీలను బీసీల మాదిరిగానే 4 భాగాలుగా ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజిస్తూ 1997 జూన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 68, 69లను విడుదలయ్యాయి. మాల మహానాడు సుప్రీం కోర్టులో సవాలు చేయగా, 2004 నవంబరు 5న వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలేదనీ, ఈ చర్య పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంతోనే సాధ్యమనీ ప్రకటిస్తూ జి.ఒ.ను రద్దు చేసింది.

  1. ఆది ఆంధ్ర
  2. ఆది ద్రవిడ
  3. అనాముక
  4. అరెమాల
  5. అరుంధతీయ - తోలుపని
  6. అరవమాల
  7. బారికి - గ్రామ కాపరి, బోయీ
  8. బావురి - బుట్టలతయారీ
  9. బేడజంగం, బుడగ జంగం
  10. బైండ్ల - మాదిగల పౌరోహిత్యం, మైసమ్మ మారెమ్మలను మేల్కొల్పటం
  11. బ్యాగరి, బ్యాగర - కాటికాపరి, నేతపని
  12. చాచాతి - పండ్లు పూలు అమ్మటం, పాకీపని
  13. చలవాది - గ్రామకాపరి, డోలువాయించటం
  14. చమర్, మోచి ముచ్చి, చమర్ రవిదాస్, చమర్ రోహిదాస్ - తోలుపని
  15. చంభర్ - తోలుపని
  16. ఛండాల
  17. డక్కలి, డొక్కలవారు - మాదిగల వంశవృక్షాలు కథాగానం చేయటం, తోలుపని
  18. దండాసి - గ్రామకాపరి
  19. ధోర్ - తోలుపని
  20. దోమ్, దొంబర, పైడి, పానో - నేతపని, సంగీతం, డోలు, గూలకాపరి పని
  21. ఎల్లమ్మవారు, యెల్లమ్మవాండ్లు
  22. దూసి, హడ్డి, రెల్లి, చాచండి - పండ్లు పూలు అమ్మటం, పాకీపని
  23. గొడగాలి, గొడగుల - బుట్టలతయారీ
  24. గొడారి - తోలుపని
  25. గోసంగి -పశుసంరక్షణ,వ్యవసాయం,రాజులవద్ద యుద్ద సైనికులు,ప్రస్తుతం గ్రామ సుంకరి
  26. హొలయ - నేతపని
  27. హొలేయదాసరి - పౌరోహిత్యం
  28. జగ్గలి - తోలుపని
  29. జాంభవులు - తోలుపని
  30. కొలుపులవాండ్లు, పంబడ, పంబండ, పంబల - సోదె చెప్పటం, నాట్యం, మేళం, ఎల్లమ్మ, ముత్యాలమ్మలను మేల్కొల్పటం
  31. మదాసికురువ, మదారికురువ - గొర్రెలకాపరులు
  32. మాదిగ
  33. మాదిగదాసు, మాదిగమస్తు - వడ్రంగిపని
  34. మహర్ - నేతపని
  35. మాల - వెట్టివాడు (గ్రామమునందు దినబత్తెము లేక వెట్టిపని లేక వెట్టిచాకిరి చేయువాడు), గ్రామకాపరి, వ్యవసాయకూలి,
  36. మాలదాసరి
  37. మాలదాసు - పౌరోహిత్యం
  38. మాలహన్నాయి - దిమ్మర్రులు
  39. మాలజంగం - పౌరోహిత్యం
  40. మాలమస్తి - దొమ్మరి విద్య, వడ్రంగం
  41. మాలసాలె, నేతకాని - నేతపని
  42. మాలసన్యాసి - భిక్షాటన
  43. మాంగ్ - పాములు పట్టటం, డోలువాయించటం
  44. మాంగ్ గరోడి - గేదెలకుక్షౌరం చేయటం, చాపలు తయారీ
  45. మన్నె - వ్యవసాయకూలి
  46. మష్తి
  47. మాతంగి - పాటలుపాడుతూ బిక్షాటన
  48. మెహ్తార్ - పాకీపని
  49. మిత్తుల అయ్యవారు - మాలమాదిగల పురోహితులు
  50. ముండల - నేతపని
  51. పాకి, మోటి, తోటి
  52. (ఈ నంబరుగల కులం 2002 లో తొలగించబడింది)
  53. పామిడి - నేతపని
  54. పంచమ, పెరయ
  55. రెల్లి - పండ్లు పూలు అమ్మటం, పాకీపని
  56. సమగర - తోలుపని
  57. సంబాస్ - బొందలు తవ్వటం, రండోలువాయించటం
  58. సప్ర - పండ్లు పూలు అమ్మటం, పాకీపని
  59. సిందోళ్ళు, చిందోళ్ళు - నాటకాలు, నాట్యం
  60. యాతాట
  61. వల్లువన్

ఇవి కూడా చూడండి[మార్చు]