షెన్‌జెన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మూస:ఇతర ఉపయోగాలు

Shenzhen
深圳
Sub-provincial city
深圳市
Nickname(s): The City of Ambition (鹏城(鵬城); Pengcheng)
షెన్‌జెన్ is located in Guangdong
Shenzhen
Location in Guangdong
[[file:మూస:Location map China|250px|షెన్‌జెన్ is located in మూస:Location map China]]<div style="position: absolute; top: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; left: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; height: 0; width: 0; margin: 0; padding: 0;">
[[File:మూస:Location map China|6x6px|Shenzhen|link=|alt=]]
<div style="font-size: 90%; line-height: 110%; position: relative; top: -1.5em; width: 6em; సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను">Shenzhen
Location in China
Coordinates: 22°33′N 114°06′E / 22.550°N 114.100°E / 22.550; 114.100Coordinates: 22°33′N 114°06′E / 22.550°N 114.100°E / 22.550; 114.100
Country  China
Province Guangdong
County-level divisions 6
SEZ formed May 1, 1980
Area
 • Sub-provincial city 2,050
 • Urban 395.81
ఎత్తు  m ( ft)
జనాభా (2009)[1]
 • Sub-provincial city 89,12,300
 • జనసాంద్రత [
 • Urban 40,00,000
 • Urban density [[
టైమ్‌జోన్ China Standard Time (UTC+8)
Area code(s) 755
GDP 2009[1]
 - Total CNY 820.123 billion (USD 120.14 billion)
 - per capita CNY 92,771 (USD 13,590)
 - Growth Increase 10.7%
Licence plate prefixes 粤B
వెబ్‌సైటు http://english.sz.gov.cn/

మూస:Chinese

షెన్‌జెన్ (Shenzhen) (IPA: [ʂə́ntʂə̂n]) అనేది దక్షిణ చైనాలోని గుయంగ్‌డోంగ్ ప్రావీన్స్‌లో ఉప-ప్రావీన్స్ పరిపాలక హోదా ఉన్న ఒక నగరం, ఇది హాంకాంగ్‌తో ఉత్తర సరిహద్దు పంచుకుంటుంది. సంస్కరణవాద నేత డెంగ్ జియావోపింగ్ యొక్క విధానాల పరిధిలో చైనా ఆర్థిక సరళీకరణ ఫలితంగా ఏర్పడిన మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఈ ప్రాంతం కూడా భాగంగా ఉంది. నిస్సందేహంగా చైనాలో అత్యంత విజయవంతమైన మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక మండళ్లలో ఇది కూడా ఒకటి.

1970వ దశకం నుంచి వేగవంతమైన విదేశీ పెట్టుబడుల ద్వారా సాధ్యపడిన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ఫలితంగా షెన్‌జెన్ యొక్క నూతన మరియు ఆధునిక నగర దృశ్యం ఏర్పడింది, ఈ దశకం వరకు షెన్‌జెన్ ఒక చిన్న మత్స్యకారుల గ్రామంగా ఉండేది. ఆ తరువాత నుంచి, విదేశీయులు కర్మాగారాలు నిర్మించేందుకు మరియు ఉమ్మడి వ్యాపారాలు ప్రారంభించేందుకు US$ 30 బిలియన్‌లకుపైగా ఇక్కడ పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో షెన్‌జెన్ ఒకటి.[2] దక్షిణ చైనా యొక్క ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్న ఈ నగరంలో షెన్‌జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌తోపాటు, అనేక హైటెక్ (అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన) కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. చైనాలో అత్యంత రద్దీగల సరుకు రవాణా నౌకాశ్రయాల్లో షెన్‌జెన్ మూడో స్థానంలో ఉంది, దీనికి ముందు స్థానాల్లో షాంఘై మరియు హాంకాంగ్ నగరాలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

చైనాను మింగ్ రాజవంశం పాలించిన కాలంలో, 1410వ సంవత్సరం తరువాత నుంచి లభ్యమైన గ్రంథాల్లో షెన్‌జెన్ పేరు ప్రస్తావించబడివుంది. స్థానిక ప్రజలు వరి పొలాల్లోని కాలువలను "జెన్" (圳) అని పిలిచేవారు. షెన్‌జెన్ (深圳) యొక్క సామాన్యార్థం ఏమిటంటే "లోతైన కాలువలు", ఒకప్పుడు వరి పొలాల్లో లోతైన కాలువలతోపాటు, ఈ ప్రాంతంలో ఎక్కువగా నదులు మరియు వాగులు ఉండేవి. ఖింగ్ రాజవంశం పాలన ప్రారంభమైన కాలంలో ఇది ఒక పట్టణంగా మారింది, తరువాత దీని పేరును జిన్యాన్ మరియు బావోయాన్‌గా మార్చారు.[3]

చైనీయుల సర్వోన్నత నేత, దివంగత డెంగ్ జియావోపింగ్ ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న షెన్‌జెన్‌లో చైనాలో మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్-సెజ్)ని ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేశారు. 1979లో ఈ సెజ్ అధికారికంగా ప్రారంభించబడింది, సంపన్నమైన బ్రిటీష్ భూభాగం ఉన్న హాంకాంగ్‌కు సమీపంలో ఉన్న కారణంగా దానిని ఇక్కడ ఏర్పాటు చేశారు. "చైనీయుల లక్షణాలతో కూడిన సామ్యవాద" సిద్ధాంతాలు మార్గనిర్దేశం చేసే ఒక సమాజంలో విఫణి పెట్టుబడిదారీ విధానం ఆచరణ కోసం ఈ సెజ్ ఒక ప్రయోగాత్మక ప్రాతిపదికను సృష్టించింది.[4]

ఒకదానికొకటి సమీపంలో ఉండటం మరియు రెండు ప్రాంతాలు ఒకే సంస్కృతిని పంచుకోవడం వలన హాంకాంగ్ నుంచి షెన్‌జెన్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించింది.[citation needed] ఈ ప్రణాళిక విజయవంతంగా నిరూపించబడటంతో, చైనాలో మరిన్ని సరళీకరణ విధానాలు మరియు నిరంతర ఆర్థిక సంస్కరణలకు ప్రోత్సాహం లభించింది. షెన్‌జెన్ చివరకు పెరల్ నది మైదాన ప్రాంతంలోని అతిపెద్ద నగరాల్లో కూడా ఒకటిగా మారడంతోపాటు, చైనాలో ఒక ఆర్థిక అధికార కేంద్రంగా, ప్రపంచంలో ఒక అతిపెద్ద ఉత్పాదక కేంద్రంగా అవతరించింది.

గతంలో బావోయాన్ కౌంటీ (宝安县)గా గుర్తించబడిన షెన్‌జెన్‌కు ప్రెఫెక్చర్ హోదా ఇచ్చారు, తద్వారా నవంబరు 1979 నుంచి ఈ ప్రాంతం గుయంగ్‌డోంగ్ ప్రావీన్స్ ప్రత్యక్ష పాలనలోకి వెళ్లింది. మే 1980లో, షెన్‌జెన్‌ను అధికారికంగా ఒక ప్రత్యేక ఆర్థిక మండలిగా గుర్తించారు, చైనాలో ఇటువంటి గుర్తింపు పొందిన మొదటి ప్రాంతంగా షెన్‌జెన్ నిలిచింది. నవంబరు 1988లో దీనికి ప్రావీన్స్-స్థాయి ఆర్థిక పరిపాలన హక్కు ఇచ్చారు.

చైనాలోని ఐదు ప్రత్యేక ఆర్థిక మండలాల్లో షెన్‌‍జెన్ మొట్టమొదటి ప్రాంతంగా ఉంది. డెంగ్ జియావోపింగ్ చైనాలో ఆర్థిక పునరుజ్జీవనాన్ని ప్రారంభించిన వ్యక్తిగా పరిగణించబడుతున్నారు, తరచుగా షెన్‌జెన్ నగరంలో అభివృద్ధితో ఆయనను కీర్తించడం జరుగుతుంది, డెంగ్ యొక్క విధానాల ఫలితంగా ఈ నగరం గణనీయమైన స్థాయిలో లబ్ది పొందింది.

1996లో ఐదు నెలలపాటు, హాంకాంగ్ యొక్క ప్రావీన్స్ శాసన మండలి మరియు ప్రావీన్స్ కార్యవర్గ మండలి కార్యకలాపాలను షెన్‌జెన్‌లో నిర్వహించారు.

భౌగోళిక స్థితి[మార్చు]

షెన్‌జెన్‌లోని బూమ్‌టౌన్ పెరల్ నది మైదానంలో ఉంది, ఈ ప్రాంతంతో దక్షిణాన హాంకాంగ్‌తో, ఉత్తరాన మరియు వాయువ్యాన డోంగ్‌గ్వాన్ మరియు ఉత్తారన మరియు ఈశాన్యాన హుయ్‌ఝౌ సరిహద్దులు పంచుకుంటున్నాయి. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలతో కలిపి పురపాలక ప్రాంతం యొక్కం మొత్తం వైశాల్యం 2,050 కిమీ² (790 చదరపు మైళ్లు) ఉంది, 2007 చివరినాటికి ఈ ప్రాంతంలో మొత్తం జనాభా సంఖ్య 8,615,500 వద్ద ఉంది. వీరిలో 2,123,800 మందికి చట్టబద్ధమైన శాశ్వత నివాసాలు ఉన్నాయి.

షెన్‌జెన్ మొదట ఒక కొండ ప్రాంతంగా సారవంతమైన వ్యవసాయ భూమిని కలిగివుంది. అయితే 1979లో ఒక ప్రత్యేక ఆర్థిక మండలిగా మారిన తరువాత షెన్‌జెన్ భూదృశ్యంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. ఒకప్పుడు కొండలతో నిండిన మత్స్యకార గ్రామంలో ఇప్పుడు దాదాపుగా సమతలమైన ప్రధానపట్టణ ప్రాంతం (డౌన్‌టౌన్) వెలసింది, ఇక్కడ ఉన్న లియాన్‌హువా షాన్ (లోటస్ కొండ) మరియు బిజియా షాన్ (బిజియా పర్వతం) మరియు వుటోంగ్ షాన్ మాత్రమే ఉపగ్రహాలు గుర్తించే కొన్ని ఎత్తైన ప్రదేశాలుగా ఉన్నాయి. చైనా అంతర్గత భూభాగం నుంచి వలసదారులు రావడంతో, షెన్‌జెన్ రెండో దశ అభివృద్ధిని చవిచూస్తుంది, ఇప్పుడు ఇది సమీప ప్రాంతాలకు విస్తరిస్తుంది, మిషన్ హిల్స్ వంటి పరిసర ప్రాంతాల్లోని కొండ ప్రాంతాలను చదును చేసి మరింత అభివృద్ధి కోసం భూమిని సమకూరుస్తున్నారు.

షామ్ చున్ నది మరియు షా టౌ కోక్ నది వ్యాప్తంగా హాంకాంగ్ SARతో సరిహద్దుపై షెన్‌జెన్ ఉంది, ఈ నగరం ప్రావీన్స్ రాజధాని గుయంగ్‌ఝౌకు ఆగ్నేయంగా 100 కిమీ మరియు పారిశ్రామిక నగరం డోంగ్‌గ్వాన్‌కు దక్షిణంగా 60 కిమీ దూరంలో ఉంది. నైరుతీ దిక్కున 60 కిమీ దూరంలో రిసార్ట్ నగరం జుహై ఉంది.

శీతోష్ణస్థితి[మార్చు]

చైనాలోని ఉపఉష్ణమండల ప్రాంతంలో దాదాపుగా కర్కాటక రేఖపై షెన్‌జెన్ నగరం ఉంది, అయినప్పటికీ సైబీరియా తుఫాను నిరోధక పవనాలు కారణంగా, ఇక్కడ ఒక వెచ్చని, రుతుపవన-ప్రభావిత, ఆర్ద్ర ఉపఉష్ణమండల వాతావరణం (కోపెన్ Cwa ) ఉంటుంది. శీతాకాలాలు మందంగా మరియు పొడిగా ఉంటాయి, దక్షిణ చైనా సముద్రం యొక్క ప్రభావం కారణంగా ఇక్కడ ఇటువంటి శీతోష్ణస్థితి ఉంటుంది, మంచు చాలా అరుదుగా కురుస్తుంది. వసంత కాలం కొద్దిగా పొడిగా ప్రారంభమవుతుంది, అయితే వర్షపాతం ఏప్రిల్‌లో నాటకీయంగా పెరుగుతుంది, వర్షాకాలం అక్టోబరు మధ్య కాలం వరకు కొనసాగుతుంది. వేసవి నెలల్లో రుతుపవనాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి, ఈ సమయంలో షెన్‌జెన్‌లో ఆర్ద్రతతో కూడిన మరియు వేడి పరిస్థితులు ఉంటాయి, అయితే వీటి తీవ్రత తక్కువగానే ఉంటుంది. తరువాతి భాగంలో పూర్తిగా పొడి కాలం ఉంటుంది. ఇక్కడ వార్షిక అవపాతనం సగటున 1900 mm 0 పైగా ఉంటుంది, వేసవిలో మరియు వర్షకాలం ప్రారంభంలో తూర్పు నుంచి వచ్చే తుఫానుల వలన దీనిలో కొంత వర్షపాతం కురుస్తుంది.

Climate data for Shenzhen (1951-2007)
Month Jan Feb Mar Apr మే Jun Jul Aug Sep Oct Nov Dec Year
Average high °C (°F) 19.6 19.8 22.6 26.2 29.5 31.0 32.2 31.9 31.0 28.9 25.2 21.5
Average low °C (°F) 11.4 12.7 15.9 19.8 23.2 25.1 25.7 25.4 24.3 21.3 17.1 13.0
Rainfall mm (inches) 27.4 46.7 62.7 145.1 240.8 327.8 319.6 360.4 257.1 80.3 34.4 26.1
Source: 中国气象台

పరిపాలనా విభాగాలు[మార్చు]

షెన్‌జెన్ ఒక ఉప-ప్రావీన్స్ నగరం. దీనికి ఎనిమిది జిల్లాలపై ప్రత్యేక అధికారిక పరిధి ఉంది (区 ఖు ):

పటం # పేరు హాంజీ హాన్యు పిన్యిన్ జనాభా
(2005 అంచనా)
వైశాల్యం (కిమీ²) జనసాంద్రత
(/కిమీ²)
Shenzhen mcp.png
సెంట్రల్ షెన్‌జెన్ (SEZ) 3,143,000 412 7,628
1 ఫుతియాన్ జిల్లా 福田区 Fútián Qū 1,166,000 79 14,759
2 లువోహు జిల్లా 罗湖区 Luóhú Qū 860,000 79 10,886
3 నాన్షాన్ జిల్లా 南山区 Nánshān Qū 901,000 182 4,951
6 యాంతియాన్ జిల్లా 盐田区 Yántián Qū 216,000 72 3,000
శివారు ప్రాంతాలు 5,140,000 1,577 3,259
4 బావోయాన్ జిల్లా 宝安区 Bǎo'ān Qū 2,500,000 577 4,333
5 లాంగ్‌గాంగ్ జిల్లా 龙岗区 Lónggǎng Qū 1,240,000 676 1,834
7 గుయంగ్‌మింగ్ న్యూ ఏరియా 光明新区 Guāngmíng Xīn Qū 800,000 156 5,128
8 పింగ్‌షాన్ న్యూ ఏరియా 坪山新区 Píngshān Xīn Qū 600,000 168 3,571
మొత్తం 8,283,000 1,989 4,164

ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) లువోహు, ఫుతియాన్, నాన్షాన్ మరియు యాంతియాన్ ప్రాంతాల్లో మాత్రమే ఉంది, అయితే బావోయాన్, గుయంగ్‌మింగ్ మరియు లాంగ్‌గాంగ్ దీనికి వెలుపల ఉన్నాయి. జులై 1, 2010న, సెజ్ ప్రాంతాన్ని అన్ని జిల్లాలను కలుపుతూ విస్తరించారు, దీని వలన సెజ్ భూభాగ విస్తీర్ణం ప్రస్తుత విస్తీర్ణం కంటే దాదాపుగా ఐదు రెట్లు పెరిగింది.

సెజ్ మధ్య భాగంలో మరియు హాంకాంగ్‌కు పక్కనే ఉన్న లువోహు ఆర్థిక మరియు వ్యాపార కేంద్రంగా ఉంది. ఈ ప్రాంత విస్తీర్ణం 78.89 కిమీ² ఉంటుంది. మున్సిపల్ ప్రభుత్వం ఉన్న ఫుతియాన్ ప్రాంతం కూడా సెజ్ మధ్యలో ఉంది, దీని విస్తీర్ణం 78.04 కిమీ² ఉంది. 164.29 కిమీ² విస్తీర్ణంలో ఉన్న నాన్షాన్ ప్రాంతం హైటెక్ పరిశ్రమల కేంద్రంగా ఉంది, ఇది సెజ్‌కు పశ్చిమంగా ఉంది. సెజ్‌కు వెలుపల ఉన్న బావోయాన్ (712.92 కిమీ²) మరియు లాంగ్‌గాంగ్ (844.07 కిమీ²) ప్రాంతాలు షెన్‌జెన్‌కు వరుసగా వాయువ్యంగా మరియు ఈశాన్యంగా ఉన్నాయి. యాంతియాన్ (75.68 కిమీ²) సరుకు రవాణాకు ప్రసిద్ధి చెందింది. యాంతియాన్ నౌకాశ్రయం చైనాలో రెండో అతిపెద్ద డీప్‌వాటర్ కంటైనర్ టెర్మినల్ (భారీ నౌకల రాకపోకలకు వీలున్న నౌకాశ్రయం)గా మరియు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద నౌకాశ్రయంగా గుర్తించబడుతుంది.

జనాభా[మార్చు]

షెన్‌జెన్ నగరంలో సెజ్ ఏర్పాటు చేసిన తరువాత నుంచి జనాభా మరియు కార్యకలాపాలు వేగంగా అభివృద్ధి చెందాయి. దీని యొక్క అధికారిక జనాభా సుమారుగా పద్నాలుగు మిలియన్లు ఉంది (వచ్చివెళ్లే నివాసులతోపాటు, 2008), గత 30 ఏళ్లుగా షెన్‌జెన్ చైనాలో అత్యంత వేగంగా పెరుగుతున్న నగరంగా ఉంది.[citation needed] ఇదిలా ఉంటే, అనేక మంది ప్రజలు నగరంలో ఇంకా చాలా ఎక్కువ జనాభా ఉన్నట్లు భావిస్తారు, ఎక్కువగా డోంగ్‌గ్వాన్ నుంచి ప్రయాణికులు ఇక్కడకు వస్తుంటారు. అదుపులేని జనాభా వృద్ధి కారణంగా నగరంలో హుకౌ లేదా నివాస అనుమతులు (70% మంది పౌరులు ఇక్కడ శాశ్వత హుకౌ లేకుండా నివసిస్తున్నారు) లేని పౌరులు సమస్యాత్మకంగా మారారు; ఎక్కువ మంది 'పాత' షెన్‌జెన్ స్థానికులు చైనా అంతర్గత భూభాగానికి చెందిన పౌరులను అనుమతించడం ద్వారా మిగిలిన చైనా నగరాలతో ఇది పోటీతత్వాన్ని కోల్పోతుందని భావిస్తున్నారు.

దక్షిణ సోంగ్ రాజవంశం (1127–1279) పాలనా కాలం నుంచి ఇప్పుడు షెన్‌జెన్‌గా పరిగణిస్తున్న ప్రాంతమైన దక్షిణ గుయంగ్‌డోంగ్ ప్రాంతంలోకి వలసలు జరిగాయి, అయితే 1980వ దశకంలో షెన్‌జెన్ ఏర్పాటు చేసిన తరువాత ఈ వలసలు నాటకీయంగా పెరిగాయి. గుయంగ్‌డోంగ్‌లో మాండరిన్ ఎక్కువగా మాట్లాడే ఏకైక నగరంగా షెన్‌జెన్ గుర్తించబడుతుంది, చైనాలోని అన్ని ప్రాంతాలకు చెందిన వలసదారుల వలన ఇక్కడ ఈ భాషను ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. ప్రస్తుతం, షెన్‌జెన్ నగరంలో పౌరుల సగటు వయస్సు 30 కంటే తక్కువగా ఉంది. మొత్తం జనాభాలో, 8.49 శాతం మంది 0 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గలవారు ఉన్నారు, 88.41 శాతం మంది 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గలవారు కాగా, వీరిలో ఐదింట ఒక వంతు మంది 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు వారు ఉన్నారు. 1.22 శాతం మంది 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగివున్నారు.

జనాభా నిర్మాణం రెండు వ్యతిరేక ధ్రువాలుగా ఉంటుంది: ఒకవైపు ఉన్నత స్థాయి విద్య గల మేధావులు ఉండగా, తక్కువ విద్య గల వలస కార్మికులు మరోవైపు ఉన్నారు.[5] జూన్ 2007లో, చైనాలో PhD పొందిన విద్యాధికుల్లో సుమారుగా 20 శాతం మంది షెన్‌జెన్‌లో పని చేస్తున్నారు.[6]

హాంకాంగ్ జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంచనాల ప్రకారం, 2002లో, 7,200 మంది హాంకాంగ్ పౌరులు రోజూ పని కోసం షెన్‌జెన్ వెళ్లి వస్తున్నారు, షెన్‌జెన్ నుంచి 2,200 మంది విద్యార్థులు రోజూ హాంకాంగ్‌కు చదువుకునేందుకు ప్రయాణిస్తున్నారు. ఈ రెండు నగరాలు పక్కపక్కన ఉన్నప్పటికీ, రోజువారీ ప్రయాణికులు కస్టమ్స్ మరియు ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్‌ల గుండా వెళ్లాల్సి ఉంటుంది, సెజ్ మరియు హాంకాంగ్ ప్రత్యేక పరిపాలక ప్రాంతం (స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ - SAR) మధ్య ప్రయాణాలకు హద్దులు నిర్ణయించబడ్డాయి.

జులై 2003లో, చైనా ప్రయాణ నిబంధనలను సరళీకరించింది, దీంతో గుయంగ్‌ఝౌ యొక్క దక్షిణ ప్రాంత నగరాలు మరియు షెన్‌జెన్‌తోపాటు, బీజింగ్ మరియు షాంఘై పౌరులు హాంకాంగ్‌కు ప్రయాణించేందుకు మార్గం సుగమమైంది. గతంలో, ప్రధాన భూభాగానికి (మెయిన్‌ల్యాండ్) చెందిన ప్రయాణికులు ఈ నగరాన్ని పర్యాటకులు మాత్రమే సందర్శించేందుకు వీలుంది. (వ్యక్తిగత సందర్శన పథకం చూడండి.)

చైనా అంతర్గత భూభాగం నుంచి షెన్‌జెన్‌కు వలసలు గతంలో హుకౌ వ్యవస్థ ద్వారా నియంత్రించబడ్డాయి. దీని ఫలితంగా షెన్‌జెన్ వెలుపల ఉన్న పెద్ద పట్టణాల్లో గతంలో నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వలసదారులు స్థిరపడ్డారు.

ఆర్థికవ్యవస్థ[మార్చు]

షెన్‌జెన్ CBD.

2001లో, పనిచేసే జనాభా నగరంలో 3.3 మిలియన్లకు చేరుకుంది. ద్వితీయ పరిశ్రమ రంగం అతిపెద్ద వాటా కలిగివున్నప్పటికీ (5.5% మేర వృద్ధితో 2001లో 1.85 మిలియన్ల వద్ద ఉంది), తృతీయ పరిశ్రమ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది (11.6% వృద్ధితో 2001లో 1.44 మిలియన్ల వద్ద ఉంది). షెన్‌జెన్ యొక్క GDP (స్థూల ప్రాంతీయోత్పత్తి) 2009లో మొత్తం CNY 820.1 బిలియన్ల వద్ద ఉండగా, తలసరి GDP 2009నాటికి US$13,581 వద్ద ఉంది, స్థూల ప్రాంతీయోత్పత్తి ముందు ఏడాదితో పోలిస్తే 10.7 శాతం మేర వృద్ధి చెందింది. 2001 నుంచి 2005 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ సగటున 16.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం GDPలో మూడు పరిశ్రమల నిష్పత్తి 2009లో 0.1:46.7:53.2 వద్ద ఉంది. GDPకి ప్రధాన పరిశ్రమ నిష్పత్తి 13.4% మేర క్షీణించగా, తృతీయ పరిశ్రమ నిష్పత్తి 12.5% మేర వృద్ధి చెందింది.[7] సమగ్ర ఆర్థిక శక్తిపరంగా ప్రధాన భూభాగంలోని చైనా నగరాల్లో షెన్‌జెన్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రధాన భూభాగపు చైనా నగరాల్లో GDP విషయంలో ఈ నగరం 2001లో నాలుగో స్థానంలో ఉండగా, ఇదే సమయంలో తలసరి GDP జాబితాలో అగ్రస్థానంలో ఉంది. నగర ఎగుమతులు మరియు దిగుమతుల పరిమాణం వరుసగా చివరి తొమ్మది సంవత్సరాల్లో అగ్రస్థానంలో ఉంది. పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ నగరం రెండో స్థానంలో ఉంది. ఐదు వరుస సంవత్సరాలపాటు, స్థానిక బడ్జెట్‌లో దీని యొక్క అంతర్గత ఆదాయం మూడో స్థానంలో ఉంది. విదేశీ మూలధనాన్ని ఉపయోగించడంలో కూడా ఈ నగరం మూడో స్థానంలో నిలిచింది.[8]

షెన్‌జెన్ చైనాలో ఒక ప్రధాన ఉత్పాదక కేంద్రంగా ఉంది. 1990వ దశకంలో, షెన్‌జెన్ రోజుకో ఆకాశహర్మం మరియు ప్రతి మూడు రోజులకు ఒక విశాల మార్గం నిర్మించబడుతున్న నగరంగా వర్ణించబడింది. షెన్‌జెన్ ఆకాశహర్మాల్లో 200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న భవనాలు 13 ఉన్నాయి, వీటిలో షున్‌ హింగ్ స్క్వేర్ (ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాల్లో ఇది తొమ్మిదో స్థానంలో ఉంది) కూడా భాగంగా ఉంది.[9]

చైనా యొక్క అత్యంత విజయవంతమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన కంపెనీలుగా పరిగణించబడుతున్న బివైడి, జి'ఫైవ్, హాసీ, హ్యూవీ, జేఎక్స్‌డి, కోంకా, నెటాక్, స్కైవర్త్, టెన్సెంట్ మరియు జెడ్‌టిఈ సంస్థలకు షెన్‌జెన్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. బివైడి, హాసీ మరియు హ్యూవీ కంపెనీల ప్రధాన కార్యాలయాలు లాంగ్‌గాంగ్ జిల్లాలో ఉన్నాయి.[10] చైనాలో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ (ఇంటర్నెట్ శోధన యంత్రం) బైడు షెన్‌జెన్ నగరంలో అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. అనేక విదేశీ ఐటీ కంపెనీలకు కూడా నగరంలో కార్యాలయాలు ఉన్నాయి. తైవాన్ యొక్క అతిపెద్ద కంపెనీ హాన్ హాయ్ గ్రూపుకు షెన్‌జెన్‌లో ఒక ఉత్పాదక కేంద్రం ఉంది, ఇది ఎక్కువగా యాపిల్, ఇంక్ కోసం ఐపోడ్‌లు (iPod), ఐఫోన్‌లు (iPhone), ఐపాడ్‌లు (iPad), ఐమ్యాక్‌లు (iMac) మరియు నోట్‌బుక్‌లు తయారు చేస్తుంది. 2005లో IBM నుంచి వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ విభాగాన్ని కొనుగోలు చేసిన చైనా బహుళజాతి కంపెనీ లెనోవో షెన్‌జెన్ నగరంలో తమ వ్యాపార శ్రేణికి చెందిన థింక్‌ప్యాడ్ (ThinkPad) నోట్‌బుక్‌లను తయారు చేస్తుంది. IBM సర్వర్ ఉత్పత్తులను తయారు చేసేందుకు షెన్‌జెన్‌లో ఒక ఉమ్మడి వ్యాపార కేంద్రాన్ని కలిగివుంది. అనేక ఈ విదేశీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన కంపెనీలకు నాన్షాన్ జిల్లాలోని సైన్స్ అండ్ టెక్నాలజీ పార్కులో లేదా కార్మికులు మరియు భూమి తక్కువ వ్యయంతో దొరికే దీని వెలుపల ఉన్న ప్రధాన జిల్లాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆర్థిక రంగంలో, చైనాలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన చైనా మర్చంట్స్ బ్యాంకుకు షెన్‌జెన్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. షెన్‌జెన్ సిటీ కమర్షియల్ బ్యాంక్, పింగ్ యాన్ ఇన్స్యూరెన్స్, ఐకెయా మరియు వాల్-మార్ట్ కంపెనీలు కూడా నగర కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

2009లో, GDP రికార్డు స్థాయిలో 820.1 బిలియన్ యువాన్‌లకు చేరుకుంది, 2008తో పోలిస్తే GDP 10.7% మేర పెరిగింది. షెన్‌జెన్ యొక్క ఆర్థిక ఉత్పాదకత 659 చైనా నగరాల్లో నాలుగో స్థానంలో ఉంది (బీజింగ్, షాంఘై మరియు గుయంగ్‌ఝౌ నగరాల తరువాత స్థానంలో) మరియు ఇది చైనాలో ఒక మధ్యతరహా ప్రావీన్స్‌గా పరిగణించబడుతుంది. 2009లో, షెన్‌జెన్ యొక్క తలసరి GDP 92,771 యువాన్ (US$13,581) వద్ద ఉంది, తద్వారా ఇది చైనాలోని అన్ని నగరాల్లో సంపన్నమైనదిగా గుర్తింపు పొందింది.

పారిశ్రామిక మండలాలు[మార్చు]

  • షెన్‌జెన్ హై-టెక్ ఇండస్ట్రియల్ పార్క్ (SHIP)ను సెప్టెంబరు 1996లో స్థాపించారు. ఇది 11.5 కిమీ² విస్తీర్ణం కలిగివుంది. దీనిలో ప్రోత్సహించబడే పరిశ్రమల్లో బయోటెక్నాలజీ/ఫార్మాస్యూటికల్స్, భవన నిర్మాణ/నిర్మాణ రంగ పదార్థాలు, రసాయనాల ఉత్పత్తి మరియు సంవిధానం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ & మ్యానుఫ్యాక్చరింగ్, ఉపకరణ & పారిశ్రామిక పరికరాల ఉత్పత్తి, వైద్య పరికరాలు మరియు సరఫరాలు, పరిశోధన మరియు అభివృద్ధి, టెలీకమ్యూనికేషన్ పరికరాలు భాగంగా ఉన్నాయి.[11]
  • షెన్‌జెన్ సాఫ్ట్‌వేర్ పార్క్-షెన్‌జెన్ హై-టెక్ ఇండస్ట్రీ పార్ రెండూ విలీనం చేయబడ్డాయి, షెన్‌జెన్ పురపాలక ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు ఈ ప్రణాళికను అమలు చేసింది. 2001లో జాతీయ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తి ప్రణాళికకు ప్రాతిపదికగా ఉండేందుకు ఈ పార్కుకు ఆమోదం లభించింది. 010 జాతీయ రహదారి మరియు మండలానికి మధ్య దూరం 20.8 కిమీ ఉంటుంది. షెన్‌జెన్ బావోయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ మండలం 22 కిమీ దూరంలో ఉంది.[12]

షెన్‌జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్[మార్చు]

షెన్‌జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (SZSE ) ఒక సంయుక్త జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్, ఇది చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ (CSRC) పరిధిలో పనిచేస్తుంది, దీనిలో సెక్యూరిటీల ట్రేడింగ్ జరుగుతుంది. 540 నమోదిత కంపెనీలు, 35 మిలియన్ నమోదిత పెట్టుబడిదారులు మరియు 177 ఎక్స్ఛేంజ్ సభ్యులతో కూడిన విస్తృతమైన మార్కెట్ భాగస్వాములు ఇక్కడ విఫణిని సృష్టించారు. ఇక్కడ కొనుగోలు మరియు విక్రయ ఆర్డర్‌లు ఒక జంట, బహిరంగ మరియు క్రమబద్ధమైన విఫణికి అనుగుణంగా ఉండేలా రూపొందించబడతాయి, ధర-సమయ ప్రాధాన్యత ఆధారంగా ఉత్తమ సాధ్యనీయ ధరలను సృష్టించేందుకు ఒక స్వయంచాలక వ్యవస్థను ఉపయోగిస్తారు. వ్యాపార లావాదేవీల పరిమాణాలు స్పష్టంగా ఉంటాయి.

1990లో ఏర్పాటు చేసినప్పటి నుంచి, SZSE విఫణి పెట్టబడి సుమారుగా 1 ట్రిలియన్ యువాన్ (US$122 బిలియన్లు)కు పెరిగింది. రోజువారీ ప్రాతిపదికన, సుమారుగా 600,000 ఒప్పందాల, US$807 మిలియన్ల విలువైన, లావాదేవీలు SZSEలో జరుగుతాయ.

చైనా యొక్క సెక్యూరిటీల మార్కెట్ ప్రధాన మార్పులు సంతరించుకుంటుంది. కొత్త సెక్యూరిటీస్ చట్టం, కంపెనీ చట్టం అమలుతో స్వీయ-ఆవిష్కరణ వ్యూహంతోపాటు, ట్రేడ్ చేయలేని వాటా సంస్కరణ విఫణిలో అపార అవకాశాలు సృష్టించాయి. "నియంత్రణ, ఆవిష్కరణ, సేద్యం మరియు సేవ" సిద్ధాంతాన్ని పాటిస్తూ, SZSE చిన్న మరియు మధ్యతరహా సంస్థల బోర్డును అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది, అంతేకాకుండా కఠిన నిబంధనలు లేని విఫణిగా మారేందుకు ప్రయత్నిస్తుంది.[13]

షెన్‌జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (SZSE)లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కార్యకలాపం సెప్టెంబరు 2000 నుంచి నిలిపివేయబడింది, చైనా ప్రభుత్వం తన యొక్క బోర్స్‌లను షాంఘై ఎక్స్ఛేంజ్‌లో విలీనం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు, ప్రైవేట్ మరియు సాంకేతిక రంగ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని నాస్‌డాక్-వంటి ఒక ద్వితీయ బోర్డును షెన్‌జెన్‌లో ఏర్పాటు చేసింది.

నగర దృశ్యం[మార్చు]

షెన్‌జెన్‌‌లో ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న షున్ హింగ్ స్క్వేర్ (డివాంగ్ భవనం) ఉంది. నగరంలో 200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాలు 23 ఉన్నాయి, వీటిలో ఎక్కువ భవనాలు లువోహు మరియు ఫుతియాన్ జిల్లాల్లో ఉన్నాయి. షెన్‌జెన్‌లో రెండో అత్యంత ఎత్తైన భవనం SEG ప్లాజా, ఇది 356 మీటర్ల ఎత్తు ఉంది (చివరి అంతస్తు వరకు ఈ భవనం ఎత్తు 292 మీటర్లు), ఈ భవనం ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ జిల్లా హువా ఖియాంగ్ బీలో ఉంది.

షెన్‌జెన్‌లో చైనాలోని కొన్ని అతిపెద్ద ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అవి ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ (国贸), దీనిని 1985లో నిర్మించారు, నిర్మించినప్పుడు ఇది చైనాలో అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది, షున్ హింగ్ భవనం, నిర్మించినప్పుడు ఇది ఆసియాలోకెల్లా అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు ఉంది, (ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఉక్కు భవనంగా ఇది గుర్తించబడుతుంది).

షెన్‌జెన్‌లో అనేక ఎత్తైన భవన నిర్మాణ ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయి. ప్రతిపాదిత లేదా ఆమోదం పొందిన దశలో ఉన్న కొన్ని ఆకాశహర్మాలు 400 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న అత్యంత ఎత్తైన భవనం కింగ్‌కీ ఫైనాన్స్ టవర్, ఇది 436 మీటర్ల ఎత్తు ఉంటుంది, 2010లో దీని నిర్మాణం పూర్తి కానుంది. ఇతర ప్రతిపాదిత భవనాలు కింగ్‌కీ ఫైనాన్స్ టవర్ ఎత్తును 2015నాటికి అధిగమిస్తాయి.

ఉదాహరణకు, 646 మీటర్ల ఎత్తున్న పింగాన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్, 2014లో నిర్మాణం పూర్తయినప్పుడు ఇది చైనాలో అత్యంత ఎత్తైన భవనంగా గుర్తించబడటంతోపాటు, ప్రపంచంలో బుర్జ్ ఖలీఫా తరువాత రెండో అత్యంత ఎత్తైన భవనంగా ఉంటుంది.

చిత్రమాలిక[మార్చు]

దస్త్రం:File:View-Of-HQB-Shenzhen-Lychee-Park.jpg
View of Hua Qiang Bei road (Futian District) in Shenzhen, China


హాంకాంగ్‌తో ఏకీకరణ[మార్చు]

దస్త్రం:Shen Zhen as seen from HK border.JPG
హాంకాంగ్ సరిహద్దు నుంచి షెన్‌జెన్ యొక్క దృశ్యం

హాంకాంగ్ మరియు షెన్‌జెన్ నగరాలు దిగువ ఇవ్వబడిన గణాంక ప్రదర్శనలో మాదిరిగా వ్యాపారం, వాణిజ్యం మరియు సామాజికపరంగా బాగా దగ్గరి సంబంధాలు కలిగివున్నాయి. హాంకాంగ్ ప్రభుత్వం (HKG) వెబ్‌సైట్ విభాగాల నుంచి తీసుకున్న గణాంకాలు చూపించిన సందర్భాల్లో మినహా.[14]

డిసెంబరు 2007నాటికి, షెన్‌జెన్ మరియు హాంకాంక్ మధ్య ఆరు భూభాగం గుండా సరిహద్దులు దాటే కేంద్రాలు ఉన్నాయి. పశ్చిమం నుంచి తూర్పుకు ఈ సరిహద్దు కేంద్రాలు షెన్‌జెన్ బే పోర్ట్ రోడ్ క్రాసింగ్ (జులై 1, 2007న ప్రారంభమైంది);షెన్‌జెన్ మెట్రో మార్గం 4 నుంచి MTR యొక్క తూర్పు రైలు మార్గం లోక్ మా చౌ స్పుర్ లైన్‌కు ఫు టియాన్ కౌ యాన్ నుంచి లోక్ మా చౌ రైలు అనుసంధానం (ఆగస్టు 15, 2007న ప్రారంభమైంది); హుయంగ్‌గాంగ్ నుంచి లోక్ మా చౌ రోడ్డు అనుసంధానం; ఫుతియాన్ నుంచి మాన్ కామ్ తో రోడ్డు అనుసంధానం; MTR తూర్పు రైలు మార్గం నుంచి షెన్‌జెన్ మెట్రో లైన్ 1, షెన్‌జెన్ రైల్ స్టేషన్ మరియు సాధారణంగా లువోహుకు లువోహు నుంచి లో వు రైల్ అనుసంధానం; మరియు షాటోయుజియావో నుంచి షా టౌ కోక్ రోడ్డు అనుసంధానం.[15] రైలు అనుసంధానాలు రెండింటికీ ప్రయాణికులు షెన్‌జెన్ నదిని కాలి నడకతో దాటి వెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే రెండు నగరాలను పూర్తిగా కలుపుతూ నిర్మించిన రైలు మార్గం లేదు, ఇదిలా ఉంటే చైనాలోని ఇతర నగరాలకు వెళ్లే హాంకాంగ్ నగరాంతర రైళ్లు షెన్‌జెన్ గుండా ఎటువంటి నిలుపుదల లేకుండా వెళతాయి.

2006లో, ప్రతి దిశలోనూ ప్రతి రోజూ 20,500 వాహనాలు సరిహద్దుపై ప్రయాణించాయి. వీటిలో 65 శాతం వాహనాలు సరుకు రవాణా వాహనాలు కావడం గమనార్హం, 27 శాతం కార్లు మరియు మిగిలినవి బస్సులు మరియు కోచ్‌లు ఉన్నాయి. హుయంగ్‌గాంగ్ సరిహద్దు మార్గాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు, మొత్తంమీద 76 శాతం రాకపోకలు ఈ మార్గం గుండా జరుగుతాయి, దీని తరువాత ఫుతియాన్ సరిహద్దు మార్గం రద్దీగా ఉంటుంది, దీనిని 18 శాతం వాహనాలు మరియు షాటౌజియావో సరిహద్దు మార్గాన్ని 6 శాతం వాహనాలు ఉపయోగిస్తాయి.[16] సరుకు రవాణా వాహనాల్లో ప్రతి రోజూ 12,000 వాహనాలు కంటైనర్లుగా ఉన్నాయి, 1.44 టెయుస్/వాహనం రేటును ఉపయోగిస్తాయి, అంటే సరిహద్దుపై 17,000 టెయుస్/రోజు రేటుతో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి,[17] హాంకాంగ్ నౌకాశ్రయం 2006లో 23,000 టెయుస్/రోజు రేటుతో కార్యకలాపాలు సాగించింది, దీనిలో ట్రాన్స్‌షిప్‌మెంట్ వాణిజ్యాన్ని చేర్చలేదు.[18]

హాంకాంగ్‍తో వాణిజ్యంలో 2006లో US$333 బిలియన్ల విలువైన దిగుమతులు ఉన్నాయి, వీటిలో US$298 బిలియన్ల విలువైన దిగుమతులను తిరిగి ఎగుమతి చేశారు. వీటిలో 94 శాతం సరుకు రవాణా కార్యకలాపాలు చైనాకు సంబంధించినవి కావడం గమనార్హం.[19] హాంకాంగ్ వాణిజ్యంలో 34.5 శాతం విలువ గల వాయుమార్గంలో సరుకు రవాణా (బరువు ప్రకారం కేవలం 1.3 శాతం మాత్రమే)ను పరిగణలోకి తీసుకుంటే, దీనిలో ఎక్కువ భాగం చైనాకు సంబంధించినదే.[20]

2006లో సగటు రోజువారీ ప్రయాణికుల సంఖ్య నాలుగు సరిహద్దు మార్గాలు గుండా ప్రతి దిశలోనూ 200,000 వద్ద ఉంది, వీరిలో 63 శాతం మంది లువోహు రైలు మార్గాన్ని మరియు 33 శాతం మంది హుయంగ్‌గాంగ్ రోడ్డు మార్గాన్ని ఉపయోగించారు.[15] సహజంగా, ఇటువంటి అధిక స్థాయి ప్రయాణికుల రాకపోకలకు ప్రత్యేక నిర్వహణ అవసరమవుతుంది, భారీ సంఖ్యలో ప్రజలు సరిహద్దును దాటుతుంటారు, చైనా పౌరసత్వం ఉన్న హాంకాంగ్ పౌరులు బయోమెట్రిక్ ID కార్డు (సొంత ప్రాంతానికి తిరిగివచ్చే అనుమతి) మరియు ఒక వేలిముద్ర రీడర్‌ను ఉపయోగిస్తారు. పోలిక విషయంలో, ప్రపంచంలో అత్యంత రద్దీ గల ఐదో విమానాశ్రయంగా గుర్తించబడుతున్న హాంకాంగ్ యొక్క చెక్ లాప్ కోక్ విమానాశ్రయాన్ని ఉపయోగించి రెండువైపులా ప్రతి రోజూ 59,000 మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతున్నారు.[20]

సరిహద్దు గుండా ప్రయాణికుల రాకపోకలపై హాంకాంగ్ ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరుపుతుంది, 2003లో ఇటీవలి అధ్యయనం జరిగింది, 2007లో కూడా ఒక అధ్యయనం జరగాల్సి ఉంది. 2003లో హాంకాంగ్‌లో నివసించే స్థానిక పౌరుల సరిహద్దు ప్రయాణాలు 78 శాతానికి చేరుకున్నాయి, 1999లో వీరి ప్రయాణాలు 33 శాతం వద్ద ఉన్నాయి, ఇదిలా ఉంటే హాంకాంగ్ మరియు చైనాలో నివసించే చైనీయులు 2006లో ఈ సరిహద్దులపై 20 శాతం ప్రయాణాలు జరిపారు, 1999 కంటే వీరి ప్రయాణాల సంఖ్య 140 శాతం పెరిగింది. ఆ సమయం నుంచి చైనా పౌరులకు ప్రయాణాలు సులభతరమయ్యాయి, అందువలన సరిహద్దులపై ప్రయాణాలు మరింత పెరిగే అవకాశం ఏర్పడింది. ఇతర జాతీయులు 2 శాతానికిపైగా సరిహద్దు ప్రయాణాలు జరిపారు. వీటిలో 67 శాతం ప్రయాణాలు షెన్‌జెన్‌తో సంబంధం కలిగివున్నాయి, 42 శాతం వ్యాపార లేదా పని ప్రయోజనాల కోసం జరిగాయి. వ్యాపారేతర ప్రయాణాల్లో మూడింట ఒక వంతు స్నేహితులు మరియు బంధువులు మరియు కాలక్షేపం కోసం జరిగాయి.[21]

వ్యాపార మరియు కుటుంబ ప్రయాణాలు కాకుండా, అనేక మంది సందర్శకులు హాంకాంగ్ నుంచి షెన్‌జెన్‌కు షాపింగ్ కోసం ప్రయాణిస్తారు, ఇక్కడ వస్తువులు మరియు సేవలు హాంకాంగ్ కంటే చౌకగా దొరుకుతాయి. అయితే, ప్రత్యేక వస్తువుల ధరల గురించి సరైన అవగాహన లేకపోయినట్లయితే, అటువంటి వస్తువులు హాంకాంగ్‌‍లో కంటే బాగా ఎక్కువ ధరతో కొనుగోలు చేయాల్సి వస్తుంది, ఇవి కాకుండా మిగిలిన వస్తువులను షెన్‌జెన్‌‍లో చౌక ధరకు, బేరమాడిన తరువాతైనా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

భవిష్యత్ ఏకీకరణ ప్రణాళికలు[మార్చు]

అక్టోబరు 10, 2007న వెల్లడించబడిన విధానం ప్రకటన అధికరణ 114(1)లో,[22] హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డొనాల్డ్ త్సాంగ్ ఈ కింది విషయాన్ని వెల్లడించారు:

షెన్‌జెన్‌తో ఒక ప్రపంచ-శ్రేణి మెట్రోపోలిస్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడం: ఎన్నికల వాగ్ధానం ప్రకారం, నేను హాంకాంగ్-షెన్‌జెన్ మెట్రోపోలిస్ అభివృద్ధి ప్రణాళికను మరియు మన సహకారాన్ని పటిష్టపరిచేందుకు ఉద్దేశించిన చర్యలను ముందుకు తీసుకెళతాను. నా ప్రతిపాదనలకు షెన్‌జెన్ అధికారిక యంత్రాంగాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయి. మేము ఒక ఉమ్మడి లక్ష్యాన్ని పంచుకోవడంతోపాటు, కొన్ని ప్రాథమిక అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నాము. ప్రస్తుతం విమానాశ్రయ సహకారంపై మరియు లోక్ మా చౌ లూప్ అభివృద్ధి మేము చర్చలు జరుపుతున్నాము.

నవంబరు 21, 2007న, షెన్‌జెన్ ప్రభుత్వం అధికారంగా ఈ విధానాన్ని ఆమోదించింది, 2020 వరకు షెన్‌జెన్ ప్రణాళికా నమూనాలో దీనిని కూడా చేర్చింది. షెన్‌జెన్ మేయర్ జు జోంగ్‌హెంగ్ డిసెంబరు 2007లో హాంకాంగ్‌లో పర్యటించి SAR ప్రభుత్వంతో ఒక మహానగర ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు ప్రకటన వెలువడింది.[23]

మొదట హాంకాంగ్ ప్రభుత్వేతర సంస్థ బావుహినియా రీసెర్చ్ ఫౌండేషన్ ఆగస్టు 2007లో ఈ ప్రణాళికలను వివరించింది, దీనిలో ఆర్థిక సేవలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఉన్నత-స్థాయి పరిశోధన మరియు అభివృద్ధి, రవాణా, పర్యావరణం వంటి అంశాలు దీనిలో ఉన్నాయి. షెన్‌జెన్-హాంకాంగ్ సంయుక్త మహానగరం 2020నాటికి GDP పరంగా న్యూయార్క్ నగరం మరియు టోక్యో తరువాత ప్రపంచంలో మూడో అతిపెద్ద మహానగరంగా నిలుస్తుందని సూచించింది. షెన్‌జెన్-కు చెందిన ప్రభుత్వేతర నిపుణ సంస్థ చైనా డెవెలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఈ ప్రణాళికకు మద్దతు పలికింది.[24]

నౌకాశ్రయం[మార్చు]

షెన్‌జెన్‌లోని మిన్సక్ వరల్డ్ థీమ్ పార్కు యొక్క ప్రధాన ద్వారం

చైనాలోని గుయంగ్‌డోంగ్ ప్రావీన్స్‌లో పెరల్ నది మైదానంలో ఉన్న షెన్‌జెన్ నౌకాశ్రయం హాంకాంగ్ పక్కనే ఉంది. నగరం యొక్క 260 కిమీ తీర ప్రాంతాన్ని కౌలూన్ ద్వీపకల్పం రెండు సగభాగాలుగా విభజిస్తుంది, అవి తూర్పు అర్ధ భాగం మరియు పశ్చిమ అర్ధ భాగం. షెన్‌జెన్ యొక్క పశ్చిమ నౌకాశ్రయ ప్రాంతం పెరల్ నది ముఖద్వారంలో లింగ్‌డింగ్‌యాంగ్‌కు తూర్పు భాగంలో ఉంది, అద్భుతమైన సహజ రక్షణలతో ఇక్కడ లోతైన సముద్రంలో నౌకాశ్రయం ఏర్పాటైంది. ఇది దక్షిణాన హాంకాంగ్ నుంచి సుమారుగా 20 nautical miles (37 km) దూరంలో మరియు ఉత్తరాన గుయంగ్‌ఝౌ నుంచి 60 nautical miles (110 km) దూరంలో ఉంది. పెరల్ నది వ్యవస్థను దాటి వెళితే, పశ్చిమ నౌకాశ్రయ ప్రాంతం ఈ నది మైదాన ప్రాంతంలో ఉన్న నగరాలు మరియు కౌంటీలతో అనుసంధానం చేయబడివుంది; ఆన్ సీ డున్ జలమార్గం గుండా, ఇది దేశంలోని మరియు విదేశాల్లోని మిగిలిన నౌకాశ్రయాలతో అనుసంధానాలు కలిగివుంది. తూర్పు నౌకాశ్రయ ప్రాంతం డాపెంగ్ అఖాతంల ఉత్తర భాగంలో ఉంది, ఇక్కడ నౌకాశ్రయం విశాలంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది, దక్షిణ చైనాలో ఉత్తమైన సహజ నౌకాశ్రయంగా ఇది పరిగణించబడుతుంది.

షెన్‌జెన్ నౌకాశ్రయం నుంచి 2005లో రికార్డు స్థాయిలో సరుకు రవాణా నౌకల కార్యకలాపాలు సాగాయి, ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో నాలుగో స్థానంలో ఉన్న షెన్‌జెన్‌లో వాణిజ్య కార్యకలాపాలు పెరగడం వలన సరుకు రవాణా కూడా వృద్ధి చెందింది. చైనా ఇంటర్నేషనల్ మెరైన్ కంటైనర్‌లు మరియు ఇతర సరుకు రవాణా సంస్థలు ఈ నౌకాశ్రయంలో 16.2 మిలియన్ల ప్రామాణిక 20-foot (6.1 m) బాక్స్‌లను గత ఏడాది రవాణా చేశాయి, ముందు ఏడాదితో పోలిస్తే ఇక్కడ కార్యకలాపం 19 శాతం మేర పెరిగింది. షెన్‌జెన్‌లో పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరుగుతున్న సరుకు రవాణాతో వృద్ధి చెందుతుంది.

యాంతియాన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్, చివాన్ కంటైనర్ టెర్మినళ్లు, షెకౌ కంటైనర్ టెర్మినళ్లు, చైనా మర్చంట్స్ పోర్ట్ మరియు షెన్‌జెన్ హైక్సింగ్ (మవాన్ పోర్ట్)లు షెన్‌జెన్‌లోని ప్రధాన నౌకా టెర్మినళ్లుగా ఉన్నాయి.

రవాణా[మార్చు]

షెన్‌జెన్‌కు వాయు, రైలు, సముద్ర లేదా రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

వాయు రవాణా[మార్చు]

షెన్‌జెన్ బావోయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం
షెన్‌‍జెన్ రైల్వే స్టేషన్ నుంచి కనిపించే దృశ్యం
షెన్‌జెన్ మెట్రో

షెన్‌జెన్ బావోయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా షెన్‌జెన్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు సాగిస్తుంది. సెంట్రల్ షెన్‌జెన్‌కు ఈ విమానాశ్రయం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది నగరాన్ని చైనాలోని అనేక ఇతర ప్రాంతాలతో కలుపుతుంది, కొన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా ఇక్కడ నుంచి నేరుగా ప్రయాణించవచ్చు. హాంకాంగ్‌లో ఉన్న పౌరులు చైనా ప్రధాన భూభాగంలో ఉన్న ప్రాంతాలకు షెన్‌జెన్ నుంచి విమాన ప్రయాణాలు చేయడం చౌకగా ఉంటుంది, హాంకాంక్ నుంచి ఈ గమ్యస్థానాలకు వెళ్లడం ఎక్కువ ఖర్చుతో ముడిపడివుంది, ఇదిలా ఉంటే చైనా ప్రధాన భూభాగంలో దక్షిణ ప్రాంతంలో ఉన్న చైనీయులు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లడం హాంకాంగ్ నుంచి తక్కువ ఖర్చుతో కూడుకొనివుంటుంది.

రైలు[మార్చు]

షెన్‌జెన్ రైల్వే స్టేషన్ జియాన్‌షి లు, హెపింగ్ లు మరియు రెన్మిన్ నాన్ లు కూడలిలో ఉంది, చైనాలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుంచి రైలు సేవలు నిర్వహించబడుతున్నాయి. గుయంగ్‌ఝౌకు ఇక్కడ నుంచి వెంటవెంటనే హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి, అంతేకాకుండా బీజింగ్, షాంఘై, చాంగ్షా, జియుజియాంగ్, మావోమింగ్, షాంటౌ మరియు ఇతర గమ్యస్థానాలకు సుదూర ప్రాంతాల రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. హాంకాంగ్ యొక్క హంగ్ హామ్ MTR స్టేషన్ నుంచి లు వు మరియు లోక్ మా చావు సరిహద్దు మార్గాలకు వరుసగా ప్రతి 43 నిమిషాలు మరియు 45 నిమిషాలకు ఒక రైలు సేవ ఉంది. హంగ్ హామ్ నుంచి లో వుకు వెళ్లే రైళ్లు ఉదయం 5:36 నుంచి రాత్రి 11:13 గంటల వరకు ప్రతి 6-8 నిమిషాలకు నడుస్తున్నాయి. లో వు వద్ద సరిహద్దును దాటే అవకాశం ప్రతి రోజు ఉదయం 6:30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉంటుంది. లోక్ మా చావు సరిహద్దు మార్గాన్ని సుమారుగా రాత్రి 10:30 గంటలకు మూసివేస్తారు. లోక్ మా చావు సరిహద్దు మార్గం తరచుగా లో వు సరిహద్దు మార్గం కంటే తక్కువ రద్దీతో ఉంటుంది, అందువలన ఇమ్మిగ్రేషన్ రేఖలు ఉన్న తక్కువగా ఉంటాయి. లో వు నుంచి హంగ్ హామ్ తిరిగి వచ్చే రైళ్లు ఉదయం 6:38 గంటల నుంచి రాత్రి 12:30 గంటల వరకు ప్రతి 6-8 నిమిషాలకు ఉంటాయి. లోక్ మా చావు రైళ్లు 10 నిమిషాల కాలవ్యవధితో నడుస్తున్నాయి.

నగరంలో మరో రైల్వే స్టేషన్ నాన్షాన్ జిల్లాలోని షెన్‌జెన్ జిలో ఉంది, ఇక్కడ నుంచి హెఫెయ్‌కు నడిచే రైలు సేవలతోపాటు, అతికొద్ది సుదూర ప్రాంతాల రైళ్లు నడపబడుతున్నాయి.

షెన్‌జెన్ మెట్రో వ్యవస్థ డిసెంబరు 27, 2004న ప్రారంభమైంది. దీనిలో రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి లువోహు నుంచి (లు వు మరియు షెన్‌జెన్ రైల్వే స్టేషన్‌లు) విండో ఆఫ్ ది వరల్డ్‌కు మరియు రెండోది ఫుతియాన్ కోయువాన్ నుంచి షావోయోనియాన్ గాంగ్ (యూత్ ప్లేస్) వరకు ఉంది. ఒక కొత్త మార్గం నిర్మాణంలో ఉంది, 2010 ద్వితీయార్ధంలో దీనిపై రాకపోకలు ప్రారంభమవతాయని భావిస్తున్నారు.

సముద్ర రవాణా[మార్చు]

సెజ్ పశ్చిమ అంచున ఉన్న షెకోయును ఝుహై, మాకౌ, హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం, కౌలూన్ మరియు హాంకాంగ్ ద్వీపం తదితర ప్రాంతాలతో వేగవంతమైన ఫెర్రీలు (పడవలు) కలుపుతున్నాయి.

షెన్‌జెన్ నగరానికి నైరుతీ మరియు ఆగ్నేయ భాగంలో తీర ప్రాంతాలు ఉన్నాయి, చైనాలో అత్యంత ప్రసిద్ధ మరియు ఉత్తమైన బీచ్‌లు ఈ నగరంలో ఉన్నాయి. డామీషా మరియు జియావోమీషా వంటి బీచ్‌లు స్థానికులు మరియు పర్యాటకులతో తరచుగా రద్దీగా కనిపిస్తుంటాయి. చైనాలోని అత్యంత ఉత్తమైన బీచ్‌లలో ఒకటైన జిచోంగ్‌కు షెన్‌జెన్ ప్రధాన పట్టణ ప్రాంతం నుంచి గంట ప్రయాణంతో చేరుకోవచ్చు, ఈ బీచ్ ఇప్పటికీ పురాతన సహజ అందాలను కాపాడుకుంటుంది.

రోడ్లు[మార్చు]

ఫిబ్రవరి 2003 నుంచి, హాంకాంగ్‌లోని హుయంగ్‌గాంగ్ మరియు లోక్ మా చావు రోడ్డు సరిహద్దు మార్గాలు ప్రతి రోజూ 24 గంటలపాటు తెరచివుంటాయి. ప్రైవేట్ వాహనం లేదా బస్సు ద్వారా ఈ మార్గాల్లో ప్రయాణాలు సాగించవచ్చు. ఆగస్టు 15, 2007న, లోక్ మా చావు-హుయంగ్‌గాంగ్ పాదచార సరిహద్దు మార్గం లోక్ మా చావు స్టేషన్‌ను హుయంగ్‌గాంగ్‌తో కలుపుతుంది. ఈ సరిహద్దు మార్గాన్ని ప్రారంభించడంతో, లోక్ మా చావు ట్రాన్స్‌పోర్ట్ ఇంటర్‌చేంజ్ మరియు హుయంగ్‌గాంగ్ మధ్య షటిల్ బస్సు సేవలను నిలిపివేశారు.

ట్యాక్సీలు మీటర్లతో నడుస్తాయి, ఇవి మూడు రంగుల్లో ఉంటాయి. ఎరుపు ట్యాక్సీలు ఎక్కడికైనా ప్రయాణించే అనుమతులు కలిగివుంటాయి; పచ్చని ట్యాక్సీలకు సెజ్ వెలుపలి ప్రాంతానికి పరిమితం చేయబడ్డాయి, పసుపు ట్యాక్సీలకు సెజ్‌లోపల ప్రాంతాల్లో నడిపేందుకు అనుమతి ఇచ్చారు.

హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హుయంగ్‌గాంగ్‌కు మరియు షెన్‌జెన్‌లోని ప్రధాన హోటళ్లకు తరచుగా బస్సు మరియు వ్యాను సేవలు కూడా నిర్వహించబడుతున్నాయి.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

జిచోంగ్ బీచ్

షెన్‌జెన్ యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో చైనీస్ ఫోక్ కల్చర్ విలేజ్, విండో ఆఫ్ ది వరల్డ్, హ్యాపీ వ్యాలీ, స్ప్లెండిడ్ చైనా, నాన్షాన్ జిల్లాలోనిసఫారీ పార్కు, డామీషా ప్రోమెనాడ్, యాంతియాన్ జిల్లాలోని, జోంగ్‌యింగ్ జీ/చుంగ్ యింగ్ స్ట్రీట్, జియాన్హు లేక్ బొటానికల్ గార్డెన్ మరియు మిన్సక్ వరల్డ్. నగరంలో అనేక ప్రజా పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు, అవి లియాన్‌హువాషాన్ పార్కు, లిజీ పార్కు, జోంగ్‌షాన్ పార్కు మరియు వుటోంగ్‌షాన్ పార్కు.

షెన్‌జెన్‌లో ఇరవైకిపైగా నగర ప్రజా పార్కులు ఉన్నాయి; వీటిలో ముఖ్యమైనవి బిజియాషాన్ పార్కు, కైతియాన్ పార్కు, కుయిజు పార్కు, డోంగ్షు పార్కు, ఎర్‌టోంగ్ పార్కు, హైబిన్ షెంగ్‌టై పార్కు (దీనిని హాంగ్‌షులిన్ పార్కుగా కూడా గుర్తిస్తారు) హోంగు పార్కు, హుయంగ్‌గాంగ్ పార్కు, లియాన్‌హువాషాన్ పార్కు, లిలిన్ పార్కు, లిగ్జియాంగ్ పార్కు, లిజి (ఫుతియాన్ జిల్లా) పార్కు, లిజి (నాన్షాన్ జిల్లా), లువోహు వెన్హువా పార్కు, మీలిన్ పార్కు, నాన్షాన్ పార్కు (దీనిని డా నాన్షాన్‌గా కూడా గుర్తిస్తారు), రెన్మిన్ పార్కు, షిగుషాన్ పార్కు, సిహై పార్కు, సాంగ్‌పింగ్‌షాన్ పార్కు, జోంగ్‌జిన్ పార్కు (దీనిని సెంట్రల్ పార్కుగా కూడా గుర్తిస్తారు) మరియు జోంగ్‌షాన్ పార్కు.[25]

షెన్‌జెన్ నగరంలోని అసంఖ్యాక రెస్టారెంట్‌లు విస్తృతమైన వంటలు కూడా అందిస్తున్నాయి.

అయితే కొందరు పర్యాటకులు షెకౌగా పిలిచే ఎక్కువగా వలసదారులు స్థిరపడిన సమూహంలో ఉండేందుకు ఇష్టపడతారు, సీ వరల్డ్ అని పిలిచే ప్రాంతంలో ఒక పెద్ద ఫ్రెంచ్ నౌకను భూస్థాపితం చేశారు.[26] షెకౌ ఇటీవల సంవత్సరాల్లో బాగా విస్తరించబడటంతోపాటు, ఆధునిక హంగులు దిద్దుకుంది, ఇది సముద్రం నుంచి మరికొంత భూభాగాన్ని పొందింది.

షెన్‌జెన్ యొక్క సెంట్రల్ మ్యూజిక్ హాల్ మరియు లైబ్రరీలు షెన్‌జెన్ కల్చరల్ సెంటర్‌లో ఉన్నాయి.

ఇటీవల సంవత్సరాల్లో, బ్యాక్‌ప్యాకర్‌లతోపాటు షెన్‌జెన్ తూర్పు తీరం (తీరప్రాంతం) మరింత మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉన్న అత్యంత ప్రసిద్ధ బీచ్‌గా గుర్తించబడుతున్న జిచోంగ్, డాపెంగ్ ద్వీపకల్పం దక్షిణ భాగంలో ఉంది.

ప్రసార మాధ్యమాలు[మార్చు]

షెన్‌జెన్ దినపత్రిక షెన్‌జెన్ నగరం, చైనా మరియు ప్రపంచానికి సంబంధించిన వార్తలను అందిస్తుంది, దీనికి ఒక ఆంగ్ల-భాషా ఆన్‌లైన్ ఎడిషన్ కూడా ఉంది. ముఖ్యంగా షెన్‌జెన్ శకం గురించి ఉండే దీనిలో అంశాలు షెన్‌జెన్ నగరంలో ఇప్పుడు నివసించని ప్రవాసులకు ఆసక్తికరంగా ఉంటాయి, వీరికి చలనచిత్రాలు, ప్రయాణం, షాపింగ్, రెస్టారెంట్‌లు మరియు ఇతర వినోద అంశాలు ప్రధానాకర్షణలుగా ఉంటాయి.

క్రీడలు[మార్చు]

26వ వేసవి యూనివర్సియాడ్‌కు ఆగస్టు 12, 2011న షెన్‌జెన్ నగరం ఆతిథ్యం ఇస్తుంది.[[[[]]]] [27]. ప్రస్తుతం షెన్‌జెన్ నగరంలో ఈ ప్రధాన క్రీడా కార్యక్రమం కోసం క్రీడా వేదికలు నిర్మిస్తున్నారు. [28]

విద్య[మార్చు]

కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు[మార్చు]

  • షెన్‌జెన్ యూనివర్శిటీ
  • షెన్‌జెన్ పాలిటెక్నిక్
  • షెన్‌జెన్ రేడియో అండ్ టీవీ యూనివర్శిటీ
  • షెన్‌జెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  • షెన్‌జెన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ పెకింగ్ యూనివర్శిటీ
  • షెన్‌జెన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సింగువా యూనివర్శిటీ
  • షెన్‌జెన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ హార్బిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
  • సదరన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధికారిక వెబ్‌సైట్ మూస:Zh icon

ఉన్నత పాఠశాలలు[మార్చు]

  • షెన్‌జెన్ యుకాయ్ స్కూల్
  • షెన్‌జెన్ మిడిల్ స్కూల్
  • షెన్‌జెన్ ఫారిన్ లాంగ్వేజెస్ స్కూల్
  • షెన్‌జెన్ ఎక్స్‌పరిమెంటల్ స్కూల్
  • షెన్‌జెన్ హై మిడిల్ స్కూల్
  • షెన్‌జెన్ కుయియువాన్ స్కూల్
  • షెన్‌జెన్ హోంగ్లింగ్ స్కూల్
  • షెన్‌జెన్ బావోయాన్ స్కూల్
  • షెన్‌జెన్ ఆర్ట్ స్కూల్
  • షెన్‌జెన్ బిబో స్కూల్
  • షెన్‌జెన్ జియావోయువాన్ స్కూల్

అంతర్జాతీయ సంబంధాలు[మార్చు]

జంట నగరాలు - సోదరి నగరాలు[మార్చు]

షెన్‌జెన్‌తో జంట చేయబడినవి:

వీటిని కూడా చూడండి[మార్చు]

  • పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆర్థిక వ్యవస్థ
  • పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క ప్రత్యేక ఆర్థిక మండళ్లు
  • చైనా రాజకీయ డివిజన్‌లు
  • షాం చున్ నది (షెన్‌జెన్ నదిగా కూడా గుర్తించబడుతుంది)
  • షెన్‌జెన్ షాంగ్‌ఖిన్‌గ్యిన్
  • ప్రత్యేక ఆర్థిక మండలి

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 "深圳市2009年国民经济和社会发展统计公报" (in Simplified Chinese). Shenzhen Municipal Statistic Bureau. 2010-04-26. Retrieved 2010-05-03. 
  2. "Shenzhen". U.S. Commercial Service. 2007. Retrieved 2008-02-28. 
  3. "Modern Shenzhen and its rediscovered past". Lonely Writers Publishing. 
  4. "The spirit of enterprise fades: Capitalism in China". The Economist 394 (8666): 61. 23 January 2010. Retrieved 28 January 2010. 
  5. షెన్‌జెన్ గవర్నమెంట్ ఆన్ లైన్, Citizens' Life (Recovered from the వేబాక్ మషీన్ నుండి పునః పొందబడినది)
  6. షెన్‌జెన్ డైలీ 13 జూన్ 2007
  7. tmcnet.com
  8. sz.gov.cn[dead link]
  9. "top skylines". Diserio.com. Retrieved 2010-05-05. 
  10. [266] ^ "మమ్మల్ని సంప్రదించండి." హువావి . ఫిబ్రవరి 23, 2008న పొందబడినది.
  11. RightSite.asia | షెన్‌జెన్ హై-టెక్ ఇండస్ట్రియాల్ డెవ్లప్మెంట్ జోన్
  12. RightSite.asia | షెన్‌జెన్ సాఫ్ట్వేర్ పార్క్
  13. szse.cn main[dead link]
  14. "one-stop portal of the Hong Kong SAR Government / 香港政府一站通". GovHK. Retrieved 2010-05-05. 
  15. 15.0 15.1 గణాంకాల కోసం HKG మంత్లి డైజెస్ట్
  16. HKG ట్రాఫ్ఫిక్ మరియు ట్రాన్స్పోర్ట్ డైజెస్ట్
  17. HKG క్రాస్ బొడర్ సర్వే 2004
  18. HKG షిప్పింగ్ గణాంకాలు
  19. HKG ట్రేడ్ మరియు ఇండస్ట్రి గణాంకాలు
  20. 20.0 20.1 "Hong Kong International Airport - Your Regional Hub with Worldwide Connections and Gateway to China". Hongkongairport.com. Retrieved 2010-05-05. 
  21. HKG క్రాస్ బొడర్ సర్వే 1999 & 2003
  22. "2007-08". Policy Address. 2007-10-10. Retrieved 2010-05-05. 
  23. 大汉网络. "SZ-HK metropolis on agenda". Paper.sznews.com. Retrieved 2010-05-05. 
  24. "Shenzhen 'worthy' partner for HK". china.org.cn. Retrieved 2010-05-05. 
  25. ది సిటీ పార్క్స్ అఫ్ షెన్‌జెన్ షెన్‌జెన్ యొక్క పట్టణ ఉద్యానవనాలు ~ ఫిబ్రవరి 2, 2010న గ్రహింపబడినది.
  26. "About us". Szseaworld.com. Retrieved 2010-05-05. 
  27. "2011 Summer Universiade". International University Sports Federation. Retrieved 2010-09-20. 
  28. http://www.startinchina.com/shenzhen/universiade/universiade_2011_shenzhen.html ఫొటోస్ కన్స్ట్రక్షన్ స్టేడియమ్స్ యునివర్సిటి షెన్‌జెన్

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
Articles Related to Shenzhen

మూస:Shenzhen

Gnome-globe.svg Geographic locale

Lat. and Long. 22°33′N 114°06′E / 22.550°N 114.100°E / 22.550; 114.100 మూస:Guangdong మూస:Metropolitan cities of the People's Republic of China మూస:Pearl River Delta మూస:SEZ మూస:Most populous cities in the People's Republic of China మూస:World's most populated metropolitan areas మూస:World's most populated urban areas

"http://te.wikipedia.org/w/index.php?title=షెన్‌జెన్&oldid=814946" నుండి వెలికితీశారు